ప్రతి వందేళ్లకోసారి మానవాళిని చంపేస్తున్న మహమ్మారి.. ఇప్పుడు కరోనా వంతు వచ్చిందా..

కరోనా వైరస్..(కొవిడ్-19).. చైనాలోని వుహాన్ కేంద్రంగా రెండు నెలల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడింది.

  • Published By: veegamteam ,Published On : March 4, 2020 / 03:20 AM IST
ప్రతి వందేళ్లకోసారి మానవాళిని చంపేస్తున్న మహమ్మారి.. ఇప్పుడు కరోనా వంతు వచ్చిందా..

కరోనా వైరస్..(కొవిడ్-19).. చైనాలోని వుహాన్ కేంద్రంగా రెండు నెలల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడింది.

కరోనా వైరస్..(కొవిడ్-19).. చైనాలోని వుహాన్ కేంద్రంగా రెండు నెలల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడింది. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపుతోంది. ప్రజల ప్రాణాలు తీసేస్తోంది. 80 దేశాలకు కరోనా వ్యాపించింది. కరోనా బారిన పడ్డ వారి సంఖ్య లక్షకు చేరుతోంది. మృతుల సంఖ్య 3వేలు దాటింది. ప్రస్తుతం కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న పది దేశాల్ని పరిశీలిస్తే… చైనా, దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, సింగపూర్, అమెరికాగా నమోదయ్యాయి. భారత దేశంలోనూ కరోనా వైరస్ కోరలు చాస్తోంది. మన దేశంలో 6 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దీనికి వ్యాక్సిన్ కనిపెట్టలేకపోవడం హడలెత్తిస్తోంది.

కాగా, ఓ ఆసక్తికర అంశం ఇప్పుడు వైరల్ గా మారింది. దాన్ని యాదృచ్చికం అనాలో దేవుడి శాపం అనాలో మరొకటి అనాలో తెలియదు కానీ.. ప్రతి వందేళ్లకు ఒకసారి ఏదో ఒక మహమ్మారి(అంటు వ్యాధి) విజృంభిస్తోంది. మానవాళిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. లక్షల మందిని చంపేస్తోంది. ప్రస్తుతం 2020లో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ని చూస్తుంటే.. ఇది నిజమేనా అనిపిస్తుంది.

ప్రపంచాన్ని వణికించిన ప్లేగ్, కలరా, స్పానిష్ ఫ్లూ:
ప్రపంచ చరిత్రను ఓసారి పరిశీలిస్తే.. ప్రతి వందేళ్లకు ఒక మహమ్మారి వచ్చి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వేల నుంచి లక్షల ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఇప్పుడు మరోసారి అంటే 2020లో ఆ వందేళ్ల సైకిల్ రిపీట్ అయ్యిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రతి వందేళ్లకు ఒకసారి వచ్చిన మహమ్మారి విషయానికి వస్తే.. ముందుగా 1720లో ప్లేగ్ విలయతాండవం చేసింది. 1820లో కలరా కల్లోలం రేపింది. ఇక 1920లో స్పానిష్ ఫ్లూ ప్రపంచాన్ని విలవిలలాడేలా చేసింది. ఇప్పుడు..2020లో కరోనా వైరస్ ఎలాంటి బీభత్సం సృష్టిస్తుందోనని యావత్ ప్రపంచం వణికిపోతోంది.(కరోనా ప్రతి సంవత్సరం వస్తుంది, బాంబు పేల్చిన సైంటిస్టులు)

1720లో ప్లేగ్ మహమ్మారి:
1720లో ఫ్రాన్స్ లోని మర్సైస్ లో(France Marsais) ప్లేగ్ మొదట బయటపడింది. ఎలుకల నుంచి వచ్చిన ఈ వ్యాధి.. ఒక్క ఆ నగరంలోనే 50వేల మందిని బలి తీసుకుంది. తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. దాదాపు ఏడాది పాటు ప్రతాపం చూపింది. ఈ వ్యాధి కారణంగా లక్షల మంది చనిపోయారు. ఊర్లకు ఊర్లు ఊడ్చేసింది. ఆ వ్యాధి తీవ్రత ఎంతలా ఉండేదంటే.. ప్లేగ్ వ్యాధితో మరణించిన వారిని ఒక్కొక్కరిగా పూడ్చి పెట్టడం కష్టంగా మారి సామూహిక దహనాలు చేశారు.

1820లో కలరా:
ప్లేగు వ్యాధికి వందేళ్లు పూర్తి అవుతుండగానే ఈ కలరా(cholera) వ్యాధి బయటపడింది. మన భారత దేశంలోని కోల్ కతా నగరంలో తొలిసారి ప్రబలింది. మన దేశంలో ఇదివరకే చాలాసార్లు కలరా వచ్చినప్పటికి.. ఈసారి ప్రబలిన కలరా మాత్రం యూరప్ వరకు వ్యాపించింది. ఆసియా, యూరప్ ఖండాలను వణికించింది. ఆగ్నేయ ఆసియా దేశాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఈ వ్యాధి కారణంగా లక్షమందికి పైనే చనిపోయారు. బ్యాక్టీరియాతో కలుషితమైన చెరువు నీటిని తాగి ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. కలగా గురించి ఇప్పటికీ ఎక్కడో ఓ చోట వింటూనే ఉంటాము. 

1920లో స్పానిష్ ఫ్లూ:
కలరా వ్యాధి వచ్చిన మరో వందేళ్లకు అంటే 1920లో.. స్పానిష్ ఫ్లూ(spanish flu) వైరస్ వచ్చింది. ఈ ఫ్లూ పేరు చెబితే ఇప్పటికీ అంతా ఉలిక్కిపడతారు. 100 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడగా.. కోటి మంది మరణించారు. ఈ సృష్టిలో అతి పెద్ద విషాదం మిగిల్చిన అతి భయంకరమైన వ్యాధిగా స్పానిష్ ఫ్లూ గుర్తుండి పోతుంది. ప్రపంచ చరిత్రలోనే అత్యధిక ప్రాణాలు బలిగొన్న వైరస్ గా దీన్ని ఇప్పటికీ పరిగణిస్తారు.

2020లో కరోనా వైరస్:
స్పానిష్ ప్లూ వచ్చిన వందేళ్లకు అంటే.. 2020లో.. చైనాలో కరోనా వైరస్ మహమ్మారి వచ్చింది. చైనాలోని వుహాన్ లో వెలుగుచూసిన ఈ వైరస్ ఇప్పుడు అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటికే 80 దేశాలకు వ్యాపించింది. రెండు నెలలు అవుతున్నా.. ఈ వైరస్ కు ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదు. దీంతో ప్రపంచం మొత్తం భయపడుతోంది. ఇప్పటికే 3 వేల మందికి పైగా ఈ వైరస్ కారణంగా చనిపోయారు. లక్ష మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకెంతమందిని ఈ వైరస్ చంపుతుందోనని ప్రజలు వణికిపోతున్నారు. ప్రపంచ చరిత్రను చూస్తుంటే.. ప్రతి వందేళ్లకు ఒకసారి ప్రపంచాన్ని వణికించే ప్రాణాంతక మహమ్మారులు వచ్చాయి. ఇప్పుడు.. కరోనా విజృంభిస్తున్న తీరు చూస్తుంటే.. హిస్టరీ రిపీట్ అవుతుందా అని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.