‘Cooper’ Dinosaur : ఆస్ట్రేలియాలో బైటపడ్డ భారీ డైనోసార్ అవశేషాలు..

డైనోసార్స్. వీటినే రాకాసి బల్లలు అని కూడా అంటారు. కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన రాకాసి బల్లుల అవశేషాలు పరిశోధకుల తవ్వకాల్లో బయటపడుతుంటుంటాయి. అలా మరో డైనోసార్ అవశేషాలు ఆస్ట్రేలియాలో బయటపడింది.

‘Cooper’ Dinosaur : ఆస్ట్రేలియాలో బైటపడ్డ భారీ డైనోసార్ అవశేషాలు..

'cooper' Dinosaur

‘Cooper’ Dinosaur in Australia : డైనోసార్స్. వీటినే రాకాసి బల్లలు అని కూడా అంటారు. కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన రాకాసి బల్లుల అవశేషాలు పరిశోధకుల తవ్వకాల్లో బయటపడుతుంటుంటాయి. అలా మరో డైనోసార్ అవవేషాలు ఆస్ట్రేలియాలో బయటపడింది. అసలే డైనోసార్లు భారీ ఆకారంలో ఉంటాయనే విషయం తెలిసిందే.కానీ ఆస్ట్రేలియాలో బయటపడ్డ అవశేషాలు అత్యంత భారీగా ఉందంటున్నారు పరిశోధకులు.

కొన్ని వేల కోట్ల సంవత్సరాల కిందట భూమ్మీద సంచరించిన డైనోసార్లు కాలక్రమంలో వాతావరణ మార్పులతో పూర్తిగా అంతరించిపోయాయి.వీటి అవశేషాలను ఎగ్జిబిషన్లలో మాత్రమే చూడగలుగుతున్నాం.డైనోసార్ల సినిమాలు కూడా చాలానే వచ్చాయి.సినిమాల్ల వాటిని చూస్తే భలే తమాషాగా ఉంటుంది. ఒక్కోటి పెద్ద పెద్ద భవనాలంత ఎత్తులో ఉన్న డైనోసార్లను చూస్తుంటే..ఇంతటి భారీ జంతువులు భూమ్మీద నివసించాయా? అనిపిస్తుంది. ఇప్పటికీ వీటి అవశేషాలు అక్కడక్కడా లభ్యమవుతూనే ఉన్నాయి. ఆస్ట్రేలియాలో దొరికిన డైనోసార్ అవశేషాలు ఓ అతిపెద్ద జాతికి చెందిన డైనోసార్ అవశేషాలు అని పరిశోధకులు గుర్తించారు.

ఆస్ట్రేలియా లభ్యమైన ఈ భారీ డైనోసార్ ఎముకలు ‘కూపర్’ రకం డైనోసార్ కు చెందినవని డాక్టర్ స్కాట్ హాక్నల్, రాబిన్ మెకెంజీలు తెలిపారు. వీటి తాలూకు కొన్ని ఎముకల్ని మొదట్లో ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ కు చెందిన కొందరు పాడిరైతులు 2006లో కనుగొన్నారు. పశువులన్ని మేపుతుండగా వారికి ఓ చోట పేద్ద సైజులో ఏదో ఒక ఆకారం కనిపించింది. అప్పటి నుంచి వీటిపై పరిశోధనలు కొనసాగుతున్న క్రమంలో మరోసారి భారీ డౌనోసార్ అవశేషాలను అధ్యయనకారులు గుర్తించారు.

ఈ అతి భారీ అవశేషాలను బట్టి..డైనోసార్ 5 నుంచి 6.5 మీటర్ల ఎత్తు, 25 నుంచి 30 మీటర్ల పొడవుతో ఉందని అంచనా వేశారు. అంటే ఓ బాస్కెట్ బాల్ కోర్డు అంత పొడవు, రెండంతస్తుల భవంతి అంత ఎత్తు అన్నమాట. పురాజీవ శాస్త్రజ్ఞులు వీటికి ‘ఆస్ట్రలోటైటన్ కూపరెన్సిస్’ అని పేరు పెట్టారు పరిశోధకులు.