China : రంగు మారిన ఆకాశం-వణికిపోయిన చైనా ప్రజలు

కరోనా పుట్టిల్లైన  చైనాలోఈ రోజు సాయంత్రం జరిగిన ఘటనతో అంతా ఒక్కసారిగా భయబ్రాంతులకు లోనయ్యారు.

China : రంగు మారిన ఆకాశం-వణికిపోయిన చైనా ప్రజలు

China

Updated On : May 9, 2022 / 8:49 PM IST

China Sky  :  కరోనా పుట్టిల్లైన  చైనాలోఈ రోజు సాయంత్రం జరిగిన ఘటనతో అంతా ఒక్కసారిగా భయబ్రాంతులకు లోనయ్యారు. షాంఘైలోని ఓడరేవు నగరం జౌషాన్ లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం ఎరుపు రంగులోకి మారిపోయింది. దీంతో ప్రజలంతా ఆశ్చర్యంతో ఆందోళనకు గురయ్యారు.

ఆకాశం ఎరుపురంగులోకి మారటంతో ఇళ్లలోంచి ప్రజలు బయటకు వచ్చి సెల్ ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు. ఆ ఎరుపు రంగుచూసి భయాందోళనలకు గురయ్యారు. ఈ వీడియో పై కొందరు చైనీయులు స్పందిస్తూ…. ఆకాశం ఇలాంటి ఎరుపు రంగులోకి మారటం అపశకునమని చెప్పారు.

ఇంతకు ముందెన్నడూనేను ఇలాంటివి చూడలేదని ఆకాశం ఎరుపుగా మారటం నన్ను ఆశ్చర్య పరుస్తోందని మరో నెటిజన్ కామెంట్ చేశారు. చైనా ఆక్వాటిక్ ప్రొడక్ట్స్ జౌషాన్ మెరైన్ ఫిషరీస్ కోను ఉటంకిస్తూ స్దానిక మీడియా… ఫిషింగ్ బోట్ నుండి లైటింగ్ వచ్చి ఉండవచ్చని తెలిపింది.

ఊహాన్ లోని చైనా యూనివర్శిటీ ఆఫ్ జియోసైన్సెస్ యొక్క అంతరిక్ష భౌతిక పరిశోధన బృందంలోని సభ్యుడు ఒకరు…సౌర, భూ అయస్కాంత కార్యకలాపాల ఫలితంగా ఇలా వచ్చి ఉండవచ్చని తెలిపారు.