Jair Bolsonaro : బ్రెజిల్ అధ్యక్షుడికి నిరసనల సెగ…గిన్నెలతో సౌండ్లు చేస్తూ ప్రజలు నినాదాలు

బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సెనారోపై దేశ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కరోనా మహమ్మారి బ్రెజిల్ లో ప్రతాపం చూపిస్తున్న క్రమంలో అధ్యక్షుడు జైర్ బొల్సెనారో పట్టించుకోలేదు. కరోనా అనేది కేవలం ఓ ఫ్లూ లాంటిదని కొట్టిపడేశారు. దీంతోదేశంలో కరోనా విలయ తాండవం చేసిది. ఏకంగా లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో అధ్యక్షుడు టీవీలో దేశ ప్రగతి గురించి మాట్లాడుతుండగా ప్రజలు గిన్నెలు..పళ్లాలతో సౌండ్లు చేస్తూ నిరసన వ్యక్తంచేశారు.

Jair Bolsonaro : బ్రెజిల్ అధ్యక్షుడికి నిరసనల సెగ…గిన్నెలతో సౌండ్లు చేస్తూ ప్రజలు నినాదాలు

Jair Bolsonaro

Brazil President Zaire Bolsonaro : ఓ పక్క దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి..మరోపక్క వెల్లవెత్తుతున్న ప్రజల నిరసనలు వెరిసి బ్రిజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సెనారో సతమతమైపోతున్నారు. ప్రజలు తమ అధ్యక్షుడిపై మండిపడుతున్నారు. కరోనా మహమ్మారి విషయంలో అధ్యక్షుడు జైర్ బొల్సెనారో నిర్లక్ష్యంగా వ్యవహరించి..ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు బ్రెజిల్ ప్రజలు. కరోనా అనేది పెద్ద సమస్యే కాదు అదొక చిన్న ఫ్లూ జ్వరంలాంటిదేనని కొట్టిపడేసాడని బొల్సొనారోపై ధ్వజమెత్తారు బ్రెజిల్ ప్రజలు.బుధవారం సాయంత్రం (జూన్2,2021) ఓ సందర్భంగా అధ్యక్షుడు జైర్ బొల్సెనారో ప్రసంగిస్తుండగా..పళ్లాలు, గిన్నెలతో శబ్దాలు చేస్తూ తమ నిరసనల్ని వ్యక్తంచేశారు. దీంతో దేశాధ్యక్షుడు షాక్ అయ్యారు. కరోనాను లైట్ తీసుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారని పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తంచేశారు.

బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సెనారోపై సొంత దేశ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కరోనా మహమ్మారి బ్రెజిల్ లో అప్పుడప్పుడే ప్రతాపం చూపిస్తున్న క్రమంలో దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. సరిగ్గా అదే సమయంలో జైర్ బొల్సెనారో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా అనేది కేవలం ఓ ఫ్లూ లాంటిదని కొట్టిపడేశారు. అంతేకాదు ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనా నియంత్రణ కోసం చర్యలు తీసుకునే భాగంలో పలు రకాల మ్యాచ్ లను రద్దు చేసుకున్నాయి. కానీ బ్రెజిల్ లో మాత్రం కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న సమయంలో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరిగాయి. అటువంటి విపత్కర సమయంలో ఫుడ్ బాల్ మ్యాచ్ లు నిర్వహించింది బ్రెజిల్. అప్పటల్లో ప్రపంచం అంతా మాస్కులు..శానిటైజర్లతో నియంత్రణ చర్యలు పాటిస్తుంటే బ్రెజిల్ మాత్రం ఫుడ్ బాల్ మ్యాచ్ లు నిర్వహిస్తే ప్రజలు ఆనందంగా తిలకించారనే వార్తలు కూడా వచ్చాయి.

దీంతో బ్రెజిల్ ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో అని వార్తలు కూడా వచ్చాయి. కానీ కరోనా సమయంలో ఫుడ్ బాల్ మ్యాచ్ లు నిర్వహించిన ఫలితంగా దేశంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో పెరిగింది. ఎంత తీవ్రంగానంటే రోజుకు నాలుగు వేలకు పైగా కరోనా మరణాలు సంభవించాయి. ఇటువంటి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్ని అదుపులోకి తీసుకురావటంలో అధ్యక్షుడు జైర్ బొల్సెనారో విఫలమయ్యారని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల రెండు రోజుల క్రితం కూడా కూడా లక్షకుపైకా కొత్త కేసులు నమోదయ్యాయి. రెండు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇటువంటి నేపథ్యంలో ప్రజలు దేశాధ్యక్షుడిపై మండిపడిపోతున్నారు. నిరసనలు వ్యక్తంచేస్తున్నారు.

దీంట్లో భాగంగా ప్రజలు బుధవారం (జూన్ 2,2021)సాయంత్రం టీవీ చానల్ లో బొల్సొనారో ప్రసంగిస్తున్నసమయంలో ప్రజలు గిన్నెలు..పళ్లాలతో శబ్దాలు చేస్తూ తమ నిరసనను తీవ్రస్థాయిలో తెలియజేశారు. బొల్సొనారో మాట్లాడుతూ.. ప్రభుత్వం సాధించిన విజయాలను ఏకరవు పెట్టారు. ఆర్థిక వృద్ధి గురించి చెప్పుకొచ్చారు. ఆయన ప్రసంగిస్తుండగానే ప్రజలు గిన్నెలతో శబ్దాలు చేస్తూ నిరసన తెలిపారు. వీధుల్లోకి వచ్చిన ఆందోళనకు దిగారు. దీంతో ప్రజలు మరింతగా తమ నినాదాలను పెంచారు. వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేశారు.

తమ నిరసనలను కంటిన్యూ చేసిన ప్రజలు శనివారం కూడా దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగించారు. బ్రెజిల్ ప్రతిపక్ష పార్టీలతో పాటు విద్యార్థి సంఘాలు కూడా ఆందోళనలో పాల్గొన్నాయి. అధ్యక్షుడు ఓ ఫెయిల్యూర్ అనీ..ఆయనొక రక్త పిశాచిగా పేర్కొంటూ సావోపాలో బెలూన్లు ప్రదర్శించారు. అలా బ్రెజిల్ రాజధాని బ్రసిలియా, రియో డిజనీరోలో సహా 16 నగరాల్లోని వేలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చిన అధ్యక్షుడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన తెలిపారు. బ్రెజిల్ లో అతి పెద్ద నగరమైన సావో పాలోలో వేలాదిమంది ప్రజలు మాస్కులు పెట్టుకుని నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులపై రబ్బర్ బుల్లెల్లు కాల్చారు. అయినా ప్రజలు ఏమాత్రం భయపడలేదు. నిరసనలు వ్యక్తం చేయటం మానకుండా కొనసాగించారు.