మాస్కులతో ప్రమాదం ముంచుకొస్తోంది : హెచ్చరిస్తున్న నిపుణులు

  • Published By: nagamani ,Published On : October 22, 2020 / 02:56 PM IST
మాస్కులతో ప్రమాదం ముంచుకొస్తోంది : హెచ్చరిస్తున్న నిపుణులు

Face masks are exacerbating the problem of waste on Earth.మాస్క్..ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవితాల్లో భాగంగా మారిపోయింది. కరోనా తెచ్చిన ముప్పుతో మాస్క్ ముఖాలకు అలంకారమైపోయింది. కానీ..కరోనా నుంచి ప్రజలను రక్షించే ఈ మాస్కే అదే ప్రజల పాలిట ప్రమాదంగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కరోనా వైరస్ నుంచి రక్షణ కోసం చిన్నా, పెద్దా అందరూ మాస్కులు ధరిస్తున్నారు. ఈ మాస్కుల్లో వీటిలో చాలా వరకు యూజ్ అండ్ త్రో మాస్కులే ఎక్కువగా ఉంటున్నాయి.



ఇలా ఏ రోజుకు ఆ రోజు వాడి పారేసే మాస్కుల వల్ల మరింత ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా కేసులు ఎక్కువగా ఉంటున్న బ్రిటన్‌లో ప్లాస్టిక్ మాస్కుల వినియోగం చాలా ఎక్కువగా ఉందట. బ్రిటన్ వాసులు రోజుకో మాస్కు చొప్పున ఉపయోగిస్తే ఏడాదికి 66 వేల టన్నుల కలుషిత వ్యర్థాలు..57 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.


వైరస్ అంటుకున్న మాస్కులు మట్టిలో కూరుకుపోవడం..అవి జలాల్లో కలవడం వల్ల అది మరింత ప్రమాదంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు పోరాడుతునే ఉన్నాయి. కానీ కరోనా వచ్చిన లాక్ డౌన్ వల్ల కాలుష్యం తగ్గినా అదేకరోనా తరువాత ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్లాస్టిక్ మాస్కులు, గ్లౌజులను వాడకం పెరగటంతో ప్రమాదం ముంచుకురానుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


కాబట్టి మాస్కుల వినియోగం మరో విపత్తుకు దారితీయక మునుపే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. భూమిలో కలిసిపోయే మాస్కులను తయారుచేయాలని..వాటినే వాడాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే యూజ్ అండ్ త్రో మాస్కులు కాకుండా పలుమార్లు ఉపయోగించే మాస్కులనే వాడలని అలా చేయటం వల్ల ముప్పు నుంచి బయట పడవచ్చని చెబుతున్నారు.


కాగా..ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాపించటానికి కారణమైన చైనాయే ప్రపంచ వ్యాప్తంగా మాస్కులు తయారుచేయటంతో ముందుంది. 2020 ఫిబ్రవరి నాటికి చైనా కంపెనీలు రోజుకు 11.60 కోట్ల యూనిట్ల మాస్కులు ఉత్పత్తి చేసేవని లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆ ఉత్పత్తి మరింతగా పెరిగింది. ఈ క్రమంలో వాడి పారేసే మాస్కులే ముందు ముందు ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగి ప్రమాదానికి దారితీసే అవకాశాలున్నాయనీ..కాబట్టి యూజ్ అండ్ త్రో మాస్కులు కాకుండా మళ్లీ మళ్లీ ఉపయోగించే మాస్కులను వాడితే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చంటున్నారు నిపుణులు.