Sri Lanka crisis: పెట్రోల్, డీజిల్ కొర‌త‌.. శ్రీ‌లంక‌లో ఇప్ప‌టికీ తెరుచుకోని పాఠ‌శాల‌లు

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీ‌లంక‌లో పాఠ‌శాల‌లు కూడా ఇప్ప‌ట్లో తెరుచుకునే అవ‌కాశాలు క‌నిపించ‌ట్లేదు. శ్రీ‌లంక‌లో పాఠ‌శాల‌లు తాత్కాలికంగా మూత‌ప‌డిన విష‌యం తెలిసిందే.

Sri Lanka crisis: పెట్రోల్, డీజిల్ కొర‌త‌.. శ్రీ‌లంక‌లో ఇప్ప‌టికీ తెరుచుకోని పాఠ‌శాల‌లు

Petrol Price

Sri Lanka crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీ‌లంక‌లో పాఠ‌శాల‌లు కూడా ఇప్ప‌ట్లో తెరుచుకునే అవ‌కాశాలు క‌నిపించ‌ట్లేదు. శ్రీ‌లంక‌లో పాఠ‌శాల‌లు తాత్కాలికంగా మూత‌ప‌డిన విష‌యం తెలిసిందే. పెట్రోలు, డీజిల్ కొర‌త కార‌ణంగా ఈ ప‌రిస్థితులు త‌లెత్తాయి. క‌నీసం పాఠ‌శాల‌ల‌కు వెళ్ళ‌డానికి ఉపాధ్యాయుల వాహ‌నాల్లో, చిన్నారులను బ‌డుల వ‌ద్ద దించ‌డానికి వారి త‌ల్లిదండ్రుల వాహ‌నాల్లో పెట్రోలు, డీజిల్ ఉండ‌డం లేదు. అప్పుల‌ను ఎగ్గొట్టిన శ్రీ‌లంక‌కు మ‌ళ్ళీ రుణం కింద ఇంధ‌నం పంపిణీ చేయ‌డానికి ఏ దేశ‌మూ ముందుకు రాక‌పోవట్లేదు.

Maharashtra: న‌న్ను సీఎంను చేసి మోదీ, షా అంద‌రి క‌ళ్ళూ తెరిపించారు: ఏక్‌నాథ్ షిండే

శ్రీ‌లంక‌లో ఇంధ‌నం నిల్వ‌లు అతి త‌క్కువ‌గా ఉండ‌డంతో అత్య‌వ‌స‌ర వాహ‌నాల‌కు మాత్రమే దాన్ని వాడుతున్నారు. తాము 40,000 మెట్రిక్ ట‌న్నుల ఇంధ‌నానికి ఆర్డ‌ర్ ఇచ్చామ‌ని, అది శుక్ర‌వారం చేరుకునే అవ‌కాశం ఉంద‌ని శ్రీ‌లంక ప్ర‌భుత్వం తెలిపింది. శుక్ర‌వారం వ‌ర‌కు పాఠ‌శాలలు మూసే ఉంటాయ‌ని అక్క‌డి అధికారులు చెప్పారు. ప్ర‌స్తుతం శ్రీ‌లంక‌లో లీట‌రు పెట్రోలు ధర దాదాపు రూ.470, డీజిల్ ధ‌ర రూ.460గా ఉంది.

Maharashtra: రెండున్న‌రేళ్ళ క్రితం ఫ‌డ్న‌వీస్ చెవిలో ఈ విష‌యం చెప్పాము: అసెంబ్లీలో ఆదిత్య ఠాక్రే

అయిన‌ప్ప‌టికీ, వాహ‌న‌దారుల‌కు పెట్రోల్‌, డీజిల్ దొర‌క‌డం లేదు. ఇంధ‌నాన్ని తీసుకొచ్చే నౌక‌లు బ్యాంకింగ్‌తో పాటు ప‌లు కారణాల వ‌ల్ల ఆల‌స్యంగా వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం పెట్రోల్‌, డీజిల్ ప‌రిమితంగా ఉంది. శ్రీ‌లంక ఎన్న‌డూ ఎదుర్కోనంత సంక్షోభాన్ని ప్ర‌స్తుతం ఎదుర్కొంటోంది. ప్ర‌జ‌ల‌కు ఉపాధి క‌ర‌వు అవుతుండ‌డంతో అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు.