బ్రిటన్ ప్రధానికి ఎదురుదెబ్బ : పార్లమెంట్ సస్పెండ్ చట్టవ్యతిరేకమన్న సుప్రీం

  • Published By: venkaiahnaidu ,Published On : September 24, 2019 / 10:31 AM IST
బ్రిటన్ ప్రధానికి ఎదురుదెబ్బ : పార్లమెంట్ సస్పెండ్ చట్టవ్యతిరేకమన్న సుప్రీం

బ్రెగ్జిట్ కోసం 5వారాలపాటు పార్లమెంట్ ను సస్పెండ్ చేస్తూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్స‌న్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. పార్లమెంట్ ను సస్పెండ్ చేయడం చ‌ట్ట‌వ్య‌తిరేక చ‌ర్య అని సుప్రీంకోర్టు హెడ్ బ్రెండా హేల్ తెలిపారు. ప్ర‌జాస్వామ్య పునాదుల‌ను దెబ్బ‌తీయ‌డం దారుణ‌మ‌ని హేల్ అన్నారు. సుప్రీం తీర్పును ప‌రిశీలిస్తున్న‌ట్లు డౌనింగ్ స్ట్రీట్ వ‌ర్గాలు తెలిపాయి. 

5వారాల పాటు పార్లమెంటును రద్దూ చేస్తున్నట్లు యూకే ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అక్టోబరు 14న పార్లమెంటు సమావేశాలను పునరుద్ధరిస్తారు. పార్లమెంటును ప్రోరోగ్‌ చేస్తూ ప్రధాని బోరిస్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష లేబర్‌ పార్టీ బోరిస్ నిర్ణయంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.