Britain Triplets Guinness Records : ఆరు నెలల్లోపే పుట్టి ఆరోగ్యంగా ఉన్న ముగ్గురు కవలలు గిన్నీస్ రికార్డ్

ఆరు నెలల్లోపే పుట్టిన ముగ్గురు కవలలు గిన్నీస్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ ముగ్గురు పిల్లలు ప్రపంచంలోనే అతితక్కువ కాలం తల్లి గర్భంలో ఉన్న కవలలు(ట్రిప్లెట్స్‌)గా గిన్నిస్‌ రికార్డ్‌ క్రియేట్ చేశారు.

Britain Triplets Guinness Records : ఆరు నెలల్లోపే పుట్టి ఆరోగ్యంగా ఉన్న ముగ్గురు కవలలు గిన్నీస్ రికార్డ్

British Triplets Create Guinness World Record

Britain Triplets Guinness Records : బిడ్డ పుట్టాలంటే అమ్మ కడుపులో తొమ్మిది నెలలు ఉండాల్సిందే. అలా అమ్మ గర్భంలో పెరిగితే చక్కటి ఆరోగ్యంతో జన్మిస్తారు. కొన్నిసార్లు ఏడు నెలలకే ప్రసవం అవుతుంది. అలా పుట్టిన బిడ్డలు కాస్త అనారోగ్యంగా ఉండే అవకాశాలుంటాయి. కానీ ముగ్గురు కవలలు మాత్రం అమ్మ కడుపులోంచి ఆరు నెలలు లోపే పుట్టేశారు. పైగా ముగ్గురు పిల్లలు చిన్నచిన్న అనారోగ్య సమస్యలు మినహా ఆరోగ్యంగా ఉన్నారు. అలా ఆరు నెలలు లోపే జన్మించిన శిశువులగా ఈ ముగ్గురు కవల పిల్లలు గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించేశారు. బ్రిటన్ కు చెందిన ఈ ముగ్గురు పిల్లలు ప్రపంచంలోనే అతితక్కువ కాలం తల్లి గర్భంలో ఉన్న కవలలు(ట్రిప్లెట్స్‌)గా గిన్నిస్‌ రికార్డ్‌ క్రియేట్ చేశారు.

ఈ ముగ్గురు చిచ్చరపిడుగుల పేర్లు రూబీ రోజ్‌, పేటన్‌ జేన్‌, పోర్షా మే. ఈ ముగ్గురు పుట్టీ పుట్టగానే ప్రపంచంలోనే అతితక్కువ కాలం తల్లి గర్భంలో ఉన్న కవలలు(ట్రిప్లెట్స్‌)గా గిన్నిస్‌ రికార్డ్‌ను క్రియేట్ చేశారు. రూబీ రోజ్‌, పేటన్‌ జేన్‌, పోర్షా మే అనే ఈ ముగ్గురు చిన్నారులు కేవలం 159 రోజులు అంటే.. 22 వారాల 5 రోజులు మాత్రమే తల్లిగర్భంలో ఉన్నారు. వీరి పుట్టుకే ఓ ప్రపంచ రికార్డు అయింది. వీరి ప్రస్తుతం చక్కటి ఆరోగ్యంతో ఉన్నారు. వీరి పుట్టుకే ఓ వింత అనుకుంటే అంతకంటే వింత మరొకటి ఉంది. అదేమంటే వీళ్ల అమ్మకు వీరు కడుపులో ఉన్నట్లే తెలియదట..అంటే ఆమె గర్భవతి అనే విషయం కూడా ఆమెకు తెలియదట..! వీరు పుట్టటానికి కేవలం మూడు వారాల ముందు మాత్రమే తను గర్భవతి అనే విషయం తెలిసిందట..!!

తాను గర్భవతిని అనే విషయం తెలిసిన మూడు వారాలకే ఈ చిచ్చరపిడుగులు వాళ్ల అమ్మకు మరో షాక్ ఇస్తు ఈ భూమ్మీదకు వచ్చేశారు.అదేనండీ పుట్టేశారు. అలా వారు గర్భంలో ఉన్నట్లుగా తెలియకపోవటం ఓ వింత అంటేతెలిసిన వెంటనే పుట్టేయటం మరో వింత..అంతేకాదు వీరు 22 వారాల 5 రోజులకే పుట్టేసి (జన్మించి) వరల్డ్ రికార్డు క్రియేట్ చేసేసారు.

Also Read: సమాధి తవ్వి తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి.. 13 ఏళ్లుగా డెడ్ బాడీతో జీవిస్తున్న వ్యక్తి

అలా తక్కువ బరువుతో ఫిబ్రవరి 14,2021న బ్రిస్టల్ లోని సౌత్ మీడ్ హాస్పిటల్ లో జన్మించిన వీరిని హాస్పిటల్ లోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 216 రోజులు ఉంచారు.వీరు జన్మించిన సమయంలో వీరి ముగ్గురి బరువు 1.28 కిలోలు మాత్రమే. దాదాపు నాలుగు నెలలు ముందుగా పుట్టిన ఈ చిన్నారులు సురక్షితంగా ఉండటానికి కొన్ని నెలల పాటు ఆసుపత్రిలోనే ఉంచారు.