India-China LAC Issue: డ్రాగన్ బుద్ది మారలె.. పాంగోంగ్ సరస్సుపై కొత్త వంతెన సమీపంలో

డ్రాగన్ వక్రబుద్ది మారడం లేదు.. తాజాగా మరో దుశ్చర్యకు పాల్పడుతోంది. చైనా యొక్క పీఎల్ఏ సైన్యం పాంగోంగ్ సరస్సుపై వంతెన పక్కన నూతన రహదారి నిర్మాణాన్ని చేపడుతుంది...

India-China LAC Issue: డ్రాగన్ బుద్ది మారలె.. పాంగోంగ్ సరస్సుపై కొత్త వంతెన సమీపంలో

China And India

India-China LAC Issue: డ్రాగన్ వక్రబుద్ది మారడం లేదు.. తాజాగా మరో దుశ్చర్యకు పాల్పడుతోంది. చైనా యొక్క పీఎల్ఏ సైన్యం పాంగోంగ్ సరస్సుపై వంతెన పక్కన నూతన రహదారి నిర్మాణాన్ని చేపడుతుంది. ఈ విషయం శాటిలైట్ చిత్రాలు బహిర్గతం చేశాయి. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, ‘ఇంటెల్ ల్యాబ్’ ప్రకారం.. చైనా పాంగోంగ్ సరస్సుపై వంతెనను నిర్మిస్తోంది. తద్వారా సరస్సు యొక్క ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో తన దళాలు సులభంగా తరలించడానికి చైనా కుట్రచేస్తుంది. వంతెన శాటిలైట్ చిత్రాలను ఇంటెల్ ల్యాబ్ విడుదల చేసింది.

2019లో పాంగోంగ్ సరస్సుకు ఉత్తరం, దక్షిణ భాగంలో భారతదేశం, చైనా సైన్యాల మధ్య వివాదం జరిగింది. సరస్సు యొక్క ఉత్తరాన వివాదాస్పద ఫింగర్ ఏరియా ఉంది. దక్షిణాన కైలాష్ హిల్ రేంజ్, రెచిన్ లా పాస్ ఉన్నాయి. తరువాత రెండు చోట్లా విడదీయబడినప్పటికీ తూర్పు లడఖ్‌లోని రెండు దేశాల సైన్యాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. రెండు దేశాల సైన్యాలకు చెందిన 60-60 వేల మంది సైనికులు ఇక్కడ ఉన్నారు. ఇది కాకుండా, యుద్ధ ట్యాంకులు, ఫిరంగులు, క్షిపణుల ఈ ప్రాంతంలో మోహరించి ఉన్నాయి.

Indian Soldiers : చైనా బోర్డర్ లోని సైనికులకు అత్యాధునిక ఆయుధాలు

140 కి.మీ పొడవున్న పాంగోంగ్ సరస్సులో మూడింట రెండు వంతులు, అంటే దాదాపు 100 కి.మీ. చైనాలో భాగం. ఇలాంటి పరిస్థితుల్లో చైనా సైనికులు ఒక చివర నుంచి మరో చివరికి వెళ్లాలంటే పడవ సాయం తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే 100 కిలోమీటర్లు చుట్టి రావాల్సి ఉంటుంది. కానీ కొత్త బ్రిడ్జి నిర్మాణంతో ఒక చివర నుంచి మరో చివరకి చేరుకోవడం చాలా సులభం అవుతుంది. చైనా తన సొంత సరిహద్దు ప్రాంతంలో ఈ వంతెనను బ్రిడ్జి నిర్మించింది. అయితే ఇప్పుడు దానికితోడు పక్కనే రహదారిని నిర్మిస్తున్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఈ బ్రిడ్జికి సంబంధించి ఇప్పటి వరకు భారత విదేశాంగ శాఖ ఓసారి ఖండించింది.