Viral Video: వింత ఆచారం.. పెళ్లిపీటల మీద భర్తను ఓ ఆటాడుకున్న భార్య .. వీడియో వైరల్

ప్రపంచ వ్యాప్తంగా వివాహ సంప్రదాయాలు ఒక్కోచోట ఒక్కో విధంగా ఉంటాయి. నేపాల్ లో వింత ఆచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూడటానికి నవ్వు తెప్పిస్తున్నా..

Viral Video: వింత ఆచారం.. పెళ్లిపీటల మీద భర్తను ఓ ఆటాడుకున్న భార్య .. వీడియో వైరల్

Viral Video: ప్రపంచ వ్యాప్తంగా వివాహ సంప్రదాయాలు ఒక్కోచోట ఒక్కో విధంగా ఉంటాయి. నేపాల్ లో వింత ఆచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూడటానికి నవ్వు తెప్పిస్తున్నా.. భర్తను భార్య పెళ్లి పీటల మీదనే ఓ ఆటాడుకుంది. వధూవరులు ఒకరికొకరు పోటీపడి మరీ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసినట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది.

Viral Video : రాజకీయ నాయకుడి కారుని ఈడ్చుకెళ్లిన లారీ

సంప్రదాయ వివాహ దుస్తులను ధరించి కళ్యాణ మండపంపై వధూవరుడు కూర్చుకున్నారు. పెళ్లి తంతు పూర్తయింది. అయితే అక్కడ వారు పాటించే ఆచారం ఇక మిగిలిఉంది.  దంపతులు ఒకరికొకరు తినిపించుకొనే ఆచారాన్ని ప్రారంభిస్తారు. ఈ క్రమంలో భర్తను భార్య ఓ ఆటాడుకుంది. భార్య బలవంతంగా అతనికి ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు వరుడు నవ్వుతూ తప్పించుకొనే ప్రయత్నం చేశాడు. చుట్టుపక్కల వారు కూడా ఈ జంటను పూర్తి స్థాయిలో గొడవ పడకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే 70వేలకుపైగా లైక్ వచ్చాయి. అయితే నెటిజన్లు మాత్రం ఈ విచిత్ర ఆచారాన్ని చూసి సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by British Bengali Banter 🇧🇩🇬🇧 (@thegushti)

ఒక నెటిజన్ ఇలా రాశాడు.. ఈ సాంప్రదాయం నేపాల్ లోనే కాదు.. భారత్ లోనూ పలు ప్రాంతాల్లో కనిపిస్తోంది అంటూ పేర్కొన్నాడు. మరొక నెటిజన్ స్పందిస్తూ.. జీవితకాలం ఇలానే ఉంటే  భర్త పని ఇక అంతే అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు.