Corona Virus In China: వచ్చే ఏడాది చైనాలో కరోనా విధ్వంసం తప్పదా? భయానక విషయాలు వెల్లడించిన నిపుణులు

ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫీగల్ - డింగ్ అంచనా ప్రకారం.. రాబోయే 90 రోజుల్లో చైనా జనాభాలో 60శాతం మంది కరోనా లక్షణాలు కలిగి ఉంటారని, ప్రపంచ వ్యాప్తంగా 10శాతం మంది కరోనా లక్షణాలు కలిగి ఉంటారని వెల్లడించారు. దీనివల్ల చైనాలో మరణాల సంఖ్యసైతం భారీగా ఉంటుందని అంచనా వేశారు.

Corona Virus In China: వచ్చే ఏడాది చైనాలో కరోనా విధ్వంసం తప్పదా? భయానక విషయాలు వెల్లడించిన నిపుణులు

China corona virus

Corona Virus In China: చైనాలో కొవిడ్ మరోసారి పంజా విసురుతోంది. ఆ దేశ ప్రజలు ఆందోళనల మధ్య జీరో కోవిడ్ నిబంధనలను ప్రభుత్వం ఎత్తివేసింది. ప్రస్తుతం ఆ దేశంలో కొవిడ్ నిబంధనలు పెద్ద‌గా కనిపించడం లేదు. ఫలితంగా రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. జ్వరాలతో కొవిడ్ పరీక్షల కోసం క్యూలైన్ల సంఖ్య పెరిగింది. వైద్య సిబ్బంది సైతం అనారోగ్యానికి గురవుతున్నారు. రాయిటర్స్ ప్రకారం.. శ్మశాన వాటికల్లో నిత్యం డజనుకుపైగా మృతదేహాలు ఉంటున్నాయని తెలిపింది. వచ్చే ఏడాది కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుందని, మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫీగల్ – డింగ్ చేసిన అంచనా ప్రకారం.. 2023లో చైనాలో కరోనా విధ్వంసం తప్పదని తెలిపాడు.

China Corona Fears : వెంటిలేటర్లు, ఆక్సిజన్ మెషిన్లకు భారీగా పెరిగిన డిమాండ్.. చైనాలో కరోనా టెర్రర్

ఎరిక్ ఫీగల్ – డింగ్ అంచనా ప్రకారం.. రాబోయే 90 రోజుల్లో చైనా జనాభాలో 60శాతం మంది కరోనా లక్షణాలు కలిగి ఉంటారని, ప్రపంచ వ్యాప్తంగా 10శాతం మంది కరోనా లక్షణాలు కలిగి ఉంటారని వెల్లడించారు. దీనివల్ల చైనాలో మరణాల సంఖ్యసైతం భారీగా ఉంటుందని అంచనా వేశారు. ఎరిక్ ఫీగల్ డింగ్ వాదనకు ప్రాధాన్యత నెలకొంది. దీనికి కారణం.. 2021 సంవత్సరంలో కరోనా విషయంలో ఆయన అంచనాలు సరైనవే అని తేలాయి.

China Corona Cases : ఒక్కరోజే 33వేల కరోనా కేసులు.. చైనాలో మళ్లీ కొవిడ్ విశ్వరూపం

 

ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫిగల్ డింగ్ ట్విటర్ బయో ఎపిడెమియాలజిస్ట్, హెల్త్ ఎకనామిస్ట్ అని పేర్కొంది. అతను 16 సంవత్సరాలు హార్వర్డ్ లో కూడా పనిచేశాడు. చైనాలో కరోనా కేసులు రెట్టింపు కావడం ఎక్కువ రోజులు పట్టదని ఆయన అంచనా వేస్తున్నారు. ఎరిక్ ఫిగల్ డింగ్ ప్రకారం.. బీజింగ్‌లో అంత్యక్రియలు నాన్‌స్టాప్‌గా జరుగుతున్నాయి. మార్చురీలు నిండిపోయాయి. ప్రస్తుతం బీజింట్ లో 2వేల మృతదేహాలను దహనం చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే, 2020లాంటి దారుణ పరిస్థితి మాత్రం కనింపించడం లేదని అన్నారు.