చైనా నిజంగా సూపర్ పవరేనా? కరోనా వ్యాక్సిన్ తయారీతో తేలిపోతుంది

చైనా నిజంగా సూపర్ పవరేనా? కరోనా వ్యాక్సిన్ తయారీతో తేలిపోతుంది

china corona vaccine: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి భయాందోళనలు పుట్టిస్తుంటే చైనాను తలదన్నే రీతిలో వ్యాక్సిన్ రెడీచేసేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరంచేసింది. దేశ పౌరులను కాపాడటంతో పాటు ఎకానమీని సంరక్షించుకోవడం కూడా బాధ్యతగా భావించి ఆవిధంగా చర్యలు తీసుకుంటున్నారు.



నిజానికి చైనా వ్యాక్సిన అవసరం అన్నీ దేశాల కంటే ఎక్కువగా ఉంది. దాంతో పాటే చైనాకూడా వ్యాక్సిన్ డెవలప్ చేస్తుందని ప్రపంచ దేశాలన్నీ ఎదురుచూస్తున్నాయని పురుడే యూనివర్సిటీ వైరాలజిస్ట్ రిచర్డ్ కున్ అంటున్నారు.

* అమెరికాతో పోల్చుకుంటే చైనాకు అంతటి డెవలపింగ్ ఎనర్జీ లేదు.
* RNA, DNAలు వ్యాక్సిన్ లు తయారుచేయడానికి చైనా టీంలు అనేక రకాల ప్రయోగాలు చేస్తున్నాయి. ఇంకా మనుషులపై ప్రయోగించేందుకు ఆమోదం దక్కించుకోలేకపోయాయి.
* చైనా కంపెనీలు అయిన సినోఫార్మ్, సినోవాక్ బయోటెక్ మాత్రమే హ్యూమన్ ట్రయల్స్ మూడో దశకు చేరుకున్నాయి.
* బ్రెజిల్, ఇండోనేషియా, యూఏఈ లాంటి విదేశాలకు వ్యాప్తి చేసిన చైనా కరోనాను అదుపుచేయగలిగింది.



* ఈ వ్యాక్సిన్ ప్రయోగాల్లో కూడా చైనా వివాదస్సదంగానే నిలిచింది. మిలటరీ, భవన నిర్మాణ కార్మికులపై ప్రయోగించడంలో కూడా వివాదస్పదంగా మారింది.
* ఈ మహమ్మారి ప్రభావంతో చైనా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ బయోలాజికల్ ల్యాబొరేటరీలు, క్రియో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్స్, జెనోమ్ సీక్వెన్సర్ లాంటివాటినిభారీఎత్తులో సిద్ధం చేసుకున్నాయి.
* వ్యాక్సిన్ రెడీ చేసేందుకు విదేశాల్లో శిక్షణ పొందిన వారిని చైనా పిలిపిస్తుందని.. చైనాలోని యూ.ఎస్.సీ.డీ.సీ ఆఫీస్ మాజీ డైరక్టర్ రే యిప్ అంటున్నారు.



వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ రేసులో చైనా భారీగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రపంచానికి పరిచయం చేసిన కరోనాకు తానే వ్యాక్సిన్ డెవలప్ చేసి ప్రపంచాలపై పైచేయి సాధించాలని ప్లాన్ చేస్తుంది.
* ఇదిలా ఉంటే దేశంలో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ అంటూ అప్రూవల్ పొందని వ్యాక్సిన్లు రిలీజ్ అయి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. మనిషి నుంచి మనిషికివ్యాప్తి చెందుతున్న విధానానికి చెక్ పెట్టడమే టార్గెట్.



* తామే ముందున్నామని అనిపించుకోవాలని రష్యా మానవులపై ప్రయోగాలలో మూడో దశకు చేరుకోకముందే వ్యాక్సిన్ రిలీజ్ చేసేసింది. ఫలితంగా విమర్శలు, స్కెప్టిసిజాలను ఎదుర్కోక తప్పలేదు.
* చైనా నుంచి కాన్సినో బయోలాజిక్స్, సినోఫార్మ్ రీసెంట్ గా ఫేజ్ 1,ఫేజ్ 2 ట్రయల్స్ ను సైంటిఫిక్ జర్నల్స్ లో ప్రచురించాయి.
* వ్యాక్సిన్ విడుదలపై ఆరాటంతో రష్యా, చైనాలకు చెందిన హ్యాకర్లు.. అమెరికాలో జరుగుతున్న కరోనావైరస్ వ్యాక్సిన్ రీసెర్చ్ వివరాలు దొంగిలించాలని ప్లాన్ చేస్తున్నారట.
వ్యాక్సిన్ రెడీగా ఉందని దానిని ఫిలిప్పీన్స్, పాకిస్తాన్ వారిపై ప్రయోగించాలని చూస్తుంది చైనా.



ఒకవేళ వ్యాక్సిన్ ను రిలీజ్ చేసి సక్సెస్అయితే చైనా.. ఎక్స్‌ట్రార్డినరీ డిప్లొమాటిక్ అండ్ సైంటిఫిక్ మూమెంట్ ఫేస్ చేస్తుందని రిటర్సన్ అంటున్నారు.