Chandrayaan-3 : చంద్రుడి దక్షిణ ధ్రువం రహస్యాలపై అన్వేషణ.. విజ్ఞాన్ ప్రసార్ శాస్త్రవేత్త డాక్టర్ టీవీ వెంకటేశ్వరన్ వెల్లడి

చంద్రుడి గురించి పలు దేశాలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నప్పటికీ, చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఏమున్నాయనేది మిస్టరీగానే మిగిలాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధీనంలోని విజ్ఞాన్ ప్రసార్ శాస్త్రవేత్త ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా పబ్లిక్ ఔట్‌రీచ్ కమిటీ సభ్యుడు డాక్టర్ టివి వెంకటేశ్వరన్ వెల్లడించారు.

Chandrayaan-3 : చంద్రుడి దక్షిణ ధ్రువం రహస్యాలపై అన్వేషణ.. విజ్ఞాన్ ప్రసార్ శాస్త్రవేత్త డాక్టర్ టీవీ వెంకటేశ్వరన్ వెల్లడి

Moon's many mysteries

Updated On : August 23, 2023 / 11:53 AM IST

Chandrayaan-3 : చంద్రుడి గురించి పలు దేశాలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నప్పటికీ, చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఏమున్నాయనేది మిస్టరీగానే మిగిలాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధీనంలోని విజ్ఞాన్ ప్రసార్ శాస్త్రవేత్త ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా పబ్లిక్ ఔట్‌రీచ్ కమిటీ సభ్యుడు డాక్టర్ టివి వెంకటేశ్వరన్ వెల్లడించారు. (Expert explains Moon’s many mysteries) చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఏమున్నాయనేది అంతుపట్టని రహస్యాలకు నిలయమని, దీనిపై అన్వేషణ చేయాల్సిన అవసరముందని ఆయన చెప్పారు. చంద్రయాన్ -3 ల్యాండింగ్ నేపథ్యంలో చంద్రుడి గురించి డాక్టర్ టివి వెంకటేశ్వరన్ చెప్పిన విశేషాలు ఏమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం రండి.

చంద్రుడి వయసు 4.5 బిలియన్ సంవత్సరాలు
చంద్రుడిపై శతాబ్దాలుగా మానవ ఉత్సుకత పెరిగటంతో పరిశోధనలు సాగుతున్నాయి. చంద్రుడి వయసు 4.5 బిలియన్ సంవత్సరాలని తేలింది. మార్స్-పరిమాణ ఖగోళ శరీరం భూమిని ఢీకొట్టిందని, ఈ తాకిడి నుంచి వచ్చిన శిధిలాలు చివరికి చంద్రుని శరీరాన్ని ఏర్పర్చాయని ప్రముఖ సిద్ధాంతం వెల్లడించింది. భూగ్రహం కంటే చంద్రుడి 6 కోట్ల సంవత్సరాలు చిన్నదని వెల్లడైంది.

చంద్రుని గురుత్వాకర్షణ శక్తి తక్కువ
చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే చాలా తక్కువగా ఉంది. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిలో ఆరవ వంతు ఉంటుంది. దీనివల్ల చంద్రునిపై ఉన్న వస్తువులు భూమిపై కంటే చాలా తక్కువ బరువు ఉంటాయి. భూమిపై 68 కిలోగ్రాముల బరువున్న వ్యక్తి చంద్రుడిపై 11 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. భవిష్యత్ అంతరిక్ష పరిశోధనలకు నీటి ఉనికి చాలా ముఖ్యమైనదని, దీనిని తాగునీరు, ఆక్సిజన్, రాకెట్ ఇంధనం కోసం హైడ్రోజన్ వంటి వనరులుగా మార్చవచ్చునని శాస్త్రవేత్తలు తేల్చారు.

చంద్రుడిపై ప్రాణవాయువు లభ్యం
సూర్యరశ్మి ఉన్న ప్రదేశంలో మైనస్ 50 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద ఉన్న భూభాగం ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా ఉంటోంది. శాశ్వతంగా నీడ ఉన్న క్రేటర్స్ నీటి మంచు పేరుకుపోవడానికి అనుమతించే అత్యంత శీతల పరిస్థితులను అందిస్తాయి. చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో వాటర్ ఐస్ ఉన్నట్లు నిర్ధారించారు. వాటర్ ఐస్ నుంచి హైడ్రోజన్, ఆక్సిజన్ ను విడగొడితే చంద్రుడిపై వ్యోమగాములకు ప్రాణవాయువు, ఇంధనం లభిస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది.

చంద్రయాన్ -1లో ఏం వెల్లడైందంటే..
2008వ సంవత్సరంలో ప్రారంభించిన చంద్రయాన్ 1తో సహా వివిధ చంద్ర మిషన్ల నుంచి వచ్చిన డేటా, శాశ్వతంగా నీడ ఉన్న ప్రాంతాల్లో నీటి అణువుల ఉనికిని సూచించింది. ఈ డేటా ఆధారంగానే చంద్రయాన్-3ని చేపట్టారు. ఇస్రో తన గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపే ఉద్ధేశాన్ని వ్యక్తం చేసినప్పటికీ, సమీప భవిష్యత్తులో చంద్రునిపైకి మానవ మిషన్‌లను పంపే ప్రణాళికలు లేవని డాక్టర్ వెంకటేశ్వరన్ వివరించారు.