Viral Video: లక్షలాది కప్ప పిల్లల సైన్యాన్ని మీరెప్పుడైనా చూశారా.. ఒళ్లు గగ్గురు పొడిచే వీడియో…

పల్లెల్లో చెరువుల వద్ద, బావుల్లో కప్పల(Frogs)ను తరచూ చూస్తుంటాం. పదుల సంఖ్యలో కనిపిస్తాయి. అవి అంతగా భయంకరంగా అనిపించవు. కానీ పది లక్షల కప్పలను ఒకేసారి చూస్తే.. అన్నికప్పుల ఒకే చోట ఎందుకు ఉంటాయిలే అనుకుంటున్నారా.. ఓ వ్యక్తి తన పెరట్లో కప్పల సైన్యాన్ని తయారు చేశాడు. అన్నీ చిన్న పిల్లలే.. ఆ వీడియోను చూస్తే ఒక్కసారిగా మీ ఒంట్లో వణుకు పుట్టడం ఖాయం.

Viral Video: లక్షలాది కప్ప పిల్లల సైన్యాన్ని మీరెప్పుడైనా చూశారా.. ఒళ్లు గగ్గురు పొడిచే వీడియో…

Frogs

Viral Video: పల్లెల్లో చెరువుల వద్ద, బావుల్లో కప్పల(Frogs)ను తరచూ చూస్తుంటాం. పదుల సంఖ్యలో కనిపిస్తాయి. అవి అంతగా భయంకరంగా అనిపించవు. కానీ పది లక్షల కప్పలను ఒకేసారి చూస్తే.. అన్నికప్పుల ఒకే చోట ఎందుకు ఉంటాయిలే అనుకుంటున్నారా.. ఓ వ్యక్తి తన పెరట్లో కప్పల సైన్యాన్ని తయారు చేశాడు. అన్నీ చిన్న పిల్లలే.. ఆ వీడియోను చూస్తే ఒక్కసారిగా మీ ఒంట్లో వణుకు పుట్టడం ఖాయం. కప్పలన్నీ ఓ సైన్యంలా వెళ్తుంటే వామ్మో.. అనాల్సిందే. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ కప్పల వీడియోను చూసిన కొందరు ఆశ్చర్య పోతుంటే, మరికొందరు భయాందోళన చెందుతూ కామెంట్లు చేస్తున్నారు.

ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్టు చేశాడు. తాను తన తోటల పది లక్షల కప్పల సైన్యాన్ని నిర్మిస్తున్నట్లు ఆ వీడియో చెప్పుకొచ్చాడు. తన వద్ద ఇప్పుడు 1.4 మిలియన్ కప్పల సైన్య ఉందని చెప్పాడు. వీడియోలో.. కప్ప పిల్లలను కొలనులో పోసిన దగ్గర నుంచి మళ్లీ అవి పెరిగిన తరువాత ఎలా ఉన్నాయో చూపించాడు. కప్ప పిల్లలు గుంపులుగా పోతుండటాన్ని, మళ్లీ కప్పలు కొంచెం పెద్దగా మారినప్పుడు పరుగులు పెడుతున్న వీడియోను చూపించాడు. ఈ వైరల్ వీడియోలో.. 95రోజుల క్రితం నేను 1.4 మిలియన్ కప్ప గుడ్లను సేకరించి కప్ప సైన్యం కోసం కొలనులో పోశానని తెలిపాడు. ఇప్పుడు మిలియన్ చిన్న కప్పలు తన గార్డెన్ చుట్టూ తిరుగుతున్నాయి. నేను తోటలో గడ్డిమీద నడుస్తానని అనుకోవటం లేదు.. ఇకపై అతిపెద్ద కప్పల సైన్యం నా గార్డెన్ ఆక్రమించేశాయి. కానీ నేను ఇప్పుడు దీనికి చింతిస్తున్నాను అంటూ అతను వీడియోలో చెప్పాడు.

Rats stole Gold: బంగారాన్ని ఎత్తుకెళ్లిన ఎలుకలు.. ఎలా గుర్తించారంటే..

గార్డెన్‌లోకి ఎవరూ వెళ్లలేరని, పూర్తి గార్డెన్ ను లక్షలాది కప్పలు తమ ఆదీనంలోకి తీసుకున్నాయని, ఇంకా దాదాపు అర మిలియన్ కప్ప పిల్లలను వృద్ధి చేసేందుకు నిర్ణయించానని అతడు చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను ట్విట్టర్‌లో 2.8 లక్షల మంది వీక్షించారు. చాలా మంది అతడి చిన్న ప్రయోగం గురించి ఆందోళన వ్యక్తంచేస్తూ ట్వీట్లు చేశారు.