భారత్‌తో యుద్ధాన్ని కోరుకోవడం లేదు.. జిన్ పింగ్

  • Published By: sreehari ,Published On : September 22, 2020 / 10:43 PM IST
భారత్‌తో యుద్ధాన్ని కోరుకోవడం లేదు.. జిన్ పింగ్

ఇరుదేశాల సరిహద్దుల్లో ఉద్రికత్తల నేపథ్యంలో భారత్, చైనా చర్చల్లో పురోగతి లభించింది.

భారత్ తో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ స్పష్టం చేశారు.



కమాండర్ స్థాయి చర్చలో పాజిటివ్ కార్ప్స్ కనిపిస్తోంది.

సరిహద్దులకు మరిన్ని బలగాలను తరలించకూడదని డ్రాగన్ నిర్ణయించింది. త్వరలోనే రెండు దేశాల మధ్య ఏడో విడత చర్చలు జరుగనున్నాయి.



తాయు భారత్ తో యుద్ధాన్ని కోరుకోవడం లేదని జిన్ పింగ్ తెలిపారు.

యూన్ జీఏలో సమావేశంలో ఆయన భారత్ తో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని ప్రకటించారు.

ఐరాస సర్వసభ్య సమావేశంలో జీ జిన్ పింగ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము యుద్ధాన్ని కోరుకోవడంలేదని, కోల్డ్ వార్ , హాట్ వార్ తమకు అవసరం లేదన్నారు. 75వ యూఎన్ సర్వసభ్య సమావేశంలో రికార్డు చేసిన వీడియో మెసేజ్ లో జిన్ పింగ్ వెల్లడించారు.

దేశాల మధ్య బేధాభిప్రాయాలు ఉండటం సహజమేనని అన్నారు. వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశమైన చైనా.. శాంతియుత, సహకార సంబంధమైన అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.

తమ దేశం ఎప్పటికీ విస్తరణ, ఆధిపత్యాన్ని కోరుకోదని చెప్పారు. ఇతర దేశాలతో తమకు ఉన్న విభేదాలను తగ్గించుకుంటామన్నారు.

సంభాషణలు, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటామన్నారు.