కరోనా కల్లోలం : చైనాలో దగ్గు, జ్వరం మందుల అమ్మకంపై నిషేధం.. ఎందుకంటే?

కరోనా పేషెంట్లను కని పెట్టడానికి చైనా కాస్త ప్రమాదకర చర్యలే చేపట్టింది. ఇప్పటికే 900 మంది కరోనాకు బలయ్యారు. ఆదివారం(ఫిబ్రవరి 09,2020) నాటికి కరోనా బాధితుల సంఖ్య

  • Published By: veegamteam ,Published On : February 10, 2020 / 02:25 PM IST
కరోనా కల్లోలం : చైనాలో దగ్గు, జ్వరం మందుల అమ్మకంపై నిషేధం.. ఎందుకంటే?

కరోనా పేషెంట్లను కని పెట్టడానికి చైనా కాస్త ప్రమాదకర చర్యలే చేపట్టింది. ఇప్పటికే 900 మంది కరోనాకు బలయ్యారు. ఆదివారం(ఫిబ్రవరి 09,2020) నాటికి కరోనా బాధితుల సంఖ్య

కరోనా పేషెంట్లను కని పెట్టడానికి చైనా కాస్త ప్రమాదకర చర్యలే చేపట్టింది. ఇప్పటికే 900 మంది కరోనాకు బలయ్యారు. ఆదివారం(ఫిబ్రవరి 09,2020) నాటికి కరోనా బాధితుల సంఖ్య 40వేలకు చేరింది. కాగా, కరోనా విజృంభణ తర్వాత.. కనీసం మూడు సిటీలు జ్వరం, దగ్గు మాత్రలు అమ్మడాన్ని ఆపేశాయి. ఎక్కడా ఆ మందులు దొరక్కుండా చేశాయి. దీనికి కారణం లేకపోలేదు. కరోనా వైరస్ సోకిందా లేదా అని తెలుసుకోవడానికి ప్రధాన లక్షణాల్లో రెండు జ్వరం, దగ్గు. అయితే కరోనా వైరస్ సోకినా.. కొందరు జనం సరాసరి మెడికల్ షాపులకెళ్లి మందులు కొనుక్కుని వేసుకొంటున్నారు. అందువల్ల వాళ్లకు కరోనా వచ్చినా.. ఆ విషయం ప్రభుత్వానికి తెలియడం లేదు. కరోనాను మొదటి వారంలో కనిపెట్టడం చాలా కష్టం. రెండో వారం నుంచి కండరాల నొప్పి వస్తుంది. ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. ఆ తర్వాత పరిస్థితి మరింత విషమిస్తుంది. ఊపిరి తీసుకోవడమూ కష్టమే.

ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం:
Hangzhou సిటీ జనాభా కోటి. ఇక్కడే ఆలీబాబ్, ఇతర చైనా టెక్ దిగ్గజ సంస్థల కార్యాలయాలున్నాయి. ఇక్కడ కనుక కరోనా వచ్చిందంటే చైనా ఆర్ధిక పరిస్థితి చిన్నాభిన్నమవుతుంది. అందుకే శుక్రవారం నుంచి అన్ని మెడికల్ షాపుల్లో దగ్గు, జ్వరం మందులను అమ్మడాన్ని ఆపేశారు. coronavirus management team సలహాతో అన్ని మెడికల్ షాపులకు ఆదేశాలు ఇచ్చారు. ఎవరికైనా జ్వరం, దగ్గు వస్తే కచ్చితంగా హాస్పటల్స్ వెళ్లాల్సిందే. కాస్త నలతగా ఉన్నా, ఇంట్లో వాళ్లను హాస్పటల్ తీసుకొచ్చి కరోనా టెస్ట్ చేయించమని సలహా ఇస్తున్నారు.

ఇక Ningbo, Sanya దక్షిణాది నగరాల జనాభా 86 లక్షలు. ఇక్కడ కూడా జ్వరం, దగ్గు మందుల అమ్మకాన్ని నిషేదించారు. Guangdong రాష్ట్రంలోని టెక్ హబ్ Shenzhenతో హాంగ్ కాంగ్ కు సరిహద్ధు ఉంది. ఇక్కడ కూడా ఆధారాలు సమర్సిస్తే కాని మెడిసిన్ అమ్మరు. ఒక వేళ వైద్య సిబ్బందికి అనుమాన మొస్తే, సరాసరి ఇంటికే వచ్చి కరోనా టెస్ట్ చేస్తారు. ఎవరికైనా జ్వర మొచ్చి, తెల్ల రక్త కణాల సంఖ్యలో తగ్గుదల కనిపించినా, రక్తహీనత ఉన్నా ఆసుపత్రికి వెళ్లమని చైనా హెల్త్ కమీషన్ సూచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చైనాలో ఉన్నవాళ్లకు జ్వరమొచ్చి, నీరసంగా ఉంటే వెంటనే హాస్పటల్ కు వెళ్లమని, కనీసం కరోనా వైరస్ సిబ్బందికి కాల్ చేయమని సూచించింది.

జ్వరమైనా, దగ్గు వచ్చినా ఆసుపత్రికి వెళ్లాల్సిందే:
ఇప్పుడు హాస్పటల్స్ నిండా కరోనా బాధితులున్నారు. జ్వరమొచ్చిందని మందుల కోసం అక్కడికి వెళ్తే ఏకంగా కరోనా అంటుకొనే ప్రమాదముందన్నది కొందరి భయం. అది నిజం కూడా. 138 మంది కరోనా వైరస్ పేషెంట్స్ మెడికల్ రికార్డులను స్టడీ చేసిన తర్వాత బైటకొచ్చిన నిజం ఒక్కటే. హాస్పిటల్ లో చేరిన మొదటి కరోనా పేషెంట్ నుంచే పక్కనున్న సాధారణ పేషెంట్లకూ అంటింది. నలుగురు డాక్టర్లు కూడా కరోనాకు బలైయ్యారు.

చిన్న అనుమానం వచ్చినా కరోనా టెస్ట్:
మరి ఈ విధానం సరైనదేనా? చిన్న టాబ్లెట్ తో పోయే దానికి, హాస్పటల్ కెళ్లి, క్యూలో నిలబడి, అక్కడ కరోనా వైరస్ సోకే ప్రమాదాన్నికోరి తెచ్చుకోమనడం ఎంతవరకు సబబు? ఈ ఆందోళన చైనా ప్రభుత్వంలోనూ ఉంది. అయినా సరే, నిజంగా కరోనా వచ్చినా, సొంత వైద్యం చేసుకొంటున్నవాళ్లను ఇళ్ల నుంచి బైటకు రప్పించి, ట్రీట్ మెంట్ చేయాలన్న నిర్ణయానికే చైనా కట్టుబడి ఉంది. ఇక రాజధాని బీజింగ్ లో అందరికీ సెలవులిచ్చారు. ఇళ్ల నుంచి బైటకు రావద్దని హెచ్చరించారు. సిటీని విడిచి పోయేవాళ్లను అడ్డుకోవడానికే ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటికే 11వేల మంది వైద్య సిబ్బందిని వూహాన్ పంపించారు. వూహాన్ లో ఒక్క కరోనా రోగిని వదలకుండా అందరినీ ట్రీట్ చేయాలన్నది చైనా ఉద్దేశం. అందుకే జ్వరం వచ్చినా సరే వాళ్లకు కరోనా టెస్ట్ లను తప్పనిసరి చేశారు. పరీక్షలను వేగంగా పూర్తి చేయడానికి చెస్ట్ సిటీ స్కాన్ చేస్తున్నారు.

 

ఊళ్లోకి రాకుండా గోడలు కట్టేస్తున్నారు?

లాగైనా సరే ఈ నెలాఖరుకి కరోనా వైరస్ ను కట్టడి చేయాలన్న తాపత్రయంలో చైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. Hangzhou లాంటి చోట్ల కరోనా వైరస్ ఉన్న ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ల ఇళ్లకు తాళాలేస్తోంది. వాళ్లు ఎక్కడికీ కదలకూడదు. కరోనా టెస్టుల్లో రిజల్ట్ నెగిటివ్ వచ్చేంత వరకు వాళ్ల మీద వైద్య సిబ్బంది నిఘా ఉంటుంది. కొన్ని కాలనీలు బైటవాళ్లు రాకుండా బారికేడ్లు కట్టుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే.. ఏకంగా గోడలే కట్టేశారు.