China Spy Balloon: అమెరికా గగనతలంపై చైనా స్పై బెలూన్.. విదేశాంగ మంత్రి బ్లింకెన్ చైనా పర్యటన రద్దు ..

అమెరికా గగనతలంలో స్పై బెలూన్ వ్యవహారంపై చైనా స్పందించింది. ఈ అంశాన్ని అమెరికా అనవసరంగా రద్దాంతం చేస్తోందని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో వింగ్ తెలిపారు. అంతర్జాతీయ గగనతల నిబంధనలు ఉల్లంఘించే ఉద్దేశం చైనాకు లేదని, ఇరుదేశాలు ఈ సమస్యను ప్రశాంతంగా పరిష్కరించుకోవచ్చని ఆయన అన్నారు.

China Spy Balloon: అమెరికా గగనతలంపై చైనా స్పై బెలూన్.. విదేశాంగ మంత్రి బ్లింకెన్ చైనా పర్యటన రద్దు ..

Chinese Spy Balloon

China Spy Balloon: అమెరికా గగనతలంలో చైనా అనుమానిత స్పై బెలూన్ కలకలం సృష్టించింది. ఈ బెలూన్ అమెరికాలోని మోంటానాతో పాటు అనేక సున్నితమైన ప్రదేశాలపై ఎగురుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ స్పై బెలూన్‌ను ఉత్తర అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ (ఎన్ఓఆర్ఏడీ) నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఈ బెలూన్ పరిమాణం చాలా పెద్దదిగా ఉంది. అయితే, ఈ స్పై బెలూన్ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని ఎన్ఓఆర్ఏడీ పేర్కొంది. సైనిక విమానాల ద్వారాకూడా స్పై బెలూన్ కదలికలపై అమెరికా పర్యవేక్షణ జరుపుతుంది. తొలుత ఈ బెలూన్‌ను ధ్వంసం చేయాలని అమెరికా భావించింది. కానీ, బెలూన్ శిథిలాల వల్ల ప్రజలకు ఏమైనా ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని సీనియర్ అధికారులు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌‌కు సూచించారు.

Hydrogen Balloon: హమ్మయ్య కిందికొచ్చాడు.. హైడ్రోజన్ బెలూన్‌లో చిక్కుకున్న వ్యక్తి.. రెండు రోజులు గాల్లోనే..

చైనాకు చెందిన బెలూన్ గూఢచర్యానికి వినియోగిస్తున్నట్లు స్పష్టమవుతోందని అమెరికా రక్షణ శాఖ సీనియర్ అధికారి ఒకరు అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. అమెరికాలో గూఢచారి బెలూన్స్ గతంలో చాలాసార్లు కనిపించాయి. అయితే, చాలాకాలం తరువాత  అమెరికా గగనతలంలో చైనా స్పై బెలూన్ కనిపించడం ఆందోళనకు గురిచేస్తోంది. గతేడాది చైనా, అమెరికా మధ్య తైవాన్ సమస్య కారణంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం విధితమే. తైవాన్ లో మానవ హక్కుల ఉల్లంఘనలను, దక్షిణ చైనా సముద్రంలో చైనా సైనిక కార్యకలాపాలను అమెరికా ఖండిస్తోంది. దీంతో ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతూ వస్తోంది.

PM Modi Black Balloons : మోదీకి తప్పిన పెనుప్రమాదం.. ప్రధాని హెలికాప్టర్‌కు సమీపంలో బెలూన్ల కలకలం

అమెరికా గగనతలంపై చైనా స్పై బెలూన్ ఎగురుతుండటంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. స్పై బెలూన్ వ్యవహారంపై చైనా స్పందించింది. ఈ అంశాన్ని అమెరికా అనవసరంగా రద్దాంతం చేస్తోందని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో వింగ్ తెలిపారు. ఇరు దేశాల సార్వభౌమాధికారాన్ని, గగనతల నిబంధనలు ఉల్లంఘించే ఉద్దేశం చైనాకు లేదని, ఇరుదేశాలు ఈ సమస్యను ప్రశాంతంగా పరిష్కరించుకోవచ్చని ఆయన అన్నారు. చైనా బాధ్యతాయుతమైన దేశమని, అది ఎల్లప్పుడూ అంతర్జాతీయ చట్టాలను అనుసరిస్తుందని చెప్పారు. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ బెలూన్ పై వివరణ ఇచ్చింది. ఈ బెలూన్ వల్ల ఎవరికీ హాని జరగదని ప్రకటన విడుదల చేసింది. ఈ బెలూన్ వాతావరణ పరిశోధనకు సంబంధించిందని, బలమైన గాలులు కారణంగా అది నిర్ణీత మార్గందాటి బయటకు వచ్చిందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది.