China: మరోసారి అలా జరగొద్దు.. పాక్‌ను హెచ్చరించిన చైనా

కరాచీ యూనివర్శిటీలో మంగళవారం ఓ మహిళ తనను తాను పేల్చుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు చైనీయులతో సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో ఆరుగురు...

China: మరోసారి అలా జరగొద్దు.. పాక్‌ను హెచ్చరించిన చైనా

China

China: కరాచీ యూనివర్శిటీలో మంగళవారం ఓ మహిళ తనను తాను పేల్చుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు చైనీయులతో సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ దాడి తమ పనేనని నిషేధిత బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. యూనివర్శిటీలో స్థానిక విద్యార్థులకు చైనీస్ భాషను బోధించే కన్ఫూసియస్ ఇనిస్టిట్యూట్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులను చైనాకు చెందిన బోధన సిబ్బంది హువాంగ్‌ గ్విపింగ్‌, డింగ్‌ ముపెంగ్‌, చెన్‌సా, పాక్‌ జాతీయుడైన వ్యాను డ్రైవరు ఖలీద్‌గా అధికారులు గుర్తించారు. ఖలీద్‌ వారిని వసతి గృహం నుంచి ఇన్‌స్టిట్యూట్‌ వద్దకు వ్యానులో తీసుకురాగానే, అక్కడ గుర్కాలో మాటువేసి ఉన్న మహిళ తనను తాను పేల్చుకుందని అధికారులు తెలిపారు.

Pakistan: పాక్ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడి.. నలుగురు మృతి

ఈ ఘటనపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్థాన్‌లో చైనీయుల రక్షణకోసం మీరేం చర్యలు తీసుకుంటున్నారంటూ మండిపడింది. మరోసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవద్దని చైనా పాక్‌కు స్పష్టం చేసింది. పాక్‌లోని చైనా ప్రాజెక్టులు, అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని రక్షించడానికి, ఉగ్రవాదం సమస్యకు మూల కారణం పరిష్కరించడానికి ప్రయత్నాలను పెంచాలని బీజింగ్ ఇస్లామాబాద్‌ను డిమాండ్ చేసింది. పాకిస్తాన్‌లోని చైనీస్ సంస్థలు, ప్రాజెక్టులు, సిబ్బంది భద్రతను కాపాడేందుకు పాకిస్తానీ వైపు నుంచి మరిన్ని ప్రయత్నాలు చేయాలని చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక పేర్కొంది. చైనీయులను దెబ్బతీయడానికి ప్రయత్నించే వారు తమను తాము నాశనం చేసుకుంటారని ఆ సంస్థలకు పాక్ అర్థమయ్యేలా చేయాలంటూ గ్లోబల్ టైమ్స్ తన సంపాదకీయంలో పేర్కొంది.

Pakistan pm letar : మోదీ లేఖకు స్పందించిన పాక్ ప్రధాని.. కాశ్మీర్ అంశంపై ఏమన్నారంటే?

ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నబలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) చైనా కంపెనీలు, పాకిస్థాన్‌లోని పౌరులపై దాడులు చేస్తామని పదేపదే బెదిరిస్తోందని, బీఎల్‌ఏ 2018లో కరాచీలోని చైనీస్ కాన్సులేట్‌పై దాడి చేసిందని, 2021 ఆగస్టులో గ్వాదర్ పోర్ట్ సమీపంలో ఆత్మాహుతి దాడి చేసిన ఘటనలో ఒక చైనా జాతీయుడిని గాయపడ్డాడని, చైనీస్ పౌరులపై జరిగిన అనేక తీవ్రమైన ఉగ్రవాద దాడులు ఈ గ్రూపుతో ముడిపడి ఉన్నాయని చెప్పవచ్చని చైనాకు చెందిన ఆంగ్ల భాషా వార్తాపత్రిక తన సంపాదకీయంలో పేర్కొంది. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు గల దినపత్రిక కథనం ప్రకారం.. పాకిస్తాన్ చైనా జాతీయుల రక్షణను పటిష్టం చేసిందని, కానీ సమస్య యొక్క మూల కారణాలను పరిష్కరించడంలో విఫలమైందని పేర్కొంది.