కరేబియన్‌ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు

కరేబియన్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదు అయింది.

  • Published By: veegamteam ,Published On : January 29, 2020 / 02:21 AM IST
కరేబియన్‌ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు

కరేబియన్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదు అయింది.

కరేబియన్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. కరేబియన్ దీవులను భూకంపం వణికించింది. జమైకా, క్యూబా, కేమన్‌ దీవుల మధ్య సముద్రంలో 10 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.7గా నమోదైంది. దీంతో క్యూబా, జమైకా, కేమన్‌ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంప కేంద్రంగా సముద్ర తీర ప్రాంతాల్లో 300కి.మీ వరకు సునామీ తరంగాలు వస్తున్నాయని పసిఫిక్‌ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. సునామీ ప్రభావం క్యూబా, హోండూరస్‌, మెక్సికో, కేమన్‌ దీవులు, బెలిజ్‌, జమైకాలోని పలు ప్రాంతాల్లో ఉండనున్నట్లు సునామీ హెచ్చరిక కేంద్రం పేర్కొంది. తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేమన్‌ దీవుల్లోని ప్రభుత్వం తెలిపింది.   

భూకంప తీవ్రతకు దీవుల్లోని పలు భవనాలు కదిలిపోయాయి. జనం భయంతో పరుగులు తీశారు. చాలాచోట్ల రోడ్లపై గుంతలు పడ్డాయి. మరిన్ని ప్రకంపనలు వస్తాయేమోనన్న భయంతో జనం ఇళ్లలోకి కూడా వెళ్లడం లేదు. ఎంత ఆస్తినష్టం జరిగిందన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో ఈ భూకంపం సంభవించింది. జమైకాకు నైరుతి దిశగా 86, క్యూబా నుంచి 87 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్న మాంటెగో బే సముద్రం అంతర్భాగాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు.

జమైకా, క్యూబాలను భూ ప్రకంపనలు తాకాయి. మంగళవారం (జనవరి 28, 2020) జమైకా నుండి 80 మైళ్ళ దూరంలో భూకంపం సంభవించింది. కరేబియన్, మయామి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. హవానాలో ప్రజలు ఇళ్లను వదిలి వీధుల్లోనే ఉంటున్నారు. భూకంపం కారణంగా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జార్జ్ టౌన్‌లోని కేమాన్ దీవులలో 0.4 అడుగుల సునామీ నమోదైంది. కాని డొమినికన్ రిపబ్లిక్‌లోని పోర్ట్ రాయల్, జమైకా లేదా ప్యూర్టో ప్లాటా దగ్గర సునామీ కనిపించలేదు.

అనేక భూకంపాలు జరిగాయి, వాటిలో ఒకటి యుఎస్ జియోలాజికల్ సర్వే 6.1 తీవ్రతతో ఉందని తెలిపింది. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా 6.1 తీవత్రతో సంభవించిన భూకంపం నుండి పెద్ద సునామీ ముప్పు ఏమీ లేదని నేషనల్ వెదర్ సర్వీస్ పసిఫిక్ సునామి హెచ్చరిక కేంద్రం తెలిపింది. అయినప్పటికీ భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న తీరాల వెంబడి సునామీ తరంగాలు సంభవించే అవకాశం చాలా తక్కువ అని వెల్లడించింది.

ప్యూర్టో రికోలో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిన మూడు వారాల తరువాత భూకంపాలు సంభవించాయి. భూకంపం సంభవించిన కొన్ని గంటల తరువాత మంగళవారం (జనవరి 28, 2020) మధ్యాహ్నం సునామీ హెచ్చరికను ఎత్తివేసింది. ఇంతకుముందు జార్జ్ టౌన్ లోని కేమాన్ దీవులలో 0.4 అడుగుల సునామీ నమోదైంది. కాని డొమినికన్ రిపబ్లిక్ లోని పోర్ట్ రాయల్, జమైకా లేదా ప్యూర్టో ప్లాటా వద్ద సునామీ కనిపించలేదు. గ్రాండ్ కేమన్లోని ఓగియర్ లో నివసించే అలెక్ పుల్టర్ మాట్లాడుతూ ఇది తాను అనుభవించిన మొట్టమొదటి భూకంపం కాదని, అయితే ఇది ఇప్పటివరకు అతిపెద్ద భూకంపం అని తెలిపారు.