Canada : ఒమిక్రాన్ టెర్రర్, కెనడాలో 15 కేసులు

ఆఫ్రికా దేశమైన నైజిరియా నుంచి ఒంటారియాకు వచ్చిన ఇద్దరు వైరస్ బారిన పడ్డారు. మొత్తంగా కేసులు 15కి చేరినట్లు వైద్య ఆరోగ్య అధికారులు వెల్లడించారు.

Canada : ఒమిక్రాన్ టెర్రర్, కెనడాలో 15 కేసులు

Omicron

Canada Omicron Variant : ప్రపంచానికి ఒమిక్రాన్ భయం పట్టుకుంది. పలు దేశాలు మళ్లీ ఆంక్షల వలయంలోకి వెళ్లిపోతున్నాయి. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలకు పాకుతోంది. దక్షిణాఫ్రికాలో చిన్నారులు సైతం ఈ వైరస్ బారిన పడుతుండడం వైద్యులను ఆందోళన కలిగిస్తోంది. బ్రిటన్, హాంకాంగ్, ఆస్ట్రేలియా, బెల్జియం, ఇంగ్లండ్, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్ లలో వేరియంట్ బయటపడింది. భారత్ లోనూ..ఒమిక్రాన్ వేరియంట్ పై ఆందోళన మొదలైంది. తాజాగా..కెనాడలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసింది.

Read More : Shilpa Choudhary : బయటకొస్తున్న శిల్ప మోసాలు.. మోసపోయిన మరో యువ హీరో

కేసులు 15కి చేరినట్లు సమాచారం. దేశంలో తొలి కేసు గత నెల 28వ తేదీన నమోదైంది. ఆఫ్రికా దేశమైన నైజిరియా నుంచి ఒంటారియాకు వచ్చిన ఇద్దరు వైరస్ బారిన పడ్డారు. మొత్తంగా కేసులు 15కి చేరినట్లు వైద్య ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ఇందులో చిన్నారి కూడా ఉందని తెలుస్తోంది. ఈ మధ్యే దక్షిణాఫ్రికా నుంచి వచ్చిందని సమాచారం. టొరంటోలో కూడా ఒమిక్రాన్ కేసు నమోదైందని, నైజిరీయా, స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేయగా…వైరస్ సోకిందని తెలుస్తోంది.

Read More : Konijeti Rosaiah : నన్ను రాజకీయాల్లోకి రమ్మన్నారు.. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతిపై చిరంజీవి సంతాపం

మరోవైపు..ఒమిక్రాన్ కేసులు అధికమౌతుండడంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. దేశంలో వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న 50 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు నేషనల్ అడ్వైజరీ బోర్డు సూచించిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పలు నిబంధనలు, ఆంక్షలు విధిస్తోంది. ఆఫ్రికాతో సహా…అన్ని దేశాల అంతర్జాతీయ విమాన సర్వీసులపై కెనడా నిషేధం విధించింది.