China : రోజూ 6 గంటలు టాయిలెట్‌లో గడిపిన ఉద్యోగి.. జాబ్ నుంచి తొలగించిన కంపెనీ..

చైనాలో ఓ వ్యక్తి ఎక్కువ సమయం రెస్ట్ రూంలో గడపడంతో ఉద్యోగం కోల్పోయాడు. అదేదో పని నుంచి తప్పించుకునేందుకు అనుకునేరు. కానే కాదు.. కారణం ఏంటో చదవండి.

China : రోజూ 6 గంటలు టాయిలెట్‌లో గడిపిన ఉద్యోగి.. జాబ్ నుంచి తొలగించిన కంపెనీ..

China

Viral News : చైనాలో ఓ ఉద్యోగి విచిత్రమైన పరిస్థితుల్లో ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడు. సాధారణంగా ఆలస్యంగా ఆఫీస్ కి రావడం.. ముందుగా వెళ్లిపోవడం.. పని సరిగా చేయకపోవడం వంటి కారణాలతో కంపెనీలు జాబ్ నుంచి తొలగించాయంటే అర్ధం ఉంది. మిస్టర్ వాంగ్ అనే వ్యక్తి షిఫ్ట్  టైంలో 6 గంటలుపాటు టాయిలెట్‌లోనే ఉండేవాడని ఉద్యోగం నుంచి తీసేసారు.

Viral Video: బిల్లు వసూలు చేసేందుకు వచ్చిన విద్యుత్ శాఖ ఉద్యోగిని చెప్పుతో కొట్టిన వ్యక్తి

చైనాకి చెందిన వాంగ్ అనే వ్యక్తి కంపెనీ పనివేళల్లో 6 గంటల పాటు రెస్ట్ రూంలోనే గడపడంతో అతనిని కంపెనీ జాబ్ నుంచి తొలగించింది. వాంగ్ 2006 లో కంపెనీలో చేరాడు. 2014 లో అతనికి అనారోగ్య సమస్యల కారణంగా చికిత్స చేయించుకున్నాడు. ఈ సమస్య కారణంగా అతను ఎక్కువ సమయం బాత్రూంలో ఉండాల్సిన పరిస్థితికి దారి తీసిందట.

 

అతని ఆపరేషన్ సక్సెస్ అయినా దాని తాలుకూ సమస్యలతో రోజులో మూడు నుంచి ఆరు గంటలు రెస్ట్ రూంలోనే గడపవలసి వచ్చిందట. ఇక కొంతకాలం అతనిని గమనించిన కంపెనీ యాజమాన్యం  విధుల నుంచి తొలగించింది. దాంతో వాంగ్ తన అనారోగ్యం కారణంగా ఇలా జరిగిందని తన జాబ్ తనకు తిరిగి ఇప్పించాల్సిందిగా కోర్టుల చుట్టూ తిరిగాడు. అయితే కోర్టు కూడా అతనిని అభ్యర్థనను కొట్టివేసింది.

 

Viral Video : బాబోయ్.. ప్రభుత్వ ఉద్యోగిని రోడ్డుపై పరిగెత్తించిన వ్యాపారి, వేడి వేడి చట్నీతో దాడి.. వీడియో వైరల్

ఇక వాంగ్ గురించి చైనా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలామంది  కంపెనీ యజమానులను సపోర్ట్ చేశారు. పనిచేసే టైంలో అన్ని గంటలు టాయిలెట్‌లో ఉంటే ఏ యజమాని అంగీకరిస్తారంటూ జనం కంపెనీకే మద్దతు పలికారు. అనారోగ్యం ఉంటే సానుభూతి ఉంటుంది కానీ.. దానిని సాకుగా చూపించకూడదని.. ఈ కేసులో వాంగ్ గెలిస్తే ఇక ఉద్యోగులతో విశ్రాంతి గదులు నిండిపోతాయని సోషల్ మీడియాలో జనం అభిప్రాయపడ్డారు.