Mexico: మెక్సికోలో కుప్పకూలిన కొత్త బ్రిడ్జి.. మురుగు కాలువలో పడ్డ 20 మంది.. వీడియో

మెక్సికోలో ఇటీవ‌లే నిర్మించిన ఓ బ్రిడ్జి ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయింది. ఆ బ్రిడ్జిని ప్రారంభించిన రోజే అది విరిగిప‌డ‌డం గమనార్హం. క్యూర్నావాకా ప్రాంతంలో ఆ బ్రిడ్జిని ప్రారంభించిన న‌గ‌ర మేయ‌ర్ జోసీ లూయీస్ వురియోస్టిగుయి అనంత‌రం జర్న‌లిస్టులు, ప‌ర్యాట‌కుల‌తో క‌లిసి దానిపై న‌డ‌వ‌సాగారు.

Mexico: మెక్సికోలో కుప్పకూలిన కొత్త బ్రిడ్జి.. మురుగు కాలువలో పడ్డ 20 మంది.. వీడియో

Video

Mexico: మెక్సికోలో ఇటీవ‌లే నిర్మించిన ఓ బ్రిడ్జి ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయింది. ఆ బ్రిడ్జిని ప్రారంభించిన రోజే అది విరిగిప‌డ‌డం గమనార్హం. క్యూర్నావాకా ప్రాంతంలో ఆ బ్రిడ్జిని ప్రారంభించిన న‌గ‌ర మేయ‌ర్ జోసీ లూయీస్ వురియోస్టిగుయి అనంత‌రం జర్న‌లిస్టులు, ప‌ర్యాట‌కుల‌తో క‌లిసి దానిపై న‌డ‌వ‌సాగారు. అదే స‌మ‌యంలో అది ఒక్క‌సారిగా కుప్ప‌కూలి మురికికాలువ‌లో ప‌డింది.

Rajya Sabha Polls: ఓటు వేసేందుకు న‌వాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్‌కు అవ‌కాశం ఇవ్వ‌ని కోర్టు

దాదాపు 20 మంది కింద‌ప‌డ్డారు. వారిలో ఎనిమిది మందికి గాయాల‌య్యాయి. దీంతో వెంట‌నే వారిని స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆ బ్రిడ్జి దాదాపు 10 మీట‌ర్ల‌లోతున విరిగి ప‌డింద‌ని స్థానికులు మీడియాకు చెప్పారు. కింద ప‌డిపోయిన వారిలో మేయ‌ర్ భార్య కూడా ఉన్నారు. బ్రిడ్జిపై ఒక్క‌సారిగా చాలా మంది ఎక్క‌డంతో అది కుప్ప‌కూలి ఉండొచ్చ‌ని మేయ‌ర్ అంటున్నారు.