అమెరికాపై చైనా ఫైర్.. WHOతో ఒప్పందం సరే.. మాపై వేలెత్తి చూపించొద్దు!

అమెరికాపై చైనా ఫైర్.. WHOతో ఒప్పందం సరే.. మాపై వేలెత్తి చూపించొద్దు!

China fires back at Washington : అమెరికాపై డ్రాగన్ చైనా ఫైర్ అయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కోవిడ్ రిపోర్టుకు సంబంధించి చైనా ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వైరస్ మూలాలుపై WHO పరిశోధన అంశాలకు సంబంధించి చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల ఏళ్లలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో బహుపాక్షిక సహకారాన్ని అమెరికా దెబ్బతీసిందంటూ చైనా విమర్శించింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ Sullivan ఇచ్చిన ప్రకటనపై చైనా రాయబారి స్పందించారు.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో డబ్ల్యుహెచ్ఓకి మద్దతుగా నిలిచిన చైనా సహా ఇతర దేశాల వైపు వేళ్లు చూపించరాదని ఆ దేశ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే డబ్ల్యూహెచ్‌ఓతో తిరిగి ఒప్పందం కుదుర్చుకోవాలన్న వాషింగ్టన్ నిర్ణయాన్ని చైనా స్వాగతించింది. ఈ ఒప్పందం అనేది ఇతర దేశాల లక్ష్యంగా ఉండరాదని తెలిపింది.

అలాగే అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని చైనా స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి ప్రారంభమైన రోజుల నుంచి సేకరించిన మొత్తం కేసులు, మరణాల డేటాను అందుబాటులో ఉంచాలని వాషింగ్టన్ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ చైనాను కోరారు. దీనిపై చైనా మండిపడింది.