మ‌ళ్లీ క‌రోనా పంజా : 1255 విమానాలు క్యాన్సిల్‌

  • Published By: madhu ,Published On : June 17, 2020 / 05:46 AM IST
మ‌ళ్లీ క‌రోనా పంజా : 1255 విమానాలు క్యాన్సిల్‌

క‌రోనా వైర‌స్ ఇప్ప‌ట్లో త‌గ్గుముఖం ప‌ట్టేలా క‌నిపించ‌డం లేదు. క్ర‌మ‌క్ర‌మంగా విస్త‌రిస్తూనే ఉంది. పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ వ‌ణికిస్తున్న చైనా నుంచి వ‌చ్చిన ఈ రాకాసి కార‌ణంగా పిట్ట‌ల్లా ప్రాణాలు పోతున్నాయి. క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి.

ఒక్కో దేశంలో ఒక్కో విధంగా వైర‌స్ విస్త‌రిస్తోంది. క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని సంతోషం వ్య‌క్తం చేసిన దేశాల్లో మ‌రోసారి కేసులు న‌మోదు కావ‌డం భ‌యాందోళ‌న‌లు రేకేత్తిస్తోంది. న్యూజిలాండ్ లో రెండు కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. చైనాలో కూడా మ‌రోసారి వైర‌స్ విస్త‌రిస్తుంద‌నే వార్త‌లు వెలువ‌డుతున్నాయి. తాజాగా బీజీంగ్ లో రెండో ద‌ఫా క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డుతుండ‌డం అక్క‌డి వారు భ‌యం భ‌యంగా గ‌డుపుతున్నారు. 31 పాజిటివ్ కేసులు రికార్డ‌య్యాయి. 

కేసులు రికార్డ‌వుతుండ‌డంతో అధికారులు అల‌ర్ట్ అయ్యారు. ఓ మార్కెట్ నుంచి వైర‌స్ విస్త‌రించింద‌ని గుర్తించారు. గ‌త 5 రోజుల్లోనే..పాజ‌టివ్ కేసుల సంఖ్య 100కు చేరుకుంది. ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని అధికారులు సూచించారు. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి చేసేందుకు సుమారు 1255 విమానాల‌ను ర‌ద్దు చేసింది బీజింగ్ ప్ర‌భుత్వం. దాదాపు 70 శాతం విమ‌నాల రాక‌పోక‌లు సాగ‌క‌వ‌ని అంచ‌నా. ప్రైమ‌రీ, హై స్కూల్ విద్యార్థులు క్యాంప‌స్ కు రావొద్ద‌ని ఆదేశించారు అధికారులు. 

Read: మంచి దొంగలు : దోచుకున్న సొమ్మంతా తిరిగి ఇచ్చేశారు