Love Holidays in China : యువతకు ‘ప్రేమపాఠాలు’ నేర్పుతున్న చైనా ప్రభుత్వం..! ప్రేమించుకోవటానికి విద్యార్ధులకు సెలవులు..!!

విద్యార్ధులకు వేసవి సెలవులుంటాయి. పండుగ సెలవులు ఉంటాయి. కానీ చైనా ప్రభుత్వం మాత్రం విద్యార్ధులకు ‘ప్రేమ సెలువులు’ ఇచ్చింది ప్రభుత్వం. ప్రేమించుకోవండీ అంటూ సెలవులు ఇచ్చింది చైనా ప్రభుత్వం..!

Love Holidays in China : యువతకు ‘ప్రేమపాఠాలు’ నేర్పుతున్న చైనా ప్రభుత్వం..! ప్రేమించుకోవటానికి విద్యార్ధులకు సెలవులు..!!

Love Holidays in China

Love Holidays in China : విద్యాసంస్థలకు వేసవి సెలవులుంటాయి. పండుగ సెలవులు ఉంటాయి. కానీ చైనాలో మాత్రం ‘ప్రేమ సెలువులు’ (love holidays)ఉంటాయనీ మీకు తెలుసా? ప్రేమించుకోవండీ అంటూ సెలవులు ఇచ్చింది చైనా ప్రభుత్వం..! ఎప్పుడూ పొరుగు దేశాలపై కజ్జాలకు కాలు దువ్వుతు..సాంకేతికంగా దూసుకుపోతూ కొత్త కొత్త ఆవిష్కరణలు చేసే చైనా ప్రభుత్వం కొత్త పంథాను ఎత్తుకుంది. స్పై బెలూన్లు, స్పై నౌకలతో ఇతర దేశాలను ఉలిక్కిపడేలా చేసే చైనా సరికొత్తగా యువతకు ప్రేమ పాఠాలు నేర్పుతోంది కమ్యూనిస్టు దేశం. అదేనండీ యువతకకు ప్రేమించుకోవటానికి ప్రత్యేక సెలవుల్ని ఇచ్చింది.. వినటానికి ఇది కాస్త వింతగా ఉన్నా ఇది నిజం..!!
చైనాలో తొమ్మిది కాలేజీల్లో విద్యార్ధులకు ప్రేమలో పడండీ అంటూ సెలవులు మంజూరు చేసింది ప్రభుత్వం. ఏప్రిల్ 1 నుండీ 7 వరకు ప్రేమించుకోవాలని… రొమాన్స్, లైఫ్ మీద ఫోకస్ చేయాలని, ప్రకృతిని ఆస్వాదించాలని సూచిస్తు విద్యార్ధులకు వారం రోజుల పాటు ‘లవ్ హాలీ డేస్’ ప్రకటించిందని తెలిపింది. ఈ సందర్భంగా ఆయా కాలేజీలు విద్యార్ధలు పచ్చని పర్వతాలను చూడటానికి వెళ్లండీ..వసంతపు ఊపిరిని పీల్చుకోగలరి ఆశిస్తున్నామంటూ పేర్కొన్నాయి. విద్యార్ధులు ప్రకృతిలో విహరిస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుందనీ..దీంతో వారు పాఠాలను చక్కగా అర్థం చేసుకుని వారి భవిష్యత్తును బంగారు బాటగా మలచుకోగలరు అంటూ లియాంగ్ గుహోహుయ్, మియాన్యాంగ్ ప్లయింగ్ ఒకేషనల్ కాలేజీ డిప్యూటీ డీన్ తెలిపారు. అంతేకాదు విద్యార్ధులకు డైరీలు రాయటం, వ్యక్తిగత వికాసాన్ని పెంపొందించుకోవటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు.

కానీ ఇది కేవలం విద్యార్ధుల భవిష్యతు కోసమే కాదని చైనాలో అత్యంత దారుణంగా పడిపోతున్న జననాల రేటు పెంచుకోవటానికని స్పష్టంగా తెలుస్తోంది. అసలు చైనా యువత ప్రేమించటానికి..వివాహాలు చేసుకోవటానికి పెద్దగా ఆసక్తి చూపించటంలేదు. ఇదంతా ఒకే బిడ్డ విధానం తెచ్చిన తంటా..దీంతో జననాల రేటును పెంచుకోవడానికి.. కొన్ని కాలేజీలు విద్యార్థులకు వారం రోజుల పాటు ‘లవ్ హాలిడేస్ ‘ మంజూరు చేసింది ప్రభుత్వం. వివాహాలు చేసుకునేవారికి ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహాలు ప్రకటించినా చైనాలో వివాహాలు చేసుకోవటానికి యువత ఆసక్తి చూపించటంలేదు. మరోపక్క వివాహాలు చేసుకున్నవారికి రెండో బిడ్డను, మూడో బిడ్డను కనమని దాని కోసం కూడా ప్రోత్సహాలు అందిస్తున్న ఎటువంటి ఫలితం కనిపించటలేదు. దీంతో ప్రభుత్వం ఈ ‘లవ్ హాలిడేస్’ పద్ధతిని అవలంభించి ఫలితాలను కాస్తైనా మెరుగుపరుచుకోవటానికి యత్నిస్తోంది. చైనా ప్రభుత్వం జనాభా పెంచుకోవటానికి పడే పాట్లలో ఈ ‘లవ్ హాలిడేస్’..సంచలనాత్మక నిర్ణయం ఒకటిగా కనిపిస్తోంది.

China One Child Policy : ‘34 ఏళ్ల క్రితం మా అమ్మ డైరీ ’గుండెలు మెలిపెట్టే తల్లి మానసిక వ్యథను కళ్లకు కట్టిన కూతురు

ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే రాయితీలూ ఇస్తోన్న చైనా.. ఇప్పుడు ఏకంగా ‘ప్రేమలో పడండి” అంటూ విద్యార్థులకు సెలవులు కూడా మంజూరు చేసింది. తొమ్మిది కాలేజీలు విద్యార్థులకు ‘లవ్ హాలీ డేస్’ప్రకటించటం ఆసక్తి కరంగా మారింది.బర్త్ రేట్ పెంచుకోవటానికి చైనా ప్రభుత్వానికి 20కి పైగా సిఫార్సులు వచ్చాయి. ఐతే ఎక్స్ పర్ట్స్… జనాబా తగ్గిపోకుండా ఏం చేయాలనే ప్రయత్నాలు చేస్తూనే..ఇప్పుడు ఈ లవ్ హాల్ డేస్ ను తెరమీదకు తీసుకువచ్చారు.

కాగా.. 1980 నుంచి 2015 మధ్య విధించిన ఒక బిడ్డ విధానమే ఉండేది. ఇది అప్పట్లో పెను సంచలనాత్మక నిర్ణయమే అయినా అప్పటి పరిస్థితులు ఆ విధానాన్ని అవలంభించాల్సి రావటంతో ఆ నిర్ణయం ప్రభావం ఇప్పుడు చైనా జననాల రేటుపై తీవ్రంగా పడింది. మరీ ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి పుణ్యమా అని ఈ సమస్య మరింతగా పెరిగింది. చైనాలో ఒక్కసారిగా జననాల రేటు ఘోరంగా పడిపోయింది. దీంతో షాక్ తిన్న చైనా.. తమ దేశ జనాభాను పెంచేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ ప్రజలు మాత్రం పెరుగుతున్న ఖర్చుల రీత్యా బిడ్డను కనటానికి ఆసక్తి చూపించటంలేదు.పిల్లలు ఎక్కువగా ఉంటే వారి సంరక్షణ, చదువులు వంటి ఖర్చులు భరించాలంటే వారికి వచ్చే ఆదాయం సరిపోవటంలేదు చాలామంది జనాభాకు. దీంతో ఇద్దరు ముగ్గురు బిడ్డలను కనటానికి ఇష్టపడటంలేదు. ప్రభుత్వ కొత్త విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో కొత్తగా ఈ ‘లవ్ హాలిడేస్’విధానాన్ని తీసుకొచ్చింది డ్రాగన్ ప్రభుత్వం. యువతి ప్రేమలో పడితే వివాహాలు చేసుకుంటారు..పిల్లల్ని కంటారనే ఆశాభావంతో ఇటువంటి వినూత్న నిర్ణయం తీసుకుంది చైనా ప్రభుత్వం.

India To NATO : నాటోలో భారత్ చేరటానికి తలుపులు తెరిచే ఉన్నాయ్ : యూఎస్‌ నాటో రాయబారి షాకింగ్‌ కామెంట్స్