UK PM race: బ్రిటిష్ ప్రధాని రేసు నుంచి తప్పుకుంటున్నాను: బోరిస్ జాన్సన్ ప్రకటన

బ్రిటిష్ ప్రధానిగా భారత సంతతి నేత రిషి సునక్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఆ బాధ్యతలు స్వీకరిస్తే బ్రిటిష్ ప్రధాని అయిన మొట్టమొదటి భారత సంతతి నేతగా నిలుస్తారు. ఆయనకు 144 మంది ఎంపీల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే అభ్యర్థిపై కన్జర్వేటివ్ పార్టీ ఏకాభిప్రాయానికి వస్తే రిషి సునక్ ను ఇవాళ సాయంత్రంలోపు తమ పార్టీ నాయకుడిగా, బ్రిటిష్ ప్రధానమంత్రిగా ప్రకటించే అవకాశం ఉంది.

UK PM race: బ్రిటిష్ ప్రధాని రేసు నుంచి తప్పుకుంటున్నాను: బోరిస్ జాన్సన్ ప్రకటన

Boris

UK PM race: బ్రిటిష్ ప్రధాని, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి రేసుల్లో నిలవబోనని చెబుతూ బోరిస్ జాన్సన్ అందరినీ ఆశ్చర్యపర్చే ప్రకటన చేశారు. బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి పోటీ రేసులో తాను నిలుస్తున్నట్లు ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంత‌తి నేత రిషి సునక్ నిన్న అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి నుంచి బోరిస్‌ జాన్సన్‌ వైదొలగుతున్న నేపథ్యంలో ఆ ప‌ద‌వికి రిషి సునక్ పోటీ చేస్తూ తుది రేసులో నిలిచినా, చివరకు లిజ్‌ ట్రస్ చేతిలో రిషి సునక్ ఓడిపోయారు.

ఇటీవల ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. దీంతో బోరిస్ జాన్సన్ మళ్ళీ ప్రధాని పదవికి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, ఈ రేసు నుంచి తాను తప్పుకుంటున్నానని ఆయన నిన్న సాయంత్రం స్పష్టం చేశారు. తనకు 100 మందికి పైగా ఎంపీల మద్దతు ఉన్నప్పటికీ తమ పార్టీ ఐక్యత కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తమ పార్టీ నాయకుడిగా ఎవరు గెలిచినా తాను వారికి మద్దతు ఇస్తానని చెప్పారు.

దీంతో బ్రిటిష్ ప్రధానిగా రిషి సునక్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఆ బాధ్యతలు స్వీకరిస్తే బ్రిటిష్ ప్రధాని అయిన మొట్టమొదటి భారత సంతతి నేతగా నిలుస్తారు. ఆయనకు 144 మంది ఎంపీల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే అభ్యర్థిపై కన్జర్వేటివ్ పార్టీ ఏకాభిప్రాయానికి వస్తే రిషి సునక్ ను ఇవాళ సాయంత్రంలోపు తమ పార్టీ నాయకుడిగా, బ్రిటిష్ ప్రధానమంత్రిగా ప్రకటించే అవకాశం ఉంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..