Covid Breath Test: డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ మాదిరే కరోనా పరీక్ష.. నిమిషంలో రిజల్ట్!

కరోనా మన సమాజంలో మిళితమై ఒకటిన్నర ఏడాది గడిచిపోయింది. ఈ సమయంలో కరోనాను అంతం చేసేందుకు ఎన్నో ప్రయోగాలు చేసిన నిపుణులు చివరికి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చారు. పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ జరిపేందుకు మరికొంత సమయం..

Covid Breath Test: డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ మాదిరే కరోనా పరీక్ష.. నిమిషంలో రిజల్ట్!

Covid Breath Test

Covid Breath Test: కరోనా మన సమాజంలో మిళితమై ఒకటిన్నర ఏడాది గడిచిపోయింది. ఈ సమయంలో కరోనాను అంతం చేసేందుకు ఎన్నో ప్రయోగాలు చేసిన నిపుణులు చివరికి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చారు. పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ జరిపేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉండగా అప్పటి వరకు కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. కరోనా కట్టడిలో కీలకం కరోనాను గుర్తించడమే. ర్యాపిడ్ టెస్ట్, ఆర్టీపీసిఆర్, సీటీ స్కాన్, చెస్ట్ ఎక్సరే ఇలా ఎన్నో పద్దతులలో కరోనా నిర్ధారణ చేస్తుండగా త్వరలోనే ఇంట్లోనే టెస్ట్ చేసుకొనేలా కిట్స్ కూడా రానున్నాయి.

అయితే.. అవన్నీ ఎంతోకొంత సమయం.. రిస్క్ తో కూడుకున్నదే కాగా సింగపూర్ పరిశోధకులు మరింత సింపుల్ గా శ్వాస ద్వారానే కరోనాను నిర్ధారించేలా మరో విధానాన్ని రూపొందించారు. ఇందులో కేవలం ఒకే నిమిషంలో కోవిడ్ నిర్ధారణ కానుంది. ఈ విధానంలో ఒక వ్యక్తి శ్వాసను విశ్లేషించి కరోనా ఆనవాళ్లను పట్టేస్తుంది. ఈ పరీక్షకు సింగపూర్‌ ప్రభుత్వం తాజాగా తాత్కాలిక అనుమతి మంజూరు చేయగా మరింత లోతుగా పరిశీలనా జరుగుతుంది. నిజానికి ఇది బ్రీత్ ఎనలైజర్ సాయంతోనే కరోనా ఆనవాళ్లను గుర్తిస్తుంది.

మద్యం సేవించి వాహనాలను నడిపేవారిని గుర్తించడానికి పోలీసులు బ్రీత్ ఎనలైజర్ ద్వారా శ్వాస పరీక్ష నిర్వహిస్తుంటారు. సింగపూర్ పరిశోధకులు కరోనా నిర్ధారణకు రూపొందించిన విధానంలో కూడా డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ మాదిరే పరీక్ష చేయనున్నారు. ఈ పద్దతిలో ఒక్క నిమిషంలోనే ఒక వ్యక్తి శ్వాసను విశ్లేషించి కోవిడ్ ఆనవాళ్లను పట్టేస్తుంది. ప్రస్తుతం ఇది అక్కడ అత్యవసరంగా మాత్రమే అనుమతి పొందగా త్వరలో పూర్తిస్థాయి పరీక్షల అనంతరం దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడే ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.