కరోనా వైరస్ : ఆ బీర్ సేల్స్ ఢమాల్..ఎందుకు ?

  • Published By: madhu ,Published On : January 29, 2020 / 04:29 AM IST
కరోనా వైరస్ : ఆ బీర్ సేల్స్ ఢమాల్..ఎందుకు ?

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో మొదలైన ఈ వైరస్..మెల్లిమెల్లిగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. చైనాలో వుహానాలో ఈ వైరస్ ధాటికి చాలా మంది చనిపోతున్నారు. 110 మంది వరకు మృతి చెందినట్లు అంచనా. అయితే..ఓ బీర్ కంపెనీ మాత్రం తల పట్టుకొంటోంది. ఇదేం వైరస్‌రా బాబు..అంటోంది. ఎందుకంటే..ఆ బీర్ల కంపెనీల సేల్స్ అమాంతం పడిపోయాయి. కరోనా వైరస్‌కు బీర్‌కూ ఏమి సంబంధం ? కరోనా వల్ల ఇతర బీర్ల అమ్మకాలు ఎందుకు పడిపోవడం లేదు అని అనుకుంటున్నారా ? 

బీర్ కంపెనీ పేరు కరోనా..అందుకే ఈ బీర్ చెబితేనే భయపడిపోతున్నారు. తమకు ఈ బీర్ వద్దంటూ..చెబుతున్నారు మద్యం ప్రియులు. సాధారణంగా కరోనా బీర్‌కు చాలా డిమాండ్ ఉంటుంది. మార్కెట్లో దొరుకుతున్న బీర్ల రేట్లకు..ఈ బీర్ల రేటు డబుల్‌గా ఉంటుంది. కరోనా వైరస్ పుణ్యమా అని..ఈ బీర్ తాగితే వైరస్ అంటుకుంటుందనే పుకార్లు షికార్లతో ఆ కంపెనీ యొక్క సేల్స్ అమాంతం పడిపోయాయి. కరోనా బీర్ వైరస్ కోసం గూగుల్స్‌లో అధికంగా నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారంట. 

కరోనా వైరస్‌కు ఈ బీర్‌కు ఎలాంటి సంబంధం లేదంటున్నారు కంపెనీ యాజమాన్యం. ఒక్క పేరు తప్ప అంటున్నారు. మార్కెట్‌లో అన్ని బీర్లు ఉండగా..ఈ బీరే ఎందుకు తాగాలి అంటున్నారంట. కానీ..కరోనా బీర్ల సేల్స్ పడిపోతుండడంతో కంపెనీ యాజమాన్యం ఏం చేయాలా ? అని ఆలోచిస్తోందంట. 

భారతదేశంలో కరోనా వైరస్‌కు సంబంధించిన లక్షణాలు ఓ రోగిలో కనిపించినట్లు తెలుస్తోంది. చైనాలో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసి వచ్చిన వైద్యుడు కరోనా వైరస్ బారిన పడ్డాడనే అనుమానంతో ఎస్ఎంఎస్ ఆస్పత్రిలో ఒంటరిగా ఉంచినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి రఘుశర్మ వెల్లడించారు. 

Read More : ఎవరు చేశారు : మంటల్లో బాలిక..90 శాతం కాలిన గాయాలు