CIA DEATH: భారత శాస్త్రవేత్త హోమీ భాభా,మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి మరణాల వెనుక అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ పాత్ర..!

భారత శాస్త్రవేత్త హోమీ భాభా, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి మరణాల వెనక అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ పాత్ర ఉందని నిర్ధారణ అయింది.

CIA DEATH: భారత శాస్త్రవేత్త హోమీ భాభా,మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి మరణాల వెనుక అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ పాత్ర..!

Did The Cia Kill Lal Bahadur Shastri And And Homi Bhabha

Did the CIA kill Lal Bahadur Shastri and and Homi Bhabha : భారత శాస్త్రవేత్త హోమీ భాభా, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి మరణాల వెనక అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ పాత్ర ఉందనే అనుమానాలు ఎప్పటినుంచో ఉన్నాయ్. ఐతే అది అనుమానం కాదు.. నిజం అని ఇప్పుడు నిర్ధారణ అయింది. ఆ ఇద్దరి మరణాల సమయంలో CIA ఆపరేషన్స్‌ బాధ్యతలు చూసిన రాబర్ట్ క్రాలీ చెప్పిన మాటలు.. అమెరికా బుద్దిని నగ్నంగా బయటపెట్టింది. ఇంతకీ ఆయన ఏం చెప్పారు.. ఆ ఇద్దరిని చంపాల్సిన అవసరం అమెరికాకు ఏమొచ్చింది.. అగ్రరాజ్యాన్ని హోమీ భాభా ఎలా భయపెట్టారు ?

ఈ మాటలే ఆయనను పొట్టనపెట్టుకున్నాయా.. ఈ మాటలే అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేశాయా.. అందుకే కుట్ర పన్ని చంపే స్థాయికి దిగజార్చాయా అంటే.. అదే నిజం అని నిరూపితం అయింది. నిజాన్ని ఈరోజు దాచిపెట్టొచ్చు.. చరిత్ర దాటుకొని ఆ నిజం విస్పోటనంలా పేలే రోజులు కచ్చితంగా వస్తాయ్. లాల్‌ బహదూర్‌ శాస్త్రి, హోమీ బాబా మరణాల విషయంలో ఇదే ప్రూవ్ అయింది. ఇన్నాళ్లు అనుమానాస్పద మృతిగా చరిత్రలో నిలిచిపోయిన భారత మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రిది… హత్య అని నిర్ధారణ అయింది. భారత అణుశాస్త్ర పితామహుడు హోమి జహంగీర్‌ భాభా కూడా విమానప్రమాదంలో మరణించలేదని…. అది కూడా భారీ కుట్రతో చేసిన హత్య అని తేలిపోయింది. అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ CIA… ఈ రెండు హత్యల వెనక ఉందనే అనుమానాలు తేలిపోయాయ్. అదే నిజం అని తేలింది. అమెరికా అసలు బుద్ధి నగ్నంగా బయటపడింది.

లాల్‌ బహదూర్‌ శాస్త్రి, హోమీ భాభా మరణాలకు కేవలం 13 రోజుల వ్యవధి మాత్రమే తేడా ! 1966 జనవరి 11న లాల్‌ బహదూర్‌ శాస్త్రి గుండెపోటుతో చనిపోతే.. ఆ తర్వాత 13 రోజులకు హోమీ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. భారత్ అణు ప్రయోగాలకు సిద్ధమవుతోన్న సమయంలో.. ఈ ఇద్దరి మృతిపై అప్పుడు మొదలైన అనుమానాలు.. నిన్న మొన్నటి వరకు కంటిన్యూ అయ్యాయ్. ఐతే ఇప్పుడు రాబర్ట్‌ క్రాలీ వ్యాఖ్యలతో.. అవి హత్యలే అని నిర్ధారణ అయింది. లాల్‌ బహదూర్‌ శాస్త్రి, హోమీ బాబా మరణాలు జరిగినప్పుడు.. CIA ఆపరేషన్స్‌ బాధ్యతలు నిర్వహించిన రాబర్ట్‌ క్రాలీ.. స్వయంగా కీలక విషయాలు బయటపెట్టారు. తన పుస్తకంలో సంచలన విషయాలను వెల్లడించారు. అమెరికాకు చెందిన ప్రముఖ రచయిత గ్రెగొరీ డగ్లస్‌ కూడా… తన కన్వర్జేషన్‌ విత్‌ ది క్రౌ పుస్తకంలో ఈ విషయాలను వివరించారు.

Also read : CIA DEATH : CIAను అడ్డుపెట్టుకుని అమెరికా అరాచకాలు..ప్రపంచ ప్రముఖుల హత్యల వెనుక ‘పెద్దన్న పాత్ర’..

ఆవులను ప్రేమించే భారతీయులు ఎంతో తెలివైనవారని.. ప్రపంచంలో వారు గొప్ప శక్తిగా ఎదగబోతున్నారని.. భారతీయులు స్వయం సమృద్ధి సాధించడాన్ని తాము కోరుకోలేదని.. అని రాబర్ట్‌ క్రాలీ తన పుస్తకంలో రాసుకొచ్చారు. అణ్వాయుధ కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్లడంలో శాస్త్రి, భాభా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమయంలో.. రష్యాతో భారత్‌ సన్నిహితంగా ఉంటుండడంతో.. ఆ చర్యలు అమెరికాకు ఎప్పటికైనా ముప్పేనని గ్రహించి.. వారి హత్యకు CIA కుట్ర పన్నిందని క్రాలీ వివరించారు. హోమి భాభాను ఎయిర్‌ ఇండియా విమానంలో వియన్నా వెళ్తుండగా హతమార్చామని చెప్పారు. భారత్‌ను అణ్వాయుధ దేశంగా మార్చే శక్తి భాభాకు ఉందని.. అతను ఎప్పటికైనా దాన్ని సాధిస్తాడని.. అందుకే అతన్ని చంపాలని CIA నిర్ణయించిందని వివరించారు. ఈ ప్రమాదంలో భాభాతోపాటు.. విమానంలో ఉన్న 116మంది చనిపోయారు.

లాల్‌ బహదూర్‌ శాస్త్రి కూడా అణ్వాస్త్ర కార్యక్రమాన్ని చురుగ్గా ముందుకు తీసుకెళ్లారని క్రాలీ తన పుస్తకంలో వివరించారు. 1966 జనవరి 11న పాక్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ అయూబ్‌ ఖాన్‌తో కలిసి ఉజ్బెకిస్థాన్‌ రాజధానిలో తాష్కెంట్‌ ఒప్పందంపై శాస్త్రి సంతకం చేశారు. అదేరోజు అర్ధరాత్రి దాటాక ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం వెనకా సీఐఏ ఉందని క్రాలీ తెలిపారు. భారత అణ్వాయుధ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి CIA ఎన్ని ప్రయత్నాలు చేసినా.. 1974 మే 18న రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో మొదటి అణ్వాస్త్ర ప్రయోగం సక్సెస్ అయింది. CIA గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేసి.. ఆ సంస్థకు చెమటలు పట్టించిన హోమీ భాబా.. చరిత్రలో నిలిచిపోయారు. భారతీయ అణు పరిశోధనా రంగానికి ఓ రూపు తీసుకురావడంలో హోమీ భాభా పాత్ర ఎంతో కీలకం.

1909లో ముంబైలో పుట్టిన హోమీ భాభా.. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆ తర్వాత ఇండియాకు వచ్చి 1945లో టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్ రీసెర్చి సంస్థను స్థాపించారు. 1937లోనే ‘కాస్మిక్ రేడియేషన్‌పై పరిశోధనలు జరిపి మిసాన్ కణాలను కనిపెట్టారు. ఈ పరిశోధనతో భాభాకు వాల్డ్‌వైడ్‌గా గుర్తింపు వచ్చింది. 1948లో ఆటమిక్ కమిషన్‌కు అధ్యక్షునిగా ఎన్నికై.. భారతీయ అణుశక్తి నిర్మాణానికి భాభా రూపు తీసుకువచ్చారు. 1963లో తారాపూర్‌లో భారత్‌ మొదటి అణు రియాక్టర్ నిర్మించడం వెనక.. భాభా కీలక పాత్ర పోషించారు. చలవే. ఆ తర్వాత రెండేళ్లలోనే ప్లూటోనియం ప్లాంట్ నిర్మించి ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేశారు భాభా. ఆయన రూపకల్పన చేసినట్లుగానే.. 1974లో పోఖ్రాన్‌ అణ్వాస్త్ర ప్రయోగం సక్సెస్ అయింది. దీంతో ప్రపంచంలో అణుప్రయోగం చేసిన ఆరో దేశంగా భారత్‌ నిలిచింది.

Also read : Droupadi Murmu: ఆక‌ట్టుకునేలా ద్రౌప‌ది ముర్ము సైకత శిల్పాన్ని రూపొందించిన సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్

అణు రియాక్టర్‌లలో విద్యుత్ ఉత్పత్తికి ఫాస్ట్ బ్రీడర్ టెక్నాలజీని వినియోగిస్తారు. దీనికి రూపకల్పన చేసింది భాభానే ! అణు రియాక్టర్లలను మూడు దశలలో వినియోగించుకునే విధానం రూపొందించింది కూడా ఆయనే ! అణు కార్యక్రమాలకు కావాల్సిన యురేనియమ్.. భారత్‌లో అంతగా లభించదు. ఐతే దానికి ప్రత్యామ్నాయంగా థోరియం అనే ఇంధనాన్ని ఉపయోగించి అణుశక్తి ద్వారా విద్యుత్పత్తి చేసే కార్యక్రమానికి బాబా రూపకల్పన చేశారు. ఇలాంటి ప్రయోగాలతో దూసుకెళ్తున్న భాభా నుంచి ఎప్పటికైనా ప్రమాదం ఉంటుందని CIA పసిగట్టింది. అందుకే చంపేయాలని కుట్ర పన్నింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలోకి పేలుడు పదార్థాలు పంపించి.. నిర్దేశించిన ప్రాంతంలో కూలిపోయేలా చేసింది. భాబా చనిపోయే సమయానికి ఆయన వయసు 56 ఏళ్లు మాత్రమే ! ఇంకో 20 ఏళ్ల ఆయన బతికి ఉంటే.. అమెరికాకు చుక్కలు చూపించేవారు అన్నది చాలా మంది అభిప్రాయం.

ఈ ఇద్దరు ప్రముఖులను హత్య చేయడమే కాదు.. CIA చేయాలనుకున్న, చేసిన దగుల్బాజీ పనులు అన్నీ ఇన్నీ కావు. ఆసియాలో వరి సాగు అనేదే లేకుండా చేసేందుకు కూడా CIA కుట్ర చేసింది. దీనికోసం ఓ వ్యాధిని కూడా అభివృద్ధి చేసింది. ఐతే దాన్ని మాత్రం అమలు చేయలేకపోయింది. ఇలా రాబర్ట్ క్రాలీ బయటపెట్టిన విషయాలు.. అమెరికా దొంగబుద్ది ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసేలా చేస్తోంది.. ఈ ఇద్దరి మరణాలు మాత్రమే కాదు.. చరిత్ర పేజీలు తిరిగి వచ్చి చూస్తే.. CIAను అడ్డుపెట్టుకొని అమెరికా చేసిన దొంగపనులు అన్నీ ఇన్నీ కావు. శాస్త్రి, భాభా విషయంలో అమెరికా ఇప్పుడు ఏదైనా చెప్పొచ్చు.. ఐతే క్రాలీ చెప్పిన మాటలు మాత్రం అబద్దం అని కొట్టి పారేయడానికి అసలు లేదు.