Video : బొద్దింకకు సిజేరియన్ డెలివరీ..! తల్లీ బిడ్డా క్షేమం..!!

  • Published By: veegamteam ,Published On : December 30, 2019 / 07:34 AM IST
Video : బొద్దింకకు సిజేరియన్ డెలివరీ..! తల్లీ బిడ్డా క్షేమం..!!

మహిళలకు ప్రసవం కష్టమైతే..డాక్టర్లు సిజేరియన్ ఆపరేషన్ చేసి డెలివరీ చేస్తారు. కానీ ఓ వింత..విచిత్రం గురించి తెలుసకుంటే నోరు ఆవలిస్తారు. ఓ బొద్దింకకు ప్రసవం కష్టమైంది.! దీంతో డాక్టర్లు సిజేరియన్ డెలివరీ చేశారు…!! తల్లీ బిడ్డా అదేనండి బొద్దింక బిడ్డా క్షేమంగా ఉన్నారని డాక్టర్లు చెప్పారు…!!!. ఇదీ మరీ చోద్యం కాకపోతే బొద్దికకు డాక్టరలు డెలివరీ చేయటమేంటీ?..తల్లీ బిడ్డా క్షేమం అంటూ చెప్పటమేంటి?  వీళ్ల పిచ్చి పీక్స్ కు వెళ్లింది అనుకోవచ్చు..కానీ ఇది అక్షరాలా నిజం..!!

బొద్దింకలను చూస్తే చాలామంది భయపడుతుంటారు. ఇంకొందరు అసహ్యించుకుంటారు. కానీ రష్యాకు చెందిన ఒక వ్యక్తి బొద్దికను పెంచుకుంటున్నాడు. అతను పెంచుకునే ఆ బొద్దింక ఆడది. అది కడుపుతో ఉంది. పాపం ఆ చిరుప్రాణికి డెలివరీ సమయంలో కష్టమొచ్చిపడింది. దీంతో అతను వెంటనే ఆ బొద్దింకను జీవజంతు డాక్టర్ దగ్గరు తీసుకెళ్లాడు. దీంతో బొద్దికకు ప్రసవం కష్టంగా ఉందని చెప్పాడు. తరువాత సిజేరిన్ డెలివరీ చేసి..తల్లీ బొద్దింక..పిల్ల బొద్దింక ప్రాణాల్ని కాపాడాడు. 

ఈ వింత ఘటన రష్యాలోని సైబేరియా పరిధిలో గల క్రాస్నోయార్క్స్‌లో డిసెంబర్ 21,2019న  ఈ ఘటన చోటుచేసుకుంది.  ఈ ప్రాంతానికి చెందిన లింపోప్‌ అనే వ్యక్తి బొద్దింకను పెంచుకుంటున్నాడు. ఆర్కిమండ్రిటా జాతికి చెందినది. గర్భంతో ఉన్నఅది పిల్లను కనే సమయంలో ఇబ్బంది పడుతోంది. దీనిని గమనించిన ఆ వ్యక్తి వెంటనే దానిని జీవజంతు వైద్యుని దగ్గరకు తీసుకువెళ్లాడు.

అక్కడి వైద్యుడు దాని పరిస్థితి గమనించి, వెంటనే దానికి సిజేరియన్ డెలివరీ చేసి, ఆ రెండు ప్రాణులను కాపాడారు. దీంతో లింపోప్ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. తరువాత డాక్టర్లు బొద్దింకను జాగ్రత్తగా చూసుకోవటానికి కొన్ని జాగ్రత్తలు చెప్పారు. తరువాత తన పెంపుడు బొద్దింకను..దాని పిల్లలు లింపోప్ జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లాడు.