Cerybral Palsy: సెరిబ్రల్ పాల్సీ అంటే ఏంటి? ఎలా సోకుతుంది.. ప్రభావాలేంటి? సత్య నాదెళ్ల కుమారుడి పరిస్థితేంటి..?

సెరిబ్రల్ పాల్సీ. చిన్నారుల్లో పుట్టుకకు ముందు అనారోగ్య సమస్యల కారణంగా ఈ అరుదైన వ్యాధి సోకుతుంది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల.. ఇదే వ్యాధితో చనిపోయారు.

Cerybral Palsy: సెరిబ్రల్ పాల్సీ అంటే ఏంటి? ఎలా సోకుతుంది.. ప్రభావాలేంటి? సత్య నాదెళ్ల కుమారుడి పరిస్థితేంటి..?

Zain Nadella

Cerybral Palsy: సెరిబ్రల్ పాల్సీ. చిన్నారుల్లో పుట్టుకకు ముందు ఏర్పడే అనారోగ్య సమస్యల కారణంగా ఈ అరుదైన వ్యాధి సోకుతుంది. తాజాగా.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల.. ఇదే వ్యాధితో కన్నుమూసిన సందర్భంగా.. ఈ వ్యాధి గురించి మరోసారి చర్చ జరుగుతోంది. అసలు సెరిబ్రల్ పాల్సీ లక్షణాలు ఎలా ఉంటాయి.. చిన్నారుల్లో ఇలాంటి వ్యాధి సోకడానికి గల కారణాలు.. వాటి ప్రభావాలు ఎలా ఉంటాయి.. అన్నది తెలుసుకుందాం.

సింపుల్ గా చెప్పాలంటే.. తల్లి గర్భంలో ఎదుగుతున్న బిడ్డ మెదడుకు.. ప్రాణవాయివైన ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతే.. అది ఆ బిడ్డ ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో ఆ బిడ్డకు ఎదురయ్యే తీవ్రమైన అనారోగ్య సమస్యలనే సెరిబ్రల్ పాల్సీ అంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది స్పాటిక్ సెరిబ్రల్ పాల్సీ.. ఎథిటాయిడ్ సెరిబ్రల్ పాల్సీ.. ఎటాక్సిక్ సెరిబ్రల్ పాల్సీ అని 3 రకాలుగా ఉంటుందట. ఒక్కో రకం సెరిబ్రల్ పాల్సీకి ఒక్కో రకమైన లక్షణాలు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు.

స్పాటిక్ సెరిబ్రల్ పాల్సీ: ఇది సోకిన చిన్నారులకు రక్త ప్రసరణలో ఇబ్బందులు ఎదురై.. కాళ్లు, చేతులు బిగుసుకుపోతాయి. కదలికలు కష్టమవుతాయి.

ఎథిటాయిడ్ సెరిబ్రల్ పాల్సీ: ఇది సోకిన చిన్నారుల్లో.. సంబంధం లేకుండా శరీర కదలికలు ఉంటాయి.

ఎటాక్సిక్ సెరిబ్రల్ పాల్సీ: ఇది సోకిన వారికి గ్రహణ శక్తి తగ్గిపోతుంది. చిన్నారి శరీర ఎదుగుదలలో బ్యాలెన్స్ తప్పుతుంది.

ఈ మూడు రకాల సెరిబ్రల్ పాల్సీ లక్షణాల్లో.. ఏదో ఒకటే రకం సోకుతుందా అంటే.. అది కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి రెండు లేదా మూడు రకాలు కలిసి కూడా చిన్నారులకు వ్యాధి సోకే పరిస్థితి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఫిజియోథెరపీ వంటి వాటితో కాస్త ఉపశమనం కలిగించడం మినహా.. సెరిబ్రల్ పాల్సీ సోకిన వారికి పూర్తి స్థాయి చికిత్స.. పూర్తి స్థాయి రోగ నివారణ కష్టమే అన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో బాధిత చిన్నారుల గురించి కుటుంబ సభ్యులు పూర్తి అవగాహన పెంచుకుని.. అందుకు అనుగుణంగా ఇంట్లో వాతావరణం కల్పించడం మంచిదని డాక్టర్లు సూచన చేస్తున్నారు.

ఈ అరుదైన వ్యాధి సోకి కన్నుమూసిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల పరిస్థితి గమనిస్తే.. ఆయనకు కూడా పుట్టుకతోనే సెరిబ్రల్ పాల్సీ వ్యాధి ఉన్నట్టు నాదెళ్ల కుటుంబీకులు తెలిపారు. ఆయన సరిగా నడవలేడు. చూడలేడు. సరిగా మాట్లాడలేడు. అలా 26 ఏళ్ల జీవితాన్ని.. పూర్తిగా వీల్ చైర్ లోనే గడిపాడు. కుమారుడి పరిస్థితి ఇలా ఉన్నా.. సత్య నాదెళ్ల కుటుంబం గుండె దిటవు చేసుకుని ముందుకు కదిలింది. ఉన్నంత కాలం.. తమ కుమారుడిని వీలైనంత వరకూ బాగా చూసుకునేందుకు సత్య నాదెళ్ల దంపతులు ప్రయత్నించారు. ఈ అనుభవాన్ని మైక్రోసాఫ్ట్ విధుల్లో సత్య నాదెళ్ల.. ఎంతగానో ఉపయోగించుకున్నారు.

Read More:

Satya Nadella Son Died : మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల కుమారుడు జైన్‌ నాదెళ్ల మృతి