CIA DEATH : CIAను అడ్డుపెట్టుకుని అమెరికా అరాచకాలు..ప్రపంచ ప్రముఖుల హత్యల వెనుక ‘పెద్దన్న పాత్ర’..

భారత శాస్త్రవేత్త హోమీ భాభా నుంచి.. ఫిడెల్‌ కాస్ట్రో వరకు... భారత మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి నుంచి వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే వరకు.. CIA చేసిన కుట్రలకు లెక్కే లేదు.. CIAను అడ్డుపెట్టుకొని అమెరికా డెడ్లీ గేమ్..

CIA DEATH : CIAను అడ్డుపెట్టుకుని అమెరికా అరాచకాలు..ప్రపంచ ప్రముఖుల హత్యల వెనుక ‘పెద్దన్న పాత్ర’..

Did The Cia Kill Lal Bahadur Shastri And And Homi Bhabha (2)

Did the CIA kill Lal Bahadur Shastri and and Homi Bhabha : CIAను అడ్డుపెట్టుకుని అమెరికా చేసే అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. తమకు అడ్డం అనుకున్న వారికి.. తమ హోదాకు అడ్డు తగులుతారు అనుకునేవాళ్లను.. కుట్ర చేసి మరీ ప్రాణాలు తీస్తుంటుంది CIA. అందులో కొందరు క్షేమంగా బయటపడితే.. మరికొందరు చరిత్రలో పేజీగా మిగిలిపోయారు. అలా CIA కుట్రకు బలయింది ఎవరు.. ఎలా ప్లాన్ చేసి వారిని హత్య చేశారు ?

హోమీ భాభా నుంచి.. ఫిడెల్‌ కాస్ట్రో వరకు… భారత మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి నుంచి అసాంజే వరకు.. CIA చేసిన కుట్రలకు లెక్కే లేదు.. CIAను అడ్డుపెట్టుకొని యూఎస్ డెడ్లీ గేమ్ ఆడుతోందా ? అంటే నిజమనే తెలుస్తోంది. తమ మాట పట్టించుకోని వారు.. తమ స్థానానికి ఎసరు తెస్తారు అని అనుకున్న వాళ్లను.. CIAను అడ్డుపెట్టుకొని హతం చేయడం అమెరికాకు మొదటి నుంచి ఉన్న అలవాటు. హోమీ భాభా నుంచి ఇప్పుడు రష్యా, యుక్రెయిన్ యుద్ధంలో CIA అమలు చేస్తున్న విధానాల వరకు.. అమెరికా బుద్ది ఏంటో.. ఎలాంటి కుట్రలు చేస్తున్నాయో ప్రపంచానికి అర్థం అవుతూనే ఉంది. రష్యాతో సన్నిహితంగా ఉండడం.. అణ్వాస్త్ర ప్రయోగాలకు భారత్ వేగంగా అడుగులు వేయడం.. అమెరికా జీర్ణించుకోలేకపోయింది. ఫాదర్ ఆఫ్‌ ఆటమిక్‌ ఎనర్జీ అని పిలిచే హోమీ భాభాను.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అండగా ఉంటామని మద్దతు తెలిపిన లాల్‌ బహదూర్ శాస్త్రిని కుట్ర చేసి చంపేసింది CIA. ఆధారాలు చూపించలేకపోవచ్చు.. వీటి వెనక CIA ఉందే ఆధారం మాత్రం రాబర్ట్ క్రాలీ మాటలతో అర్థం అయింది.

Also read : CIA DEATH: భారత శాస్త్రవేత్త హోమీ భాభా,మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి మరణాల వెనుక అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ పాత్ర..!

ఈ ఇద్దరిని మాత్రమే కాదు.. అలుపెరుగని పోరాటంతో అగ్రరాజ్యం కుయుక్తులను ఎదుర్కొని.. క్యూబాను స్వతంత్ర్య దేశంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన ఫిడేల్ కాస్ట్రోను హతమార్చడానికి CIA చేయని ప్రయత్నం లేదు. 1959 నుంచి 1976 వరకు క్యూబా ప్రధానిగా.. 1976 నుంచి 2008 వరకు క్యూబా అధ్యక్షుడిగా.. కాస్ట్రో చేపట్టిన సంస్కరణలు క్యూబాను స్వతంత్ర శక్తిగా నిలబెట్టాయ్. అంతేకాదు.. అమెరికాను ఎదిరించి .. పక్కలో బల్లెంలా మారడంతో క్యాస్ట్రోను అడ్డుతొలిగించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది CIA. ఆయన తాగే పొగాకు చుట్టల్లో బాంబులు పెట్టడంతో పాటు, విషకన్యలను పంపించడం వరకూ ఎన్నో కుట్రలు చేసింది. పక్కాగా చెప్పాలంటే.. 638 సార్లు ఆయనపై అమెరికా హత్యాయత్నానికి ప్రయత్నించింది. CIAను అడ్డుపెట్టుకొని అమెరికా చేసిన ప్రతీ కుట్రను కాస్ట్రో సమర్థంగా ఎదుర్కొన్నారు. ప్రాణాలతో బయటపడ్డారు.

క్యూబా జనాల్లో కాస్ట్రో ఆదరణ పొందడానికి… ఆయన గడ్డం కూడా ఓ కారణమేనని CIA బలంగా నమ్మేది. ఆయన గడ్డాన్ని తొలగించడానికి అమెరికా చేసిన విఫల ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. థాలియం లవణంతో కూడిన ఓ పౌడర్‌ను కాస్త్రోపై ప్రయోగించింది. ఈ కెమికల్‌ ఎఫెక్ట్ అయితే. మనిషి తన శరీరంపై ఉన్న వెంట్రుకలను పూర్తిగా కోల్పోయి వికృతంగా తయారవుతాడు. 1975లో సెనేట్ ఇంటిలిజెన్స్ కమిటీ రిపోర్టు ఈ విషయం బయటపెట్టింది. ఐతే ఆ ప్రమాదం నుంచి కాస్త్రో తప్పించుకున్నారు. ఇక కాస్ట్రో మాజీ భార్య మారిటా లారెంజ్‌ ద్వారా కూడా.. ఆయనను చంపేందుకు CIA ప్రయత్నాలు చేసింది. విషపు మందుబిళ్లలతో చంపేయాలని లారెంజ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటికే విషయాన్ని పసిగట్టిన కాస్ట్రో.. ఆమెపై గన్ను ఎక్కుపెట్టి నిలదీశారు. దీంతో నిజం బయట పడింది.

Also read : RGV : ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కరోనా చావులు అంటూ.. ఆర్జీవీ నెక్స్ట్ మూవీ ‘కొవిడ్ ఫైల్స్’..

పెన్నులాంటి ఇంజక్షన్‌తో కాస్ట్రో శరీరంలోకి విష ప్రయోగం చేసింది CIA. దాన్నుంచి కూడా ఆయన బయటపడ్డారు. సిగరెట్ బాంబును కూడా ప్రయోగించింది. ఫిడెల్ కాస్ట్రో చాలా ఇష్టపడే స్కూబా డైవ్ సూట్‌లోనూ… పేలుడు పదార్థాలతో, అత్యంత ప్రమాదకర ఫంగస్ బ్యాక్టీరియాతో ఆయనను చంపేందుకు CIA ప్రయత్నించింది. ఫిడెల్ ప్రసంగించే రేడియో స్టేషన్‌ను కూడా పేల్చేందుకు ప్రయత్నించింది CIA. హ్యాండ్ కర్చీఫ్‌లో ప్రమాదకర బ్యాక్టీరియాను నింపి ఓసారి.. పాలల్లో విషం కలిపి మరోసారి కాస్త్రోను చంపేందుకు ప్రయత్నించింది. ఇలా దాదాపు ఆరు వందలసార్లు తనపై హత్యాయత్నం జరగగా.. CIA కుట్రల నుంచి కాస్ట్రో ప్రతీసారి తప్పించుకున్నారు.

వెనిజులా మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ మీద కూడా CIA కుట్ర చేసిందన్న అనుమానాలు ఉన్నాయ్. 2013లో చావెజ్‌కు కేన్సర్‌ నిర్ధారణ అయింది. అయితే ఆ సమయంలోనే బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రూసెఫ్, పరాగ్వే అధినేత ఫెర్నాండో లుగో, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు లూయిజ్ ఇనాషియో లులా దసిల్వా, అర్జెంటీనా అధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్ డి కిర్చ్‌నర్‌లకు కేన్సర్ సోకింది. కొద్దిరోజుల వ్యవధిలోనే లాటిన్ అమెరికన్ దేశాల నేతలందరికీ కేన్సర్ సోకడం వెనక.. CIA కుట్ర ఉందన్న చర్చ నడిచింది. లాటిన్ అమెరికా దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి.. CIA ద్వారా అమెరికా డెడ్లీ గేమ్ ఆడిందన్న విమర్శలు ఉన్నాయ్.

చరిత్రలో మాత్రమే కాదు.. వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు అసాంజే హత్యకు కూడా ట్రంప్‌ హయాంలో కుట్ర జరిగింది. సీఐఏ డైరెక్టర్‌ మైక్‌ పాంపియా నేతృత్యంలో అసాంజేను కిడ్నాప్‌, లేదా హత్య చేసేందుకు గల అవకాశాలను పరిశీలించినట్లు బయటకొచ్చిన వార్తలు.. కలకలం రేపాయ్. ఇక అటు ఉత్తరకొరియా అధ్యక్షుడు అకస్మాత్తుగా కనిపించకుండా పోతే ఎలా అని ఓ సమయంలో CIA అధ్యక్షులు వ్యాఖ్యలు చేయడం.. వారి టార్గెట్ ఏంటో చెప్పకనే చెప్పింది. వీటితోపాటు రష్యా యుద్ధంలో.. యుక్రెయిన్‌కు మద్దతుగా నిలిచిన అమెరికా.. తమ దేశ ఇంటెలిజెన్స్ ద్వారా.. రష్యా ఆర్మీలో కీలక నేతలను మట్టుబెట్టిందన్న ఆరోపణలు ఉన్నాయ్. ఇలా పేరుకు మాత్రమే అమెరికా అగ్రరాజ్యం.. ఆ హోదాను నిలబెట్టుకునేందుకు ఎన్ని దగుల్బాజీ పనులు చేయాలో.. CIA ద్వారా అన్నీ చేస్తోందన్న విమర్శలున్నాయి. కానీ.. నిలదీసి అడిగేవాళ్లే లేరు.. అంతర్జాతీయ న్యాయస్థానంలో దోషిగా పెట్టేందుకు సాక్ష్యాలూ దొరకవు.. అందుకే.. CIA ఆటలు ఇంకా చెల్లుతున్నాయి. కానీ.. దానికీ సంజాయిషీ చెప్పుకోవాల్సిన ఓ రోజు తప్పక వస్తుంది.