Social Media Star: సోషల్ మీడియా స్టార్‌‌ని చంపేసిన సోదరుడు.. జైలు నుంచి విడుదల!

సోషల్ మీడియా స్టార్‌, పాకిస్తాన్ మోడల్ ఖండీల్ బలోచ్‌(25)ని చంపిన సోదరుడు వసీమ్ బలోచ్‌ను పాకిస్తాన్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

Social Media Star: సోషల్ మీడియా స్టార్‌‌ని చంపేసిన సోదరుడు.. జైలు నుంచి విడుదల!

Khandeel Bhaloch

Social Media Star: సోషల్ మీడియా స్టార్‌, పాకిస్తాన్ మోడల్ ఖండీల్ బలోచ్‌(25)ని చంపిన సోదరుడు వసీమ్ బలోచ్‌ను పాకిస్తాన్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మూడేళ్ల తర్వాత వసీం విడుదలయ్యాడు.

సోషల్ మీడియాలో అసభ్యకరమైన ఫోటోలను పోస్ట్ చేస్తుందనే ఆగ్రహంతోనే తాను తన చెల్లెలిని హతమార్చినట్లు 2016లో వసీం ఓ వీడియోలో అంగీకరించాడు. సోదరి వల్ల కుటుంబ పరువు ప్రతిష్టలు మంటగలిసిపోతున్నాయనే కోపంతో రగిలిపోయిన వసీం.. చాలాసార్లు హెచ్చరించినా మార్పు రాలేదని చంపేసినట్లు వెల్లడించాడు.

ఇది పరువు హత్యేనని పోలీసులు మొదటి నుంచి భావిస్తూ వచ్చారు. చివరకు వసీం ప్రకటనతో అది నిజమని వెల్లడైంది. ఖండీల్ బలోచ్ అసలు పేరు ఫౌజియా అజీమ్. కానీ మోడలింగ్‌లోకి వచ్చిన తర్వాత ఆమె పేరు మార్చుకుంది.

సోషల్ మీడియాలో తన ఫొటోలు, వీడియోలతో వివాదాస్పద వ్యక్తిగా మారింది. ఖండీల్ బలోచ్‌ని చంపి నేరం అంగీకరించిన తర్వాత కూడా తాను చేసిన నేరాన్ని నేరంగా పరిగణించొద్దని కోర్టును అభ్యర్థించాడు వసీం బలోచ్. 2019లో వసీంకి జీవిత ఖైదు పడింది.

అయితే, పాకిస్తాన్ చట్టాల ప్రకారం.. కుటుంబ సభ్యులను ఎవరైనా హత్య చేస్తే, ఇతర కుటుంబ సభ్యులు ఆ హత్యను సమర్థిస్తే, ఆ కేసులో శిక్ష పడదు. దీనిని వినియోగించుకునే ఖండీల్ బలోచ్‌ను హత్య చేసేందుకు ఓ మత పెద్ద, బలోచ్ మాజీ భర్త హుస్సేన్ వసీంను ప్రోత్సహించారని చెబుతారు.

ఫత్వాలే చట్టాలైన పాకిస్తాన్‌లో ఖండీల్ బలోచ్‌ని చంపేసినా వసీంను కుటుంబం వదులుకోదని, క్షమిస్తుందని మతపెద్ద సూచించడంతో ఈ హత్య జరిగిందని తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలని కోరుతూ గతంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌ను కోరి వైరల్‌గా మారింది.

టీ-20 వరల్డ్ కప్‌లో పాక్ పేలవ ప్రదర్శనపై అప్పట్లో యూట్యూబ్‌లో వీడియో పెట్టి బలోచ్ సంచలనం సృష్టించింది. పాకిస్థాన్ టీ-20 ప్రపంచ కప్‌ను గెలిస్తే నగ్నంగా డ్యాన్స్ చేస్తానని ప్రకటించడం సంచలనం అయ్యింది.

“ఆడపిల్లలు ఇంట్లో ఉండటానికి, సంప్రదాయాలను పాటించడానికి పుట్టారు. నా సోదరి ఎప్పుడూ అలా చేయలేదు.” అందుకే చంపేశాను. అంటూ వసీం బలోచ్ చెప్పిన మాటలు మహిళా సంఘాలకు ఆగ్రహం తెప్పించాయి.