Cows Dead: షాకింగ్ వీడియో.. ఒకేచోట వేలాది ఆవుల మృతదేహాలు.. కారణమేమిటంటే..

యూస్‌లో షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వీడియో చూసిన వారంతా ఆశ్చర్య పోతున్నారు. సుమారు రెండువేలకు పైగా ఆవులు చనిపోయినట్లు ఈ వీడియో కనిపిస్తుంది. ఈ ఘటన కాన్సాస్ స్టేట్ లో చోటు చేసుకుంది. అయితే ఈ అవులు ఎలా చనిపోయాయనే విషయాపై పలు రకాల వాధనలు వినిపిస్తున్నాయి.

Cows Dead: షాకింగ్ వీడియో.. ఒకేచోట వేలాది ఆవుల మృతదేహాలు.. కారణమేమిటంటే..

Dead Cows

Cows Dead: యూస్‌లో షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వీడియో చూసిన వారంతా ఆశ్చర్య పోతున్నారు. సుమారు రెండువేలకు పైగా ఆవులు చనిపోయినట్లు ఈ వీడియో కనిపిస్తుంది. ఈ ఘటన కాన్సాస్ స్టేట్ లో చోటు చేసుకుంది. అయితే ఈ అవులు ఎలా చనిపోయాయనే విషయాపై పలు రకాల వాధనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ కారణంగా అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో తట్టుకోలేక ఆవులు చనిపోయినట్లు తెలుస్తోంది. యునైటెడ్ స్టేట్స్ అంతటా రికార్డు స్థాయిలో ఎండ తీవ్రత ఉంది. ఈ వేడిక కారణంగా పశువులు చనిపోయినట్లు అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. సుమారు రెండువేల పశువులు మరణించాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే తొలుత ఈ షాకింగ్ వీడియో టిక్ టాక్ లో పోస్ట్ అయింది. ఆ రుతవాత ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లలో కనిపించింది. ఒకే ప్రాంతంలో వేలాదిగా పశువులు చనిపోయి ఉండటాన్ని ఈ వీడియో గమనించొచ్చు.

Viral Video: లక్షలాది కప్ప పిల్లల సైన్యాన్ని మీరెప్పుడైనా చూశారా.. ఒళ్లు గగ్గురు పొడిచే వీడియో…

ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో వారాంతంలో ఈ పశువులు చనిపోయినట్లు కాన్సాస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఎన్విరాన్‌మెంట్‌కు మృతదేహాలను ఖననం చేసేందుకు సహాయం కోసం కల్పించిన సౌకర్యాల ద్వారా మరణాలు నివేదించబడ్డాయని అవుట్‌లెట్ తెలిపింది. ఎగువ మిడ్‌వెస్ట్, ఆగ్నేయ యుఎస్‌ ప్రాంతాల్లో వెచ్చటి గాలులు వీస్తుండటంతో 120మిలియన్ల మంది ప్రజలు రక్షణ చర్యలు చేసుకొని జీవిస్తున్నారు. అదేవిధంగా కాన్సాస్ లో కూడా తీవ్ర ఎండవేమిడి ఉంది. అయితే యూఎస్ లోని బీఫ్ ఉత్పత్తిదారులలో ఈ రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (EPA) ప్రకారం.. 1960ల నుండి నాలుగు దశాబ్దాలలో దేశంలో వేడి గాలుల తీవ్రతతో క్రమంగా పెరుగుతున్నాయి. ఇండియానా, కెంటకీ, ఒహియోలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 109 డిగ్రీల ఫారెన్‌హీట్ (43 డిగ్రీల సెల్సియస్)కు చేరుకుంటుందని నేషనల్ వెదర్ సర్వీస్ (NWS) హెచ్చరించింది.