Japan : ఒలింపిక్స్​ గ్రామంలో మరో 19 మందికి పాజిటివ్..100 దాటేసిన కరోనా కేసులు!

జపాన్ లోని ఒలింపిక్ గ్రామంలో కొత్తగా మరో 19మందికి పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో మొత్తం కరోనా కేసులు 100 దాటేశాయి. ఇలా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఒలింపిక్ క్రీడల్ని రద్దు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది ప్రజల నుంచి.

Japan : ఒలింపిక్స్​ గ్రామంలో మరో 19 మందికి పాజిటివ్..100 దాటేసిన కరోనా కేసులు!

Japan Olympics

Tokyo Olympics Covid-19 cases cross 100 : ఈ కరోనా కాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఒలింపిక్ క్రీడల్ని నిర్వహిస్తున్నారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసున్నా కరోనా వెంటాడుతూనే ఉంది. కరోనా వల్ల ఇప్పటికే ఒలింపిక్ క్రీడలు ఆలస్యమైయ్యాయి. 2020లోనే జరగాల్సిన క్రీడలు 2021లో జరుగుతున్నాయి. కానీ కరోనా మాత్రం వదల బొమ్మాలి అంటోంది. ఈ క్రమంలో జపాన్ లోని ఒలింపిక్ గ్రామంలో కొత్తగా మరో 19మందికి పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో మొత్తం కరోనా కేసులు 100 దాటి 106కు చేరాయి. ఇలా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఒలింపిక్ క్రీడల్ని రద్దు చేయాలనే డిమాండ్ వస్తోంది ప్రజల నుంచి.

ఒలింపిక్స్ గ్రామంలో మరో 19 మందికి పాజిటివ్ గా తేలినట్టు ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ తాజాగా ఈరోజే (జులై 23,2021) ప్రకటించింది. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య వంద దాటేసింది. పాజిటివ్ వచ్చిన వారిలో ముగ్గురు క్రీడాకారులు, 10 మంది సిబ్బంది, ముగ్గురు మీడియా సిబ్బంది, మరో ముగ్గురు ఈవెంట్ కాంట్రాక్టర్లున్నారని కమిటీ తెలిపింది.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 106కు పెరిగిందని తెలిపింది. చెక్ రిపబ్లిక్ కు చెందిన నాలుగవ క్రీడాకారుడికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆ దేశానికి చెందిన ఆరుగురు కరోనా బారిన పడ్డారని..ఒలింపిక్స్ విలేజ్ లో ఆ దేశానివే ఎక్కువ కేసులని తేలింది.

కాగా, కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఒలింపిక్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జపాన్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగే వేదిక వద్దకు వెళ్లి మరీ నిరసనలు వ్యక్తం చేశారు. ఒలింపిక్స్ జ్యోతిని తీసుకొస్తున్న సందర్భంగా జపాన్ వాసులు టోక్యో మెట్రోపాలిటన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనలు జపాన్ పోలీసులు అడ్డుకుంటున్నారని వారు వాపోయారు.