బయటకు వస్తే బతకలేరు : కెనడాలో మైనస్ 65 డిగ్రీలు

బయటకు వస్తే బతకలేరు : కెనడాలో మైనస్ 65 డిగ్రీలు

8, 9, 10 డిగ్రీల టెంపరేచర్ అంటేనే.. అమ్మో చలి.. చలి పులి, చలి పంజా అని ఒకటే గొడవ. గజగజ వణికిపోతున్నాం అంటూ ఆందోళనలు. మనుషులు తిరిగే ప్రదేశంలోనే మైనస్ 65 డిగ్రీలు అంటే.. మీరు విన్నది నిజం.. మైనస్ 65 డిగ్రీలు. ఎక్కడో కాదు కెనడా దేశంలో. భూమిపై చలి అధికంగా ఉన్న ప్రదేశంగా కెనడా నిలువనుంది. కెనడాలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా చలి తీవ్రత అధికంగా ఉంటుంది. ఒక్కోసారి నెలలు తరబడి జనం ఇళ్లల్లో నుంచి బయటకు రారు. నెలకు సరిపోయే సరుకులను ఒకేసారి తెచ్చిపెట్టుకుంటారు.

ఇంటి నుంచి కాలు బయటపెడితే మనుషులు కూడా గడ్డకట్టిపోయేంత చలి ఉంటుంది అక్కడ. స్కూళ్లకు కూడా వారాలపాటు సెలవులు ఇస్తారు. ఈ నెలలో కెనడాలో  ప్రాణాలు కోల్పోయేంతగా -65డిగ్రీల సెంటిగ్రేడు ఉష్ణోగత్ర నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. క్యూబెక్, ఆన్ టారియో రాష్ట్రాల్లో అయితే వచ్చే వారం నుంచి మనుషులు గడ్డకట్టేచ విధంగా చలి తీవ్రత ఉంటుందని అంచనా వేశారు. ఆల్బర్టా, సస్కాచ్ వాన్, మనిటోబా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే చాలా తక్కువగా నమోదవుతాయని తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లోని నదులు, సరస్సులు గడ్డకట్టుకుపోయాయి.

ఈ శీతాకాలంలో బ్రిటీష్ కొలంబియా రాష్ట్రంలో మాత్రమే సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. అనారోగ్యంతో భాధపడుతున్నవారు, పెద్దవాళ్లు, చిన్నపిల్లలు ఇళ్లు వదిలి బయటకు రాకూడదని ప్రజలకు ఇప్పటికే సూచనలు చేశారు. ఈ చలి తీవ్రత కారణంగా శ్వాస సంబంధిత సమస్యలు, గుండెల్లో నొప్పి, కండరాల నొప్పి, వీక్ నెస్ సమస్యలు వస్తాయని తెలిపారు. శరీరం మొద్దుబారిపోవటం వేళ్లు, కాళ్ల రంగు మారిపోవడం జరుగుతుందని తెలిపారు.