డేంజర్ బెల్స్ : ప్రపంచవ్యాప్తంగా 60శాతం జనాభాకు కరోనా వైరస్ సోకే ప్రమాదం

కరోనా వైరస్(coronavirus).. ఇప్పుడీ పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది. చైనాలోని వుహాన్(wuhan) లో పుట్టిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వెయ్యి మంది ప్రాణాలు

  • Published By: veegamteam ,Published On : February 11, 2020 / 11:40 AM IST
డేంజర్ బెల్స్ : ప్రపంచవ్యాప్తంగా 60శాతం జనాభాకు కరోనా వైరస్ సోకే ప్రమాదం

కరోనా వైరస్(coronavirus).. ఇప్పుడీ పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది. చైనాలోని వుహాన్(wuhan) లో పుట్టిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వెయ్యి మంది ప్రాణాలు

కరోనా వైరస్(coronavirus).. ఇప్పుడీ పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది. చైనాలోని వుహాన్(wuhan) లో పుట్టిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వెయ్యి మంది ప్రాణాలు పోయాయి. దాదాపు 43వేల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. రోజురోజుకి కరోనా విజృంభిస్తోంది. చైనా నుంచి ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాపిస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుక్కోలేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా కరోనా వైరస్ గురించి షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. వీలైనంత త్వరగా కరోనాను కంట్రోల్ చెయ్యలేకపోతే.. ప్రపంచవ్యాప్తంగా 60 నుంచి 80శాతం మంది జనాభాకు కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని హాంకాంగ్ కు చెందిన పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

”ప్రపంచవ్యాప్తంగా 60 నుంచి 80శాతం జనాభాకు కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంది. వెంటనే కరోనాని కంట్రోల్ చేయాలి. కరోనాకి చెక్ పెట్టాలి. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి. లేదంటే పరిస్థితి చేయి దాటిపోతుంది. తీరని నష్టం జరుగుతుంది”- హాంకాంగ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ ఉన్నతాధికారి లెంగ్.. 

చైనాలో ఉంటున్న వారికే కాదు.. అసలు చైనాకి వెళ్లని వారికి కూడా కరోనా వైరస్ సోకుతోంది. ఇది చాలా ప్రమాదకరమైన అంశం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కరోనా వైరస్ సోకిన వ్యక్తి ద్వారా మరో ఐదుగురికి వైరస్ వ్యాపిస్తుందని చెప్పారు. కరోనా వైరస్ ఏ విధంగా వ్యాపిస్తుంది అనే దాని గురించి ఇప్పటికీ శాస్త్రవేత్తలు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. వైరస్ ఎక్కువగా దగ్గు ద్వారా వ్యాపిస్తుందా లేక జలుబు ద్వారానా అనేది కన్ ఫర్మ్ గా చెప్పలేకపోతున్నారు. వైరస్ గురించి ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వైరస్ ఎలా వచ్చింది? ఎలా వ్యాపిస్తుంది? అనే దానిపైనే ఇప్పటివరకు క్లారిటీ లేదు.. ఇక.. వ్యాక్సిన్ కనుక్కోవడం అంత ఈజీ కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏది ఏమైనా వీలైనంత త్వరగా కరోనాని కట్టడి చెయ్యలేకపోతే మాత్రం.. ఊహించని ఘోరం జరిగిపోతుందని శాస్త్రవేత్తలు భయాందోళన చెందుతున్నారు.

అదే సమయంలో కొన్ని ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఇంకా ఎన్ని రోజులు స్కూల్స్ బంద్ చేయాలి?
నగరాలను ఇంకా ఎంత కాలం లాక్ చేసి ఉంచాలి? 
షాపింగ్ మాల్స్ కు రాకుండా ప్రజలను ఎన్ని రోజులు నియంత్రించాలి? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. ఒకవేళ ఆంక్షలు ఎత్తివేస్తే.. మళ్లీ కరోనా వైరస్ మరింతగా విజృంభించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా దేశాల్లో నమోదైన కరోనా కేసులు:
* చైనాలో 42వేలు
* సింగపూర్ లో 45
* థాయ్ లాండ్ లో 32
* సౌత్ కొరియాలో 28
* జపాన్ లో 26

* వియత్నాంలో 18
* మలేషియాలో 18
* ఫ్రాన్స్ లో 11
* ఆస్ట్రేలియాలో 15
* అమెరికాలో 13

* యూకేలో 8
* యూఏఈలో 8
* కెనడాలో 7
* భారత్ లో 3
* రష్యాలో 2
* జర్మనీలో 1
* బెల్జియంలో 1
* శ్రీలంకలో 1

వైరస్ తీవ్రతతో ఇళ్లు, అపార్ట్‌మెంట్లను వీడి ప్రజలను బయటకు రానివ్వడం లేదు అధికారులు. ఎంత అత్యవసర పరిస్థితి అయినా గడప దాటి బయటకు పంపించడం లేదు. బలవంతంగా ఇంటి డోర్లు మూసేశారు. ఇంతకాలం ప్రజలు, పర్యాటకులతో కళకళలాడిన వూహాన్ నగరం.. కరోనా వైరస్ కారణంగా శ్మశానాన్ని తలపిస్తోంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి.. కరోనా మృతులతో డెడ్ సిటీగా మారింది. వూహాన్ వాసులంతా ఇప్పుడు ఆస్పత్రుల్లో లేదా ఇంట్లో మాత్రమే ఉంటున్నారు. నగరంలోని అన్ని వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. రోడ్లన్నీ ఖాళీగా దర్శనిమిస్తున్నాయి. కాగా, నిత్యవసరాలకు ఇబ్బందులు లేకుండా చైనా సర్కారు చూస్తోంది. అవసరమైన వస్తువులను డోర్ డెలివరీ చేస్తోంది. వైరస్ తీవ్రత తగ్గేవరకు ప్రజలు బయటకు రావద్దని చైనా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.