చైనాలో కరోనా కలకలం, సీఫుడ్‌ ప్యాకింగ్ పై మళ్లీ వైరస్ జాడలు

  • Published By: naveen ,Published On : August 12, 2020 / 11:21 AM IST
చైనాలో కరోనా కలకలం, సీఫుడ్‌ ప్యాకింగ్ పై మళ్లీ వైరస్ జాడలు

చైనాలో కరోనావైరస్ కలకలం రేపుతోంది. సీ ఫుడ్ (సముద్ర ఆహారం) ప్యాకింగ్ పై మళ్లీ మళ్లీ వైరస్ జాడలు కనిపిస్తున్నాయి. తాజాగా దిగుమతి చేసుకున్న ప్రోజన్ సీఫుడ్ ప్యాకింగ్ పై రెండోసారి కరోనా వైరస్ జాడలను గుర్తించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ సముద్ర ఆహారాన్ని పోర్టు సిటీ ఆఫ్ దలియాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. లియాంగ్ లోని నార్త్ ఈస్ట్రన్ ప్రావిన్స్ లోని పోర్టుల్లో దలియాన్ మేజన్ పోర్టు. ఆ పోర్టులో ఇటీవలే కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

ఈస్ట్రన్ షాన్ డోంగ్ ప్రావిన్స్ లోని యాంటాయ్ పోర్టు సిటీలో మూడు కంపెనీల నుంచి సీఫుడ్ తీసుకొచ్చారు. అవన్నీ ప్యాకింగ్ చేసి ఉన్నాయి. ఆ ప్యాకింగ్ పై కరోనా వైరస్ ను కనుగొన్నారు. ప్యాకేజీని ఇంపోర్ట్ చేసుకున్నట్టు కంపెనీ తెలిపింది. కాగా దాన్ని ఎక్కడ తయారు చేశారో తెలియదంది.

జూలైలో కస్టమ్స్ అధికారులు ఈక్వెడార్ నుంచి దిగుమతి చేసుకున్న రొయ్యల ప్యాకింగ్ లపైనా కరోనా వైరస్ జాడలు గుర్తించారు. దాంతో అప్రమత్తమైన చైనా ఈక్వెడార్ నుంచి రొయ్యల దిగుమతిని నిలిపివేసింది. యాంటైలోని కంపెనీల నుంచి దిగుమతి చేసుకున్న సీఫుడ్ లో కొంత భాగాన్ని ఎగుమతి చేసేందుకు ప్రాసెస్ చేసి సిద్ధంగా ఉంచారు. సరుకుని కోల్డ్ స్టోరేజ్ లో ఉంచారు. ఇంకా మార్కెట్ కి పంపలేదని యాంటై ప్రభుత్వం తెలిపింది.

జూలైలో దలియాన్ సిటీలో సీఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో తొలి కరోనా కేసు నమోదైంది. ఆగస్టు 9 నాటికి దలియాన్ సిటీలో 92 కరోనా కేసులు నమోదయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు సరుకులను సీల్ చేశారు. సరుకులు మోసిన కూలీలను క్వారంటైన్ కు పంపారు. కరోనా టెస్ట్ లో వారందరికి నెగిటివ్ వచ్చింది.

2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో కరోనా వైరస్ తొలిసారిగా వెలుగుచూసింది. కరోనా వైరస్ వుహాన్ లోనే పుట్టిందని యావత్ ప్రపంచం నమ్ముతోంది. వుహాన్ లోని సీఫుడ్(సముద్ర ఆహారం) అమ్మే మార్కెట్లు, జంతువుల మాంసం అమ్మే మార్కెట్లలో కరోనా వైరస్ ఉద్భవించిందని అంతా విశ్వసిస్తున్నారు. ఇందుకు కారణం ఆయా ప్రాంతాల్లో నిత్యం ఎక్కువగా తడి వాతావరణం ఉండటమే.