ప్రతి ఖండంలోనూ కరోనానే.. అంటార్కిటికాను వదలని వైరస్..

ప్రతి ఖండంలోనూ కరోనానే.. అంటార్కిటికాను వదలని వైరస్..

ఎక్కడ చూసినా కరోనావైరసే.. ప్రపంచమంతా కరోనానే వ్యాపించి ఉంది. ఎక్కడికి వెళ్లినా కరోనా నుంచి తప్పించుకోవడం కష్టమే. ఒకవైపు.. ప్రపంచమంతా కరోనావైరస్‌తో అల్లకల్లోలమైపోతుంటే.. ఏకైక ఖండం అంటార్కిటికా మాత్రం కరోనా బారినపడలేదు. కానీ, ఇప్పుడు ఆ అంటార్కిటికా ఖండంలోనూ కరోనా వైరస్ వ్యాపించింది. భూగ్రహంపై ఉన్న అన్ని ఖండాల్లో మిగిలిన ఈ ఒక్క అంటార్కిటికా ఖండానికి కూడా కరోనా పాకేసింది. ప్రతి ఖండంలోనూ ప్రపంచమంతా కరోనానే వ్యాపించి ఉంది. భూగ్రహంపై ఎక్కడికి వెళ్లినా కరోనా నుంచి తప్పించుకోలేనంతగా మారిపోయింది. అంటార్కిటికా ఖండంలో మొట్ట మొదటిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. 36 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

రిమోట్ కాంటినెంట్ అయిన అంటార్కిటికాలో వైరస్ వ్యాపించే అవకాశం లేదు. అయినప్పటికీ కరోనావైరస్ వ్యాపించడంతో అక్కడి యంత్రాంగమంతా అప్రమత్తమయ్యారు. ఈ ద్వీపంలోని 13 చిలీ స్థావరాలలో ఇదొకటి. కొత్త కరోనా కేసులు నమోదుకావడంతో అంటార్కిటిక్‌లోని అన్ని ప్రధాన పరిశోధన ప్రాజెక్టులను నిలిపివేశారు. ఫలితంగా, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల పరిశోధనలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఖండంలో శాశ్వత నివాసితులు లేరు.. 1,000 మంది పరిశోధకులు, ఇతర సందర్శకులు మాత్రమే ఈ ద్వీపంలో ఉన్నారని స్పానిష్ మీడియా తెలిపింది. సకాలంలో నివారణ చర్యలు చేపట్టినట్టు చిలీ ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. వెంటనే పిసిఆర్ పరీక్షలు చేయడంతో వైరస్ నియంత్రణకు సాధ్యపడిందని తెలిపింది.

రీసెర్చ్‌ బేస్‌కు వచ్చిన ఓడలో ముగ్గురు సిబ్బందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని నివేదించింది. పాజిటివ్ వచ్చిన 36 మందిని చిలీలోని పుంటా అరేనాస్ నగరానికి తరలించారు. ఐసోలేషన్ లో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉందని నివేదించింది. అతి శీతల ఉష్ణోగ్రతలతో, ఖండంలో ఇప్పటికే ప్రమాదకరంగా మారింది. అంటార్కిటికా కఠినమైన వాతావరణంలో గణనీయమైన మరణాలు నమోదయ్యాయి. చిలీలో 5లక్షల 90వేల కంటే ఎక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 16,200 వరకు కరోనా మరణాలు నమోదయ్యాయని జాన్స్ హాప్ కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది. బుధవారం నాటికి చిలీ మొత్తం ధ్రువీకరణ కరోనా కేసులతో ప్రపంచంలో 24వ ర్యాంకులో నిలిచింది.