Poland : సమాధి తవ్వి తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి.. 13 ఏళ్లుగా డెడ్ బాడీతో జీవిస్తున్న వ్యక్తి

ఓ వ్యక్తి సమాధిని తవ్వి తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి 13 సంవత్సరాలుగా డెడ్ బాడీతో జీవిస్తున్న ఘటన పోలాండ్‌లో చోటు చేసుకుంది.

Poland : సమాధి తవ్వి తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి.. 13 ఏళ్లుగా డెడ్ బాడీతో జీవిస్తున్న వ్యక్తి

mummified body

Poland : ఓ వ్యక్తి సమాధిని తవ్వి తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి 13 సంవత్సరాలుగా డెడ్ బాడీతో జీవిస్తున్న ఘటన పోలాండ్‌లో చోటు చేసుకుంది. ఖననం చేసిన తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి 13 సంవత్సరాలు తన సోఫాలో ఉంచినందుకు గానూ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అతని బావ ఇంట్లో మృతదేహాన్ని గుర్తించారు. మరియన్ ఎల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 76 ఏళ్ల వయస్సున్న బంధువు ఈ ఏడాది ఫిబ్రవరి 22న రాడ్లిన్‌లోని మరియన్ ఎల్ ఇంటికి వెళ్లాడు.

మరియన్ ఎల్ పిచ్చి పిచ్చిగా బయట తిరగడాన్ని చూశాడు. దీంతో అతను ఇంట్లోకి వెళ్లి శోధించగా 2009 నుండి ఉన్నటువంటి వార్తాపత్రికల కుప్ప ఉన్న సోఫాలో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు.
ఇంట్లో మృతదేహం ఉన్నట్లు అపార్ట్‌మెంట్ యజమాని కుటుంబ సభ్యుల నుండి సమాచారం వచ్చిందని పోలీసు ప్రతినిధి మల్గోర్జాటా కొనియర్స్కా చెప్పారు. అతని సమచారం మేరకు పోలీసులు రాడ్లిన్‌లోని రోగోజినా స్ట్రీట్‌లోని ఇంటికి వెళ్లారని తెలిపారు.

Bangkok: భార్య మృతదేహంతో 21ఏళ్లుగా సహజీవనం.. రాత్రిళ్లు శవపేటిక వద్ద కబుర్లు..

ఒక వృద్ధుడికి చెందిన ఇంట్లో మృతదేహం ఉన్నట్లు గుర్తించినట్లు ఆమె పేర్కొన్నారు.  ఇంటి యజమానిని పారామెడిక్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారని పోలీసు వెబ్‌సైట్‌లో స్థానిక భాషలో పోస్ట్ చేసిన ఒక ప్రకటన పేర్కొంది. సోఫాలో ఉన్న మృతదేహం 2010లో 95 సంవత్సరాల వయస్సులో మరణించిన వ్యక్తి తల్లి అని పోలీసులు అనుమానించారు. దీంతో పోలీసులు ఆమె సమాధిని పరిశీలించగా అది ఖాళీగా ఉందని తెలిసింది.

దీంతో మరియన్ తన తల్లి మృతదేహాన్ని ఖననం చేసిన వెంటనే తవ్వి తన అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లాడని, మృతదేహం కుళ్ళిపోకుండా ఉండేందుకు రసాయనాలు ఉపయోగించారని పోలీసులు తెలిపారు. జిల్లా ప్రాసిక్యూటర్ ఆఫీస్ ప్రాసిక్యూటర్ జోవన్నా స్మోర్‌జెవ్‌స్కా మాట్లాడుతూ మృతదేహాన్ని తవ్వి బయటికి తీసినట్లు వ్యక్తిపై అభియోగాలు ఉన్నాయని తెలిపారు. అలాగే మానసిక వైద్యులు అతని ఆరోగ్య స్థితిని పరీక్షిస్తారని వెల్లడించారు.