Modi: యావత్ భార‌త్ త‌ర‌ఫున అల్లూరికి పాదాభివంద‌నం చేస్తున్నాను: మోదీ

ఆంధ్ర‌ రాష్ట్రం ఒక పుణ్య భూమి, వీర భూమి అని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అన్నారు. భీమవరంలో అల్లూరి సీతారామ‌రాజు కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించి, మ‌న్యం వీరుడి 125వ జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొని మోదీ మాట్లాడారు. తెలుగులో మోదీ ప్ర‌సంగాన్ని ప్రారంభించారు.

Modi: యావత్ భార‌త్ త‌ర‌ఫున అల్లూరికి పాదాభివంద‌నం చేస్తున్నాను: మోదీ

Modi2

Modi: ఆంధ్ర‌ రాష్ట్రం ఒక పుణ్య భూమి, వీర భూమి అని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అన్నారు. భీమవరంలో అల్లూరి సీతారామ‌రాజు కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించి, మ‌న్యం వీరుడి 125వ జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొని మోదీ మాట్లాడారు. తెలుగులో మోదీ ప్ర‌సంగాన్ని ప్రారంభించారు. తెలుగు వీర లేవరా.. దీక్ష భూని సాగర అంటూ పాడారు. బలిదానాల పరంపర మనకు ప్రేరణ అని, ఇటువంటి పుణ్యభూమికి రావడం త‌న అదృష్టంగా భావిస్తున్నాన‌ని చెప్పారు. 75వ స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని జరుపుకోవడంతో పాటు 125 అల్లూరి జయంతిని జరుపుకుంటున్నామ‌ని తెలిపారు.

Sri Lanka crisis: పెట్రోల్, డీజిల్ కొర‌త‌.. శ్రీ‌లంక‌లో ఇప్ప‌టికీ తెరుచుకోని పాఠ‌శాల‌లు

మన్యం వీరుడు అల్లూరికి పాదాభివందనం చేస్తున్నాన‌ని చెప్పారు. యావత్ భార‌త్ త‌ర‌ఫున అల్లూరి పాదాల‌కు వంద‌నం చేస్తున్నానని మోదీ తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో జన్మించిన వీరులందరికీ నమస్సుమాంజలి అని ఆయ‌న అన్నారు. అల్లూరి 125 జయంతితో పాటు రంప విప్లవం ప్రారంభమై వందేళ్లయిన సందర్భంగా ఈ వేడుక‌ను ఏడాది పాటు పండగలా జరుపుకోవాలని చెప్పారు. అల్లూరి కుటుంబంతో వేదిక పంచుకోవడాన్ని తాను అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. స్వాతంత్ర్య పోరాట పోరాట పటిమ గురించి అందరికీ తెలియాలని ఆయన చెప్పారు. అల్లూరి సీతారామరాజు దేశంలో ఉన్న ఆదివాసీల సంస్కృతికి ప్రతిబింబమ‌ని మోదీ చెప్పారు. సీతారామరాజు జననం నుంచి జీవనయాత్ర మనందరికీ స్ఫూర్తి దాయకం అని ఆయ‌న అన్నారు. పూర్వీకుల హైందవ చింతన వ‌ల్లే అల్లూరిలో ఉద్యమ భావన నిండింద‌ని చెప్పారు. సీతారామరాజు మన్యం వీరుడిగా దేశం కోసం చిన్న వయసులో బలిదానం చేశారని మోదీ అన్నారు.

PM Modi : ఒకే హెలికాప్టర్ లో గన్నవరం నుంచి భీమవరం బయలుదేరిన ప్రధాని మోడీ, సీఎం జగన్, ఏపి గవర్నర్

అల్లూరి రంప ఆందోళనల్లో పాల్గొన్న ఎందరో యువకులు బలిదానం చేశారని, వారంతా మనకు స్ఫూర్తిదాయకమ‌ని చెప్పారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని యువత దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర‌ రాష్ట్రం ఎందరో దేశభక్తులకు పురుడిపోసిందని ఆయ‌న చెప్పారు. పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, కందుకూరి వీరేశలింగం లాంటి ఎందరికో పురుడుపోసిందని అన్నారు. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి గొప్ప పోరాట యోధుడని వ్యాఖ్యానించారు. దేశంకోసం బలిదానాలు చేసి వారు కన్న కలలను మనం సాకారం చేయాలని ఆయ‌న చెప్పారు. గత‌ ఎనిమిదేళ్ళ‌లో రైతులు, మహిళల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఎన్నో కార్యక్రమాలు చేప‌ట్టింద‌ని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల బలిదానాలు, త్యాగాల గురించి ఇంటింటికి తెల‌పాల్సిన‌ బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు.