Aliens : ఎలియన్ల ఉనికోసం పరిశోధనల్లో చైనా ముందడుగు

ఈ రాకెట్ లాంచ్లో మొత్తం ముగ్గురు వ్యోమగాములు టియాన్ గాంగ్ స్పేస్ స్టేషన్ కు పయనమయ్యారు. ఆరుమాసాలపాటు ఈ ముగ్గురు వ్యోమగాములు టియాన్ గాంగ్ స్సేస్ స్టేషన్ లో గడపనున్నారు.

Aliens : ఎలియన్ల ఉనికోసం పరిశోధనల్లో చైనా ముందడుగు

Long March 2f

Aliens : ప్రపంచదేశాలన్నీఒక దారైతే, డ్రాగన్ కంట్రీది మాత్రం మరోదారి. అన్ని విషయాల్లోను చైనా తన మార్కును ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనల్లో ప్రత్యేక ఎజెండాతో ముందుకు సాగుతుంది. అగ్రదేశాలు స్సేస్ టూరిజంలో అధిపత్యంకోసం పోటీలు పడుతూ ప్రయోగాలు చేస్తుంటే చైనా మాత్రం ప్రత్యేక లక్ష్యంతో అంతరిక్ష పరిశోధనలను చేపడుతుంది. ఇంతకీ ఆ ప్రత్యేక లక్ష్యం విషయానికి వస్తే ఎలియన్ల జాడ కనిపెట్టటమే డ్రాగన్ ముందున్న లక్ష్యం.

ఇందుకోసం చైనా భారీగానే స్కెచ్ సిద్దం చేసుకుంది. ఈక్రమంలోనే ఓ అరుదైన ఘట్టానికి శ్రీకారం చుట్టింది. పెద్ద మొత్తంలో ఖర్చు చేసి చైనా సొంత స్పెస్ స్టేషన్ నిర్మించుకుంది. చైనా నిర్మించిన ఈ టియాన్ గాంగ్ స్పేస్ స్టేషన్ కి సంబంధించి ఎక్విప్ మెంట్ సెటప్ తోపాటు టెక్నాలజీ పర్యవేక్షణకోసం ముగ్గురు వ్యోమోగాములను నింగిలోకి పంపింది. శుక్రవారం అర్ధరాత్రి గోబీ ఎడారిలోని జిక్యూక్వాన్ లాంచ్ సెంటర్ నుండి లాంగ్ మార్చ్ 2 ఎఫ్ రాకెట్ ను నింగిలోకి పంపింది.

ఈ రాకెట్ లాంచ్లో మొత్తం ముగ్గురు వ్యోమగాములు టియాన్ గాంగ్ స్పేస్ స్టేషన్ కు పయనమయ్యారు. ఆరుమాసాలపాటు ఈ ముగ్గురు వ్యోమగాములు టియాన్ గాంగ్ స్సేస్ స్టేషన్ లో గడపనున్నారు. 2008లో చైనా తరపున స్పేస్​ వాక్​ చేసిన జాయ్​ ఇఝ్​గ్యాంగ్​​ తాజా మిషన్​కు నాయకత్వం వహిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చైనా చెపట్టిన అతిపెద్ద అంతరిక్ష ప్రయోగం ఇదే అవుతుంది. ఇదిలా వుంటే ఎలియన్ల ఉనికిని కనుగొనేందుకు ఇప్పటికే చైనా ప్రపంచంలోని అతిపెద్ద సిగ్నల్ వ్యవస్ధను ఏర్పాటు చేసుకుంది. ప్రపంచదేశాలు శోధించని అంశాలను పసిగట్టాలన్న తపనతో చైనా ముందుకు కదులు తుంది.