iPhone 12తో ఛార్జర్‌ ఇవ్వలేదని.. ఆపిల్‌పై చైనా విద్యార్థుల దావా..!

ఆపిల్ రిలీజ్ చేసిన ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లతో పాటు ఛార్జర్ ఇవ్వడం లేదని చైనా విద్యార్థుల బృందం దావా వేసింది. చైనీస్ యూనివర్శిటీ ఐదుగురు విద్యార్థుల బృందం కొనుగోలు చేసింది.

iPhone 12తో ఛార్జర్‌ ఇవ్వలేదని.. ఆపిల్‌పై చైనా విద్యార్థుల దావా..!

Chinese Students Sue Apple For Not Including Charger With Iphone 12

Updated On : October 28, 2021 / 9:41 PM IST

Chinese students : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ రిలీజ్ చేసిన ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లతో పాటు ఛార్జర్ ఇవ్వడం లేదని చైనా విద్యార్థుల బృందం దావా వేసింది. చైనీస్ యూనివర్శిటీకి చెందిన ఐదుగురు విద్యార్థుల బృందం ఇటీవల ఆపిల్ ఐఫోన్ 12 కొనుగోలు చేసింది. అయితే ఆ ఫోన్ బాక్సుతోపాటు ఆపిల్ ఛార్జర్ ఇవ్వలేదు. దాంతో చైనా విద్యార్థుల బృందం ఆపిల్ పై దావా వేసింది. ఆపిల్ 2020లో ఐఫోన్‌, ఇయర్‌పాడ్‌లు, వాల్ ఛార్జర్‌లను బాక్సు ప్యాకేజీలో ఇవ్వడం ఆపివేసింది. ప్యాకేజింగ్‌లో USB-C లైటర్ కేబుల్‌ను మాత్రమే అందిస్తోంది. కార్బన్ ఉద్గారాలను విలువైన పదార్థాల వినియోగాన్ని తగ్గించడంలో భాగంగానే ఈ మార్పులు చేసింది ఆపిల్.

అందులోనూ పర్యావరణపరంగా అనుకూలమైనదిగా ఉంటుందని Apple ఒక ప్రకటనలో పేర్కొంది. ఇటీవల.. చైనాకు చెందిన విద్యార్థి iPhone 12 Pro Max కొనుగోలు చేశాడు. అయితే బాక్సు ప్యాకేజింగ్‌లో వాల్ ఛార్జర్‌ లేదు. ఛార్జర్ ఇవ్వకుండా ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు 100 యువాన్లు చెల్లించాలని, చట్టపరమైన రుసుములను కూడా చెల్లించాలని విద్యార్థులందరూ ఆపిల్‌ను డిమాండ్ చేశారు. ఐఫోన్ 12 బాక్స్‌లో USB-C టు లైటనింగ్ కేబుల్ మార్కెట్‌లోని ఇతర ఛార్జర్‌లకు అనుకూలంగా లేదని విద్యార్థుల్లో ఒకరు బీజింగ్ ఇంటర్నెట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. షాంఘై లా జర్నల్ ఈ కేసును విచారించింది.
iPhone 13 Pro Hack : ఆపిల్‌కు చెమటలు పట్టించిన చైనా హ్యాకర్లు.. సెకన్‌లో ఐఫోన్‌ 13ప్రో హ్యాక్!

దీని ప్రకారం.. జియాచెంగ్ అనే విద్యార్థి తన ఐఫోన్ 12pro మాక్స్ కొనుగోలు చేశాడు. అయితే ఆ ఐఫోన్‌తో పాటు ఛార్జర్‌ రాకపోవడం అతన్ని నిరాశకు గురిచేసింది. MagSafe ఛార్జర్‌లను ప్రోత్సహించడంలో భాగంగా Apple వాల్ ఛార్జర్‌లను నిలిపివేసిందని Xiaofang పేర్కొంది. ఆపిల్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. కంపెనీలు ఛార్జర్ లేకుండా ఫోన్‌లను విక్రయించడం సర్వసాధారణమని, ఐఫోన్ 12 ప్యాకేజింగ్‌లో ఛార్జర్‌ను చేర్చలేదని అన్నారు. ఆపిల్ గత ఏడాది అక్టోబర్‌లో ఐఫోన్ 12 సిరీస్‌ను లాంచ్ చేసింది.

పవర్ అడాప్టర్, హెడ్‌ఫోన్‌లు లేకుండా ఛార్జింగ్ కేబుల్ మాత్రమే బాక్సులో అందించనున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయంతో పర్యావరణ ప్రభావం 2 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్‌ను తగ్గించగలదని పేర్కొంది. ఒక ఏడాదిలో 450,000 కార్లను తొలగించడానికి సమానంగా ఆపిల్ పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో, బ్రెజిలియన్ యూజర్లు వాచ్‌డాగ్, ప్రోకాన్-ఎస్‌పి, కొత్తగా మార్కెట్లోకి వచ్చిన iPhone 12 సిరీస్‌లో ఛార్జర్‌ను ఇవ్వనందుకు ఆపిల్‌కు 2 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఛార్జర్ లేకుండా ఐఫోన్ విక్రయించిందని ఆరోపించింది.
Apple Watch Series 7 : ఆపిల్‌ వాచ్‌ సేల్స్‌.. భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లు.. ఫీచర్లు కిరాక్!