Viral Video : బాబోయ్.. ప్రభుత్వ ఉద్యోగిని రోడ్డుపై పరిగెత్తించిన వ్యాపారి, వేడి వేడి చట్నీతో దాడి.. వీడియో వైరల్

Street Vendor Attacks : రోడ్డుపై వ్యాపారం చేస్తున్న స్ట్రీట్ వెండర్స్ ని ఖాళీ చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఓ సమోసా విక్రయదారుడి బండి బోల్తా పడింది. దాంతో అతడు కోపంతో ఊగిపోయాడు.

Viral Video : బాబోయ్.. ప్రభుత్వ ఉద్యోగిని రోడ్డుపై పరిగెత్తించిన వ్యాపారి, వేడి వేడి చట్నీతో దాడి.. వీడియో వైరల్

Street Vendor Attacks(Photo : Google)

Street Vendor Attacks : ఉత్తరప్రదేశ్ నోయిడాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై ఓ వీధి వ్యాపారి దాడి చేశాడు. ఉద్యోగిని రోడ్డుపై పరిగెత్తించిన వ్యాపారి.. వేడి వేడి చట్నీతో దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నోయిడా అథారిటీకి చెందిన ఉద్యోగులు రోడ్డుపై ఆక్రమణలు తొలగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై వ్యాపారం చేస్తున్న స్ట్రీట్ వెండర్స్ ని ఖాళీ చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఓ సమోసా విక్రయదారుడి బండి బోల్తా పడింది. దాంతో అతడు కోపంతో ఊగిపోయాడు. సదరు ఉద్యోగితో గొడవకు దిగాడు. నా బండినే పడేస్తావా అంటూ ఆగ్రహంతో రగిలిపోయాడు.

Also Read..Viral Video : మహిళలూ.. బైక్ నడిపేటప్పుడు జాగ్రత్త.. రెప్పపాటులో ఎంత ఘోరం జరిగిందో చూడండి..

అంతే.. తన దగ్గరున్న వేడి వేడి చట్నీ గిన్నెను చేతిలోకి తీసుకున్నాడు. దాంతో ఆ ఉద్యోగిపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఉద్యోగి భయంతో రోడ్డుపై పరుగు తీశాడు. అయినా ఆ వ్యాపారి అతడిని వదల్లేదు. ఉద్యోగి వెనకాలే పరిగెత్తాడు. వేడి వేడి చట్నీని అతడిపై చల్లాడు. చట్నీ మొత్తం ఉద్యోగి వీపుపై పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఘటనపై స్థానికులు నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరు వ్యాపారి బండిని తోసేయడం కరెక్ట్ కాదంటున్నారు. ఉద్యోగులు అతడితో అలా చేసి ఉండకూడదన్నారు. బండిని కిందపడేసి అతడి పొట్ట కొట్టారని వాపోయారు. మరోవైపు చిరు వ్యాపారి చేసిన పని కరెక్ట్ కాదని మరికొందరు అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగిపై దాడి సమంజసం కాదన్నారు. రోడ్డుపై వ్యాపారం చేయకూడదని నిబంధనలు ఉన్నాయనే విషయం వాళ్లకి తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు.

Also Read.. Viral Video : ఘోర ప్రమాదం.. బస్సులోంచి జారిపడ్డ యువతి, అక్కడికక్కడే మృతి