Covid 19: లెక్కకు మించి మూడు రెట్లు అధికంగా కరోనా మరణాలు.. డ‌బ్ల్యూహెచ్‌వో ప్రకటన!

క‌రోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఒకటిన్నర సంవత్సరంలో ప్రపంచాన్ని రెండు సార్లు చుట్టేసిన ఈ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు సైతం వణికిపోయిన పరిస్థితిని మనం చూశాం. ఇప్పటికీ విస్తృత వ్యాప్తి కొనసాగిస్తున్న కరోనా మన దేశంలో కూడా రోజుకి వేలమందిని పొట్టన పెట్టుకుంటుంది.

Covid 19: లెక్కకు మించి మూడు రెట్లు అధికంగా కరోనా మరణాలు.. డ‌బ్ల్యూహెచ్‌వో ప్రకటన!

Covid 19 Three Times More Corona Deaths Than Counted Who Announcement

Covid 19: క‌రోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఒకటిన్నర సంవత్సరంలో ప్రపంచాన్ని రెండు సార్లు చుట్టేసిన ఈ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు సైతం వణికిపోయిన పరిస్థితిని మనం చూశాం. ఇప్పటికీ విస్తృత వ్యాప్తి కొనసాగిస్తున్న కరోనా మన దేశంలో కూడా రోజుకి వేలమందిని పొట్టన పెట్టుకుంటుంది. మన దేశంలో కూడా రోజుకి లక్షలలోనే కొత్త కేసులు నమోదవుతుండగా వేలల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయితే.. ప్రభుత్వాలు అధికారికంగా చెప్పే లెక్కల మీద మరో మూడు రేట్లు అధికంగానే ప్రాణాలు పోతున్నాయని డబుల్యుహెచ్ఓ చెప్తుంది.

అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ కోవిడ్ డేటా ప్ర‌కారం.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారు 17 కోట్ల మందికి వైర‌స్ సంక్ర‌మించగా.. ఇప్ప‌టి వ‌ర‌కు 35 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించారు. అమెరికాలో 33.0 ల‌క్ష‌ల మందికి వైర‌స్ సోక‌గా.. 5.88 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించారు. ఇక అదే ఇండియాలో 26 ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు న‌మోదు కాగా 2.90 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించారు. బ్రెజిల్‌లో కూడా మ‌ర‌ణాల సంఖ్య ఎక్కువ‌గానే ఉన్న‌ది. బ్రెజిల్‌లో 15 ల‌క్ష‌ల మందికి వైర‌స్ సోక‌గా.. దాంట్లో 4.41 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించారు.

అయితే, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసులు, మరణాలపై శుక్రవారం ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ వ‌ల్ల సంభ‌వించిన మ‌ర‌ణాల సంఖ్యను చూస్తే.. అధికారిక లెక్క‌ల క‌న్నా మూడు రెట్లు అధికంగా ఉంటుంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో పేర్కొన్న‌ది. అంటే.. మహమ్మారి కారణంగా చనిపోయిన వారుగా ప్రభుత్వాలు చెప్పే లెక్కల మీద మరో మూడు రేట్లు ఈ మరణాలు అధికంగా ఉన్నాయని డబుల్యుహెచ్ఓ ప్రకటించింది. ఇప్పటికీ కొన్ని దేశాలు ఈ మహమ్మారిపై పోరాటం చేస్తుండగా ఇది ఎప్పటి వరకు కొనసాగుతుందో.. ఈ మరణ మృదంగం ఎక్కడివరకు కొనసాగుతుందోనని డబుల్యుహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది.