Viral Video: విద్యార్థినిలతో కలిసి స్టెప్పులు వేసిన యంగ్ టీచర్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

విద్యార్థినిలకు సమ్మర్ క్లాసెస్ ముగింపు సందర్భంగా ఉపాధ్యాయురాలు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. విద్యార్థినిలతో డ్యాన్స్ చేయించడంతో పాటు వారితో కలిసి ఆమెకూడా స్టెప్పులు వేసింది. ఈ వీడియోను స్వయంగా ఉపాధ్యాయురాలు ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. వీడియోలో టీచర్, విద్యార్థినిల స్టెప్పులు చూసిన నెటిజన్లు టీచర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Viral Video: విద్యార్థినిలతో కలిసి స్టెప్పులు వేసిన యంగ్ టీచర్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

Young Teacher Dance

Viral Video: విద్యార్థినిలకు సమ్మర్ క్లాసెస్ ముగింపు సందర్భంగా ఉపాధ్యాయురాలు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. విద్యార్థినిలతో డ్యాన్స్ చేయించడంతో పాటు వారితో కలిసి ఆమెకూడా స్టెప్పులు వేసింది. ఈ వీడియోను స్వయంగా ఉపాధ్యాయురాలు ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. వీడియోలో టీచర్, విద్యార్థినిల స్టెప్పులు చూసిన నెటిజన్లు టీచర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను షేర్ చేసిన కొద్దిగంటల్లోనే 564k మంది వీక్షించారు.

Viral Video: లక్షలాది కప్ప పిల్లల సైన్యాన్ని మీరెప్పుడైనా చూశారా.. ఒళ్లు గగ్గురు పొడిచే వీడియో…

ఢిల్లీలోని ఓ స్కూల్లో సమ్మర్ క్యాంప్ చివరి రోజు టీచర్ విద్యార్థులతో డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తరగతి గదిలో బేంచీల మధ్య ఈ డ్యాన్స్ వేశారు. కిస్మత్ అనే హిందీ చిత్రంలోని ఎవర్‌గ్రీన్ పాట కజ్రా మొహబ్బత్ వాలాకు డ్యాన్స్ చేశారు. ప్రదర్శనలో భాగంగా తొలుత విద్యార్థినులు మధ్యలో టీచర్, మళ్లీ చివరిలో విద్యార్థినులు నిలుచున్నారు. డ్యాన్స్ ప్రారంభం కాగానే నడుము ఊపుకుంటూ ఒక్కో విద్యార్థి డ్యాన్స్ చేస్తూ ముందుకు కదిలారు.. ఇలా వారి వెనుక టీచర్ కూడా డ్యాన్స్ వేస్తూ ముందుకు కదిలింది. కొద్దిసేపు టీచర్, విద్యార్థులు డ్యాన్స్ చేశారు. ఉపాధ్యాయురాలు చేసిన డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నెమలి నాట్యమాడినట్లుగా ఉదంటూ ప్రశంసిస్తున్నారు.

ఈ వీడియో క్లిప్ ను ఉపాధ్యాయురాలు స్వయంగా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ టీచర్ పేరు మను గులాటి. ఆమె ట్విట్టర్ బయోడేటా ప్రకారం.. Ms గులాటీ ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు. ఉపాధ్యాయ వృత్తిలో ఆమె ఎన్నో అవార్డులు అందుకుంది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతులుమీద కూడా ఆమె అవార్డును అందుకుంది. అయితే ఈ వీడియోకు గులాటీ అద్భుత క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. నృత్యాన్ని చూస్తుంటే మనస్సులో తెలియని సంతోషం ఉప్పొంగుతుంది అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నారు. ఈ ఉదయం నేను చూసిన అత్యంత స్ఫూర్తిదాయకమైన వీడియో ఇది అంటూ మరో నెటిజన్ ప్రశంసించారు.

Cows Dead: షాకింగ్ వీడియో.. ఒకేచోట వేలాది ఆవుల మృతదేహాలు.. కారణమేమిటంటే..