Zoonotic Langya Virus: చైనాను వణికిస్తున్న కొత్త రకం వైరస్.. భయంతో వణికిపోతున్న ప్రజలు

కరోనా వైరస్ వ్యాప్తితో చైనా అతలాకుతలం అయింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది.

Zoonotic Langya Virus: చైనాను వణికిస్తున్న కొత్త రకం వైరస్.. భయంతో వణికిపోతున్న ప్రజలు

China peoplle

Zoonotic Langya Virus: కరోనా వైరస్ వ్యాప్తితో చైనా అతలాకుతలం అయింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ప్రస్తుతం కరోనా వైరస్ ఆ దేశంలో అదుపులోనే ఉంది. ఈ తరుణంలో మంకీపాక్స్ రూపంలో కొత్త వైరస్ చైనా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. దానివల్ల పెద్దగా ప్రమాదం లేదని భావిస్తున్న తరుణంలోనే మరో కొత్త వైరస్ చైనా ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.

China ‘Yuan Wang 5’ : చైనాకు చెక్ పెట్టిన శ్రీలంక..నిఘానౌక ‘యువాన్‌ వాంగ్ 5’ నిలిపే యత్నం..

చైనా దేశంలో జూనోటిక్ లాంగ్యా ( Zoonotic Langya) వైరస్ స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందులు ఎధుర్కొన్న చైనీయులు ప్రస్తుతం కొత్తగా వెలుగులోకి వచ్చిన వైరస్ తో ఇంకెన్ని ఇబ్బందులు పడాలోనని ఆందోళణ చెందుతున్నారు. అయితే ఈ కొత్త వైరస్ 35 మందికి సోకింది. తైవాన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (TCDC) ప్రకారం.. జూనోటిక్ లాంగ్యా అనే ఈ వైరస్ చైనాలోని షాన్‌డాంగ్, హెనాన్ ప్రావిన్సులలో కనుగొనబడిందని, తైవాన్ లో ఈ వైరస్‌ను పర్యవేక్షించడానికి, గుర్తించడానికి కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారని, దీనికి న్యూక్లియిక్ యాసిడ్ టెస్టింగ్ మెథడ్ అని పేరు పెట్టారని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తెలిపింది.

Viral Video: వింత ఆచారం.. పెళ్లిపీటల మీద భర్తను ఓ ఆటాడుకున్న భార్య .. వీడియో వైరల్

తైవాన్ కు చెందిన సీడీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చువాంగ్ జెన్ హ్సియంగ్ ఆదివారం మాట్లాడుతూ.. ఒక అధ్యయనం ప్రకారం.. ఈ వైరస్ మనుషుల మధ్య వ్యాప్తి చెందుతుందా లేదా అనేది ఇంకా నిర్ధారించలేదని తెలిపాడు. అయితే ఈ వైరస్ పట్ల ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పెంపుడు జంతువులపై నిర్వహించిన సెరోలాజికల్ సర్వే సమాచారం ప్రకారం.. పరీక్షల్లో మేకలలో రెండు శాతం, కుక్కల్లో ఐదు శాతం పాజిటివ్ గా తేలిందని అక్కడి వైద్యులు పేర్కొన్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ తెలిపింది. ఇదిలాఉంటే చైనాలోకి ఈ వైరస్ 35 మందికి సోకిందని, అయితే ఒకరికొకరు సన్నిహిత సంబంధాలు లేవని చువాంగ్ చెప్పారు. 26 మందిలో జ్వరం, ఆయాసం, దగ్గు, ఆకలి మందగించడం, కండరాల నొప్పి, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయని ఆయన చెప్పారు.

Nitish Kumar: నితీశ్ కుమార్ సపరేట్ రికార్డ్.. 22ఏళ్లలో 8వ సారి సీఎం

ఈ వైరస్ వల్ల ప్లేట్ లైట్స్ తగ్గిపోవటం, కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం చూపుతుందని వైద్యులు గుర్తించారు. చైనాలోని కరోనావైరస్ విషయానికి వస్తే.. చైనా యొక్క జీరో-కోవిడ్ విధానం కారణంగా షాంఘై నివాసితులు చాలా కఠినమైన లాక్‌డౌన్‌ను ఎదుర్కొన్నారు. కొత్త వైరస్ తో మరోసారి అలాంటి పరిస్థితి వస్తుందా అన్న ఆందోళన అక్కడి ప్రజల్లో వ్యక్తమవుతుంది.