PM Modi Black Balloons : మోదీకి తప్పిన పెనుప్రమాదం.. ప్రధాని హెలికాప్టర్‌కు సమీపంలో బెలూన్ల కలకలం
ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా లోపాలు బయటపడ్డాయి. గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలో నల్ల బెలూన్ల కలకలం నెలకొంది.(PM Modi Black Balloons)

PM Modi Black Balloons : ప్రధాని మోదీకి పెనుప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు అతి సమీపంలో నల్ల బెలూన్లు రావడం కలకలం రేపింది. అల్లూరి జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన మోదీకి నిరసన సెగ తగిలింది. గన్నవరం నుండి భీమవరంకు వెళ్తున్న మోదీ హెలికాఫ్టర్‌కు ఎదురుగా బ్లాక్ కలర్ బెలూన్లు విడిచిపెట్టారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని కేసరిపల్లిలో జరిగింది. ఇది పూర్తిగా భద్రతా, నిఘా వైఫల్యమే అనే విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, మోదీ సురక్షితంగా భీమవరానికి చేరుకుని అక్కడ ప్రసగించిన అనంతరం తిరిగి ప్రయాణమయ్యారు.
ప్రధాని మోదీ భీమవరం పర్యటనలో భద్రతా లోపాలు బయటపడ్డాయి. గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలో నల్ల బెలూన్ల కలకలం నెలకొంది. ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ కేసరపల్లిలో నల్ల బెలూన్లను గాల్లోకి వదిలారు కొందరు కాంగ్రెస్ నేతలు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
ఎయిర్ పోర్టు సమీపంలోని ఓ భవనం పైనుంచి బెలూన్లు వదిలారు. ఏపీ పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజురతన్ నేతృత్వంలో బెలూన్లును వదిలారు యువకులు. అటు గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ హల్ చల్ చేశారు. గో బ్యాక్ మోదీ అంటూ నినాదాలు చేశారు. బెలూన్లను వదిలిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాని మోదీ హెలికాప్టర్ లో భీమవరం వెళ్లారు. ఆ హెలికాప్టర్ పక్కనే కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలియజేస్తూ గాల్లోకి వదిలిన నల్ల బెలూన్లు కనిపించడం కలకలం రేపింది. గన్నవరం ఎయిర్ పోర్టుకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేసరపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైకి ఎక్కిన కాంగ్రెస్ నేతలు నిరసన తెలుపుతూ నల్ల బెలూన్లను గాల్లోకి వదలటం జరిగింది.
Modi: యావత్ భారత్ తరఫున అల్లూరికి పాదాభివందనం చేస్తున్నాను: మోదీ
ప్రధాని మోదీ ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ సమీపంలో బెలూన్లు కనిపించడం కలకలం రేపింది. సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇది భద్రతా లోపమే అన్న విమర్శలు వస్తున్నాయి. ప్రధాని పర్యటన అంటే చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తారు. పటిష్టమైన భద్రత, బందోబస్తు ఉంటుంది. దేశంలోనే అత్యున్నత స్థాయి పదవిలో ఉన్న వ్యక్తి కాబట్టి భారీ భద్రత ఉంటుంది. ఇంత భద్రత, బందోబస్తు ఉన్నప్పటికి.. నల్ల బెలూన్లు ప్రధాని ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సమీపం వరకు వెళ్లాయంటే అది కచ్చితంగా భద్రతా వైఫల్యమే అనే విమర్శలు వస్తున్నాయి.

Black Balloons
ఉదయం నుంచి కూడా ఎయిర్ పోర్టు సమీపంలో వేలాది మంది పోలీసులు ఉన్నప్పటికీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల ఉన్నతాధికారులు చాలా సీరియస్ గా ఉన్నారు. గాల్లోకి బెలూన్లు వదిలినపై వారిపై కేసులు కూడా నమోదు చేశారు. వాళ్లను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. మరికొందరిని కూడా అరెస్ట్ చేయనున్నారు.
Andhra Pradesh: అందుకే అల్లూరి సీతారామరాజు పేరును జిల్లాకు పెట్టాం: సీఎం జగన్
గాల్లో నల్ల బెలూన్ల వ్యవహారంపై ప్రధాని భద్రతా సిబ్బంది చాలా సీరియస్ గా ఉంది. ప్రధాని స్థాయి వ్యక్తి హెలికాప్టర్ లో వెళ్తుంటే దానికి సమీపంలో నల్ల బెలూన్లు వెళ్లడం అంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని, బెలూన్లు కనుక హెలికాప్టర్ అద్దానికి అడ్డం వచ్చి ఉంటే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తేవని ఉన్నతాధికారులు అంటున్నారు. అలాంటి ప్రమాదం చోటు చేసుకునే పరిస్థితులు తృటిలో తప్పడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, బ్లాక్ బెలూన్లు వదిలిన వ్యక్తులపై కఠిన చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు.
PM Modi : ఒకే హెలికాప్టర్ లో గన్నవరం నుంచి భీమవరం బయలుదేరిన ప్రధాని మోడీ, సీఎం జగన్, ఏపి గవర్నర్