1km-Long Orbit Spaceship : స్పేస్ రేసులో చైనా కొత్త ట్విస్ట్ : కిలోమీటర్ పొడవైన భారీ స్పేస్‌షిప్ ప్లాన్!

అగ్రరాజ్యం అమెరికాతో అంతరిక్ష రేసులో డ్రాగన్ చైనా కొత్త ట్విస్ట్ ఇచ్చింది. కిలోమీటర్ పొడవైన అతి పెద్ద స్పేస్ క్రాప్ట్ నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించింది.

1km-Long Orbit Spaceship : స్పేస్ రేసులో చైనా కొత్త ట్విస్ట్ : కిలోమీటర్ పొడవైన భారీ స్పేస్‌షిప్ ప్లాన్!

China Announces Plans For 1km Long Orbiting Spaceship

China 1km-long orbit spaceship : అగ్రరాజ్యం అమెరికాతో అంతరిక్ష రేసులో డ్రాగన్ చైనా కొత్త ట్విస్ట్ ఇచ్చింది. భారీ స్పేస్ క్రాప్ట్ నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించింది. కిలోమీటర్ పొడవైన అతి పెద్ద అంతరిక్ష నౌకను నిర్మిస్తామంటోంది. నేషనల్ నేచురల్ సైన్స్ ఫౌండేషన్ ఈ విషయాన్ని ఒక ప్రకటనలో వెల్లడించింది. నాలుగేళ్ల ప్రొగ్రామ్ లో భాగంగా ఈ భారీ అంతరిక్ష నౌకను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపింది. జీరో గ్రావిటీ కండీషన్లలో అంతరిక్ష నౌకలో అనేక భారీ రాకెట్లను మోసకెళ్లేందుకు స్పేస్ క్రాఫ్ట్ అవసరమని అంటోంది. భవిష్యత్తులో మరింత విస్తరించేందుకు అవసరమైన పరికరాల కోసం చైనా ఫౌండేషన్ చూస్తోంది.

ఆర్బిట్ లో దీర్ఘకాలం ఉండటమే లక్ష్యంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా కిలోమీటర్ పొడవైన స్పేస్ షిప్ నిర్మించనుంది. ప్రస్తుత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కంటే 10 రెట్లు అతిపెద్ద స్పేస్ షిప్ తయారుచేయబోతోంది. ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టతరమైనదిగా చైనా మీడియా రివీల్ చేసింది. ఈ స్పేస్ షిప్ కు అవసరమయ్యే విడిభాగాలు తేలికైనవిగా ఉండటంతో నిర్మాణానికి చాలా అనువుగా ఉంటుందని తెలిపింది. ఇప్పటివరకూ ఆర్బిట్‌లో ఇలాంటి భారీ స్పేస్ షిప్ గతంలో ఎన్నడూ నిర్మించలేదు. ప్రస్తుతం చైనా సొంత స్పేస్ స్టేషన్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
Jammu : కరోనా రెండో డోస్ తీసుకున్న బామ్మ, ఈమె వయస్సు ఎంతో తెలుసా ?

ఏప్రిల్ నెలలోనే ఆర్బిట్ లో చైనా మెయిన్ స్టేషన్ అయిన Tiangong స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసింది. ఈ స్పేస్ స్టేషన్ భూమి నుంచి 236 మైళ్లకు పైగా దూరంలో పయనిస్తుంది. వచ్చే ఏడాదిలో చైనా మరో 11 మిషన్లను ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే స్పేస్ స్టేషన్ నిర్మాణం సగానికి పైగా పూర్తి అయిపోయింది. ఈ ఏడాదిలోనే చైనా తమ దేశీయ రోవర్ మార్స్ ఉపరితలంపై ల్యాండ్ అయింది. అమెరికాతో పాటు ఇతర దేశాలకు పోటీగా రెడ్ ప్లానెట్‌పై పరిశోధనలు చేసేందుకు చైనా ఈ రోవర్ ను పంపింది.

మరోవైపు.. ఎలన్ మస్క్ కూడా తమ SpaceX నుంచి చంద్రునిపైకి మానవ మిషన్ రెడీ అవుతున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష నౌక నాసా ప్రతిష్టాత్మక Artemis మిషన్ 2024లో లాంచ్ చేయబోతోంది. మరో ప్రైవేట్ స్పేస్ సంస్థ టెస్లా కూడా హ్యుమనాయిడ్ రోబోపై వర్క్ చేస్తున్నట్టు ప్రకటించింది. మరో టెక్ దిగ్గజం మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా కొత్త ఫీచర్ పై వర్క్ చేస్తోంది. వాట్సాప్ మెసేజ్ లు 90 రోజుల్లో అదృశ్యమయ్యేలా డిజ్ అప్పియర్ ఫీచర్ తీసుకోస్తోంది.
Nasa Space Masala : అంతరిక్ష కేంద్రంలో మసలా దినుసుల సాగు…త్వరలో అందుబాటులోకి స్పేస్ మసాలా