China-India relation: ఇండియాతో సంబంధాలపై చైనా కీలక ప్రకటన.. కలిసి పని చేసేందుకు సిద్ధమన్న చైనా మంత్రి

ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో భారత్‌తో సంబంధాల గురించి అక్కడి విలేకరులు ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ స్థిరమైన అభివృద్ధి కోసం, సంబంధాల మెరుగు కోసం ఇండియాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

China-India relation: ఇండియాతో సంబంధాలపై చైనా కీలక ప్రకటన.. కలిసి పని చేసేందుకు సిద్ధమన్న చైనా మంత్రి

Updated On : December 25, 2022 / 12:58 PM IST

China-India relation: ఇండియా-చైనా మధ్య సంబంధాల మెరుగు కోసం ఇండియాతో కలిసి పని చేసేందుకు సిద్ధమని చైనా ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఈ ప్రకటన చేశారు. ఈ విషయాన్ని చైనా విదేశాంగ శాఖ తన వెబ్‌సైట్ ద్వారా వెల్లడించింది. ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో భారత్‌తో సంబంధాల గురించి అక్కడి విలేకరులు ప్రశ్నించారు.

United States: అమెరికాలో మంచు తుపాన్ ధాటికి 18 మంది మృతి.. కరెంటు లేక చీకట్లోనే 17 లక్షల మంది

దీనికి ఆయన సమాధానమిస్తూ స్థిరమైన అభివృద్ధి కోసం, సంబంధాల మెరుగు కోసం ఇండియాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ‘‘దౌత్య మార్గాలు, మిలిటరీ మార్గాల ద్వారా ఇప్పటికే ఇండియా-చైనా సంబంధాలు కొనసాగిస్తున్నాయి. సరిహద్దులో స్థిరత్వం కోసం రెండు దేశాలూ చిత్తశుద్ధితో ఉన్నాయి. రెండు దేశాల మధ్య సంబంధాల మెరుగు కోసం ఇండియాతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని వాంగ్ ఈ వ్యాఖ్యానించారు. ఈ నెల 9న తవాంగ్ ప్రాంతంలోని సరిహద్దులో, ఇండియా-చైనా సైనికులు ఘర్షణ పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాల విషయంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో చైనా విదేశాంగా మంత్రి చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు తాజా ఘర్షణలపై ఇరు దేశాల మధ్య ఈ నెల 20న కోర్ కమాండర్ స్థాయి సమావేశం జరిగింది. చుశుల్-మోల్డో సరిహద్దు ప్రాంతంలో ఈ చర్చలు సాగాయి. అయితే, సరిహద్దులో సైనికుల మధ్య సమస్యపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మధ్యేమార్గంగా ఇప్పటివరకు పశ్చిమ ప్రాంతంలో ఉన్న సైనిక స్థిరత్వాన్ని, భద్రతను అలాగే కొనసాగించాలని నిర్ణయించారు.